Left-wing intellectuals
-
రెండేళ్లలో తీవ్రవాదానికి చరమగీతం: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వెలిబుచ్చారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మరణాలు, హింసాత్మక ఘటనలు 2022లో గత 4 దశాబ్దాల్లోకెల్లా అతి తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. ‘నక్సలిజం మానవత్వం పాలిట శాపం. దాన్ని అన్నివిధాలా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం‘ అని అన్నారు. వామపక్ష తీవ్రవాద రాష్ట్రాల్లో పరిస్థితిపై ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ సీఎంలు కూడా ఇందులో పాల్గొన్నారు. 2015లో ’వామపక్ష తీవ్రవాదంపై జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక’ అమల్లోకి వచ్చాక ఆ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని ఉన్నతాధికారులు తెలిపారు. 2010తో పోలిస్తే నక్సల్స్ హింసలో పోలీసు, పౌర మరణాలు 90 శాతం తగ్గాయని వివరించారు. ‘2004–14 మధ్య 17,679 నక్సల్ సంబంధిత హింసా ఘటనలు, 6,984 మరణాలు సంభవించాయి. 2014–23 మధ్య 7,659 ఘటనలు, 2,020 మరణాలు నమోదయ్యాయి‘ అని పేర్కొన్నారు. -
తీవ్రవాదంపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: ఉమ్మడి పోరాటం, వ్యూహాలతో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను దీటుగా ఎదుర్కోవాలని కేంద్రం, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు నిర్ణయించాయి. 10 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు నితీష్ కుమార్ (బిహార్), నవీన్ పట్నాయక్ (ఒడిశా), యోగి ఆదిత్యనాథ్ (యూపీ), కమల్నాథ్ (మధ్యప్రదేశ్), రఘుబర్ దాస్ (జార్ఖండ్), భూపేష్ భఘేల్ (ఛత్తీస్గఢ్), ఉన్నతాధికారులు హాజరయ్యారు. మావోయిస్టుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇందులో సమీక్షించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం ఫలప్రదమైంది. భద్రత, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించాం. ప్రజాస్వామ్య విధానాలకు తీవ్రవాదం విఘాతం కలిగిస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో తీవ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం’అని సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్లో పేర్కొన్నారు. అమిత్ షా హోంశాఖ పగ్గాలు చేపట్టిన అనంతరం ఇలాంటి సమావేశం జరగడం ఇదే తొలిసారి. హోంశాఖ, పారా మిలటరీ బలగాల ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరయ్యారు. తీవ్రవాదం తగ్గుముఖం ► కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం 2009–13లో మావోయిస్టు హింసాత్మక చర్యలకు సంబంధించి 8,782 కేసులు నమోదు కాగా 2014–18లో 43.4 శాతం తగ్గిపోయి 4,969 కేసులు నమోదయ్యాయి. ► 2009–13 మధ్య కాలంలో మావోయిస్టుల హింసకు 3,326 మంది (భద్రతా సిబ్బందితో కలిపి) బలయ్యారు. 2014–18లో తీవ్రవాదుల చేతుల్లో 1,321 మంది మృతి చెందారు. ► 2009–18 వరకు 1,400 మందికిపైగా మావోయిస్టులు మరణించారు. ► ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో దేశవ్యాప్తంగా మావోయిస్టుల హింసకు సంబంధించి 310 ఘటనలు నమోదు కాగా 88 మంది ప్రజలు చనిపోయారు. -
వామపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలి
వామపక్ష మేధావులు హైదరాబాద్: నాటి ఉద్యమ స్ఫూర్తితో వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పలువురు వామపక్ష మేధావులు, సానుభూతిపరులు సూచించారు. బూర్జువా పార్టీలతో కలసి పోటీ చేయడంతో కమ్యునిస్టు పార్టీలపై ప్రజల్లో న మ్మకం పోయిందని వారు అన్నారు. 2019 ఎన్నికలు మావే అన్న లక్ష్యంగా అన్ని కమ్యునిస్టుపార్టీలు ఐక్యకార్యచరణతో ముందుకు పోవాలని వారు సూచించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 10 వామపక్ష పార్టీల మేధావులు, ఆలోచనా పరులతో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్స్ హరగోపాల్, ఘంటా చక్రపాణి, రమా మెల్కోటే, భాంగ్య భూక్య, ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ నాటి కమ్యునిస్టు నాయకుల స్ఫూర్తి నేడు కరువైందని అన్నారు. నేటి ఉద్యమాలు అట్టడుగు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేకుండా కొన్ని స్వార్ధ శక్తుల ప్రయోజనాల కోసం ఏర్పడుతున్నాయుని, ఇది కమ్యునిస్టుల దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ 1964కు ముందు అంతా ఒకే కమ్యునిస్టు భావాలతో పని చేశారని, ఆ తర్వాత ఎందుకు విడిపోయారని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో 240 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసు వద్ద బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారని, మీరెందుకు వెనకబడ్డారని ప్రశ్నించారు. కమ్యునిస్టులంగా ఏకతాటి పైకి రావాలని సూచించారు. హరగోపాల్ మాట్లాడుతూ బీజేపీ లాంటి పార్టీలు వినాయకచవితి, జై శ్రీరాం దేవతల పేర్లతో ప్రజల్లో మమేకం అవుతున్నారని, మీకెందుకు పండుగలు లేవని అన్నారు. మీరు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ వామపక్షాలు ఉద్యమం చేయటంలో ముంద ంజలో ఉన్నాయని.. ఎన్నికల సమయంలో తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఒకటి, రెండు కమ్యునిస్టు పార్టీలు బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకోవటం వల్ల ప్రజల్లో క మ్యూనిస్టులపై నమ్మకం పోయిందని అన్నారు. రమా మెల్కోటే మాట్లాడుతూ వామపక్ష పార్టీలు ఎన్నికల్లో ఒకే వేదికపైకి వచ్చి నిలబడితే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. కమ్యునిస్టు పార్టీలో కూడ కమ్మ, రెడ్డిలే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పని చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలు ఎందుకు ఆ స్థాయిలో లేరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, సీపీఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి, గుండా మల్లేష్, ఆర్ఎస్పీ నాయకులు జానకిరాములు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, సూర్యం, వివిద పార్టీల నాయకులు భూతం వీరన్న, జూలూరి గౌరీశంకర్, ఎస్.వెంకటేశ్వర్ రావు, గడ్డం ఝాన్సీ, ప్రదీప్, మురారి, జీవన్ కుమార్లతో పాటు అనేక మంది మేధావులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.