Leaders of of the ruling party
-
పైసాచకుడు
► ఆ ఎమ్మెల్యే పీఏ వసూల్ రాజా! ► పోస్టింగ్‌లు.. బదిలీలు అన్నింటికీ మామూళ్లు ► ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ఎర ► ఇప్పటికే రూ.10కోట్ల వసూలు ► వాటా కోసం కాంట్రాక్టర్లకు బెదిరింపులు ► విజిలెన్స్‌కు ఫిర్యాదుల పరంపర అధికార పార్టీ నాయకులే కాదు.. వీరి చాటు ఉద్యోగుల అవినీతి కూడా పరాకాష్టకు చేరింది. నేతల పేరు చెప్పి కొందరు.. ‘వ్యక్తిగత’ ప్రాభవంతో ఇంకొందరు.. దోపిడీకి తెర తీశారు. ఈ కోవలో ఓ ఎమ్మెల్యే పీఏ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రమేయం ఎంత మేరకు ఉందో కానీ.. ఈ సహాయకుడు మాత్రం అందరినీ పీల్చి పిప్పి చేస్తున్నాడు. వసూళ్ల పర్వం వేలు.. లక్షలు దాటి.. కోట్లకు చేరుకుందంటే ఈ ‘పైసా’చకుడు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో అర్థమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు(పర్సనల్ అసిస్టెంట్)పై ఫిర్యాదుల పరంపర మొదలయింది. సదరు పీఏపై విచారణ చేయాలంటూ విజిలెన్స్ విభాగానికి భారీగా ఫిర్యాదులు వచ్చి చేరుతున్నాయి. ఉద్యోగుల పోస్టింగ్ మొదలు బదిలీల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారనేది వాటిలోని సారాంశం. అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో నిరుద్యోగల నుంచి దోచుకుంటున్నట్లు విజిలెన్స్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు తెలిపారని సమాచారం. ఇక ప్రతి పనిలోనూ వాటాలను అడుగుతున్నారని.. ఇవ్వకపోతే పనులు జరగనివ్వడం లేదని కూడా వాపోయారని తెలిసింది. అయితే, ఇది కేవలం పీఏ పనేనా.. సదరు ఎమ్మెల్యే ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో విచారణ జరపాలని కూడా బాధితులు విజిలెన్స్ అధికారులను కోరినట్టు చర్చ జరుగుతోంది. మొత్తం మీద అధికార పార్టీ నేతలే కాకుండా వారి సహాయ సిబ్బంది అవినీతి కూడా రోజురోజుకీ పెరిగిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి నుంచీ అదే తీరు వాస్తవానికి సదరు ఎమ్మెల్యే పీఏ వ్యవహారశైలి మొదటి నుంచీ విమర్శల పాలవుతోంది. అంతా తానే.. అనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలోని పలువురు కాంట్రాక్టర్లను పీఏ నేరుగా బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నేరుగా ఎమ్మెల్యే పేరు వాడుకుంటూ లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సొంత పార్టీలోని నేతల ఫిర్యాదులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు ఎమ్మెల్యేకు.. ఇప్పుడు పీఏ వ్యవహారం మరింత తలనొప్పిగా మారనుంది. ఇదిగో ఉద్యోగాల జాబితా తాజాగా సదరు పీఏ మునిసిపాలిటీలో ఉద్యోగాల పేరుతో ఏకంగా రూ.10 కోట్ల మేరకు వసూలు చేశారని సమాచారం. ఈ విషయం కూడా విజిలెన్స్‌కు వచ్చిన ఫిర్యాదులో ఉందని తెలిసింది. మునిసిపాలిటీలో వివిధ రకాల 40 పోస్టులను(డీఈ,ఏఈ, స్వీపరు, వాచ్మెన్, క్లర్క్ వగైరా) భర్తీ చేస్తున్నామని.. ఈ పోస్టులు కావాల్సిన వారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చెల్లించాలని బహిరంగ బేరం పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి ఏఈ, డీఈ పోస్టులను నేరుగా భర్తీ చేసే అవకాశం లేదు. వీటిని ఏపీపీఎస్సీ భర్తీ చేస్తోంది. అయితే, ఈ పోస్టులను కూడా అవుట్‌సోర్సింగ్‌లో తీసుకుంటున్నామని నమ్మించినట్టు తెలుస్తోంది. ఇలా ప్రధానంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేశారని సమాచారం. ఇక స్వీపర్, వాచ్మెన్ పోస్టులకు కూడా లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. మొత్తం మీద ఉద్యోగాల పేరిట రూ.10 కోట్ల వరకూ వసూలు చేశారని విజిలెన్స్‌కు ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీఏపై త్వరలో విజిలెన్స్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే, విచారణ జరగకుండా పైరవీలు కూడా మరోవైపు ప్రారంభమైనట్టు వినికిడి. -
నీరు-చెట్టులో మితిమీరిన అవినీతి
► వాటాల కోసం అధికారులపై టీడీపీ నాయకుల ఒత్తిడి ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు(సెంట్రల్): నీరు-చెట్టు పథకంలో అధికార పార్టీ నాయకులు మితిమీరిన అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరు చెట్టు పథకం టీడీపీ నాయకుల ఇళ్లలో అవినీతి చెట్టుగా మారిందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి పనిలో టీడీపీ నేతలు వాటాలు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ప్రతి పనికీ అధికారులపై వాటాల కోసం ఒత్తిడి తెస్తున్నారన్నారు. మామూళ్లు ఇవ్వని అధికారులను ఏసీబీకి పట్టిం చడం వంటి పనులకు కూడా టీడీపీ నాయకులు పూనుకునే స్థాయికి చేరుకున్నారన్నారు. నీటి సంఘాల ఎన్నికల్లో కూడా దౌర్జన్యాలకు పాల్పడి వైఎస్సార్సీపీ ఉన్న చోట కూడా బలవంతంగా టీడీపీ నాయకులనే నీటి సంఘాల అధ్యక్షులుగా నియమించారని ఆరోపించారు. వారిని అడ్డంపెట్టుకుని నీరు చెట్టు పథకంలోని ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. నీరు చెట్టు పథకం కింద కోట్ల రూపాయలు అవినీతి పాల్పడుతున్నారన్నారు. కండలేరు, నెల్లూరులోని భూగర్భడ్రెయినేజీ తదితర పనులను సొంత కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు. సంగం బ్యారేజీ పనులు నత్త నడకన సాగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల పరిశీలించినా ఏ మాత్రం మార్పు లేదన్నారు. ఈ పనుల విషయలో అంచనాలు పెంచి కమీషన్ల కో సం కక్కుర్తి పడుతున్నారన్నారు. కొన్ని శా ఖల అధికారుల వద్ద బలవంతంగా మా మూళ్లు తీసుకుంటూ వారిచేత అవినీతి చేయించడం నిజం కాదా అని ప్రశ్నిం చారు. జిల్లా యువత విభాగం అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, బీసీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య, శివప్రసాద్, చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి విష్టువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇరిగేషన్లో అవినీటి పూడిక
► పర్సంటేజ్లకు ఫిక్స్డ్ రేట్లు ► పట్టుబడుతున్న అధికారులు ► తికమకపడుతున్న అధికారపార్టీ నాయకులు ► పనుల నాణ్యత గాలికి ఇరిగేషన్‌శాఖలో పేరుకుపోయిన అవినీతి పూడికను తొలగించే సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. కాలువల్లో పూడిక తొలగింపు పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న అధికారులు తాజాగా రెండో విడత నీరు-చెట్టు పనులకు సైతం తాము నిర్ణయించిన పర్సంటేజ్‌లు ఇస్తేనే పనులిస్తామని తేల్చి చెబుతున్నారని సమాచారం. నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : తమకు పర్సంటేజీ కచ్చితంగా ఇవ్వాలని అధికారులు చెబుతుండడంతో నీరు-చెట్టు పనులు పొందిన నీటి సంఘాల యాజమాన్య సభ్యులు, అధికారపార్టీ నాయకులు విస్తుపోతున్నారు. పర్సంటేజ్‌ల వసూళ్లపై కచ్చితమైన పద్ధతిలో ఎస్ఈ దగ్గర నుంచి వ్యవహరించడంతో పనుల నాణ్యతను పట్టించుకోవడంలేదు. చేయని పనులకు సైతం బిల్లులు చేయించుకోవడంలో అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పొడచూపిన అభిప్రాయభేదాలతో అసలు విషయం బయటకు పొక్కింది. నీరు-చెట్టు పనులకు రూ.147 కోట్లు మంజూరు రెండో విడత నీరు - చెట్టు కింద జిల్లా వ్యాప్తంగా 1823 పనులకు రూ.147.60 కోట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నామినేషన్ పనులను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు పెంచారు. నామినేషన్‌తో నిమిత్తంలేకుండా రూ.10లక్షల పనులు చేయవచ్చునన్న ఆశతో అధికారపార్టీ నాయకులు ఎగిరి గంతేశారు. ఇరిగేషన్ అధికారులు పర్సంటేజ్ మెలిక పెట్టారు. ఏకంగా పనుల్లో 30 శాతం వాటా ఇరిగేషన్‌శాఖ నొక్కేయడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బిల్లులు చేసేది తామే కావడంతో పనులు ఎలా చేసినా పట్టించుకునేదిలేదని, అడిగిన మొత్తం ఇచ్చేయాలనేది అధికారుల తీరైంది. దీంతో నీటి యాజమాన్య సంఘాల నాయకులు జిల్లాలోని టీడీపీ ప్రముఖ నేతల వద్దకు ఈ వివాదాన్ని తీసుకెళ్లారు. ఫిక్స్డ్ పర్సంటేజ్‌ల వసూళ్లు తెలుసుకున్న టీడీపీ ఉన్నత శ్రేణినాయకులు ఏకంగా ఎస్ఈని మందలించినట్లు తెలుస్తోంది. జిల్లాలో నీరు-చెట్టు కింద పనులకు బిల్లులను చెల్లించే క్రమంలో పర్సంటేజ్లను తగ్గించుకోవాలని సూచించారని సమాచారం. అయితే ఏఈల దగ్గర నుంచి ఈఈలు, డీఈలు, ఎస్ఈల వరకు ఫిక్స్డ్ పర్సంటేజ్‌లు ఇవ్వాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక అధికారపార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. అధికారంలో తామున్నప్పటికీ అధికారులు తమ హెచ్చరికలను పక్కనబెడుతుండడం వారికి ససేమిరా నచ్చడంలేదు. చేసే పనుల నాణ్యత, తమకు అనుకూలంగా ఎస్టిమేషన్ను పెంచి పనులను నిర్ణయించి నీటి సంఘాల యాజమాన్యానికి అప్పనంగా ఇస్తున్నప్పుడు తమ పర్సంటేజ్‌ల వాటా తమకు రావాల్సిందేనని అధికారుల ఆలోచన. ఈ క్రమంలో సాక్షాత్తు ఎస్ఈ జిల్లాస్థాయి ఉన్నతాధికారికి సైతం 2 శాతం వాటా ఇవ్వాలని చెప్పడంతో నెల్లూరు, నెల్లూరు సెంట్రల్ డివిజన్, గూడూరు, కావలి ఈఈలు కిందిస్థాయి ఇంజనీర్లను పర్సంటేజ్‌లపై పట్టుబడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎఫ్డీఆర్ పనులనే.. రెండో విడత నీరు - చెట్టు కార్యక్రమంలో చేసేసిన ఫ్లడ్ డ్యామేజ్డ్ రిపేర్లను(ఎఫ్డీఆర్) సైతం జాబి తాలో చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నియోజకవర్గాల వారీగా ఈ పనులను పథకం ప్రకారం చేర్చారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ పనిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచడంతో అధికారులు, టీడీపీ నాయకులు నీరు - చెట్టు పనులలో వాటాలు పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పర్సంటేజ్‌లు గుట్టు రట్టవడంతో అధికారులు నోరు మెదపడంలేదు. నీటి యాజమాన్య సంఘాల నాయకులు మాత్రం పనులు తమకు వచ్చినప్పటికీ లాభమేముందని తలలుపట్టుకుంటున్నా రు. అయితే కాగితాలపై పనులు చేసినట్టు చూపించి బిల్లులు చేసుకునేందుకు ఆ మాత్రం ఇవ్వలేరా అని అధికారులు ఎదురు ప్రశ్నలు వేయడం గమనార్హం. పర్సంటేజ్‌లపై అధికారుల, వాటాలపై అధికారపార్టీ నా యకులు పట్టు విడవకపోవడంతో రైతులు తీవ్రం గా నష్టపోయే అవకాశం ఉంది. కాలువలకు మరమ్మతులు, పూడిక తీత పనులలో పర్యవేక్షణ లేకపోవడం తో పనులు ఏ మేరకు జరిగాయో అంచనా వేయలేని పరిస్థితి. తాజాగా రెండో పంటకు నీరు విడుదల చేశా రు. ఐఏబీ తీర్మానం ప్రకారం పెన్నార్ డెల్టా ఆయకట్టులో 1,76,000 ఎకరాలకు నీళ్లందించేలా చర్యలు చేపడతామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నీరు వదిలి వారం కావస్తున్నా నిర్ణీత ఆయకట్టు కాలువలకు ఆశించిన స్థాయిలో నీరందలేదని ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలను పర్యవేక్షించే లస్కర్లు సైతం లేకపోవడం ఇరిగేషన్‌శాఖ పనితీరుకు నిదర్శనం. ఇప్పటికైనా పర్సంటేజ్‌ల పట్టును అధికారులు వీడాలని, అధికారపార్టీ నాయకులు జేబులు నింపుకోవడం కోసం కాకుండా రైతులకు మేలు జరిగేలా పనులు చేసేలా చూడాలని రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్నారు. అవన్నీ ఆరోపణలే : పనులకు పర్సంటేజ్లా.. అవన్నీ ఆరోపణలే.. అటువంటిది ఏమీ లేదు. అలా అడిగితే నా దృష్టి తీసుకురండి. ఎంతటి వారిపైన అయినా కఠినచర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. పనుల నాణ్యతలో తేడా వస్తే వారిని ఉపేక్షించేదిలేదు. పనులను ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించేందుకు ఇం జనీర్లను పురమాయిస్తున్నాం. క్షేత్రస్థాయిలో లస్కర్లను సైతం ఏర్పాటు చేస్తున్నాం. - పీవీ సుబ్బారావు, ఇరిగేషన్ ఎస్ఈ