leather factory
-
ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ధర్నా
చిత్తూరు(వి.కోట): చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో రైతులు ధర్నాకు దిగారు. ఆదివారం మండలంలోని ఏడుచోట్లకోట గ్రామంలో లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే తమ సాగు భూములు వదులుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకుని రైతులకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. -
లెదర్ ఫ్యాక్టరీలో పేలిన పైప్లైన్
-
తమిళనాడులో ఘోర ప్రమాదం
వేలూరు: తమిళనాడు రాష్ట్రంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. వేలూరు జిల్లాలోని రాణిపేట లెదర్ ఫ్యాక్టరీలో కెమికల్ ట్యాంకర్ పైప్లైన్ పేలింది. ఈ ధాటికి అక్కడున్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.