Legal rights
-
WFH: మారిన పరిస్థితి.. ఇక ఆ దేశంలో వర్క్ ఫ్రం హోం చట్టబద్ధ హక్కు
హేగ్: కరోనా మహమ్మారి పని సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా మార్చేసింది. సుమారు రెండేళ్లపాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పద్ధతికి అలవాటు పడ్డారు. ఇప్పటికీ కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం నచ్చిన ఉద్యోగులు కొందరు ఆఫీసులకు వెళ్లి పనులు చక్కబెట్టేందుకు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం విధానాన్ని చట్టబద్ధ హక్కుగా మార్చేందుకు నడుం బిగించింది. దీని ప్రకారం..ఉద్యోగులకు తమ యాజమాన్యాలను వర్క్ ఫ్రం హోం డిమాండ్ చేసే హక్కుంటుంది. తిరస్కరించే సంస్థలు అందుకు గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును ఆ దేశ దిగువ సభ ఇటీవల ఆమోదించింది. ఎగువ సభ కూడా ఆమోదిస్తే చట్ట రూపం దాల్చుతుంది. ఇలాంటి అవకాశం కల్పించిన మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్ కానుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు ఇంటి నుంచే విధులు నిర్వహించవచ్చంటూ స్కాట్లాండ్ ప్రభుత్వం గత నెలలో ఓ ప్రతిపాదన తీసుకువచ్చింది. బదులుగా వేతనంలో కోత ఉంటుందని మెలికపెట్టడం వివాదాస్పదమైంది. ఆఫీసుకు రావాలంతే..!! ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతుండగా, ఆఫీసులకు రావాలంటూ కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను గట్టిగా కోరుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్..! ఆఫీసుకు రండి, లేదా రాజీనామా చేయండి అంటూ నెల క్రితం ఈయన తన ఉద్యోగులకు అల్టిమేటం ఇచ్చారు. యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా ఇలాగే ఆదేశించి కంగు తిన్నారు. ఉద్యోగమైనా మానేస్తాం గానీ ఆఫీసులకు మాత్రం రాబోమంటూ ఉద్యోగులు తెగేసి చెప్పారట. -
కొత్త చట్టం: ఉద్యోగులకు బంపరాఫర్, పర్మినెంట్‌గా వర్క్ ఫ్రం హోం..ఎక్కడంటే!
ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఈసురోమంటూ ఇల్లు చేరడం. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవు రోజుల కోసం నిరీక్షించడం. ఇదంతా ఒకప్పటి మాట. కోవిడ్-19తో పరిస్థితులు మారాయ్. ఉద్యోగులు ఆఫీస్‌కు బదులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే కరోనా అదుపులోకి రావడంతో సంస్థలు ఉద్యోగుల్ని ఆఫీస్‌కు రప్పిస్తున్నాయి. ఇంటి వద్ద నుంచి పనిచేసే విధానాన్ని రద్దు చేస్తున్నాయి. ఈ తరణంలో ఓ దేశ ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను చట్టబద్దం చేయనుంది నెదర్లాండ్ ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విషయంలో ప్రత్యేక హక్కును కల్పించింది. నచ్చితే ఆఫీస్‌కు రావొచ్చు. లేదంటే ఇంట్లో ఉండి ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. ఈ బిల్లుకు నెద్దర్లాండ్ పార్లమెంట్ దిగువ సభ మద్దతు పలికింది. సెనేట్ సైతం ఈ వర్కింగ్ యాక్ట్‌కు ఆమోదం తెలిపితే దేశంలో వర్క్ ఫ్రం హోం చట్టం అమలు కానుంది. ఈ సందర్భంగా నెదర్లాండ్ గ్రోన్‌లింక్స్ పార్టీకి చెందిన 'సెన్నా మాటౌగ్' మాట్లాడుతూ..ఉద్యోగులు ఇంట్లో ఉండి ఓ వైపు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కుటుంబ సభ్యులతో గడపవచ్చు. ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడం చట్టబద్ధమైన హక్కుగా మార్చేలా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ యాక్ట్ -2015ని సవరణలు చేస్తామని అన్నారు. ఈ చట్టంతో ఉద్యోగులు తమ పని గంటలు, పని ప్రదేశాల్ని మార్చుకునేందుకు సౌలభ్యం కానుందన్నారు. ఈ కొత్త చట్టం అమలు కోసం నెదర్లాండ్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా..అదే సమయంలో నెదర్లాండ్‌లో కరోనా తగ్గడంతో ఆయా సంస్థలు ఉద్యోగుల్ని ఆఫీస్‌కు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అందుకు ఉద్యోగులు ఒప్పుకోవడం లేదు. ఇంటి వద్ద నుంచి పనిచేస్తామని పట్టుబడుతున్నారు.ఈ తరుణంలో ఈ కొత్త చట్టం అమలు ఉద్యోగులకు వరంగా మారనుంది. వర్క్ ఫ్రం హోం చేస్తామంటే ఒప్పుకోని సంస్థలు ఉద్యోగుల మాట వినాల్సిందే. కొత్త యాక్ట్‌లో ఉన్నట్లుగా ఉద్యోగులు తాము వర్క్ ఫ్రం హోం ఎందుకు చేయాలనుకుంటున్నారో బలమైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. వారికి నచ్చినట్లుగా పనిచేసుకోవచ్చు.సంస్థలు సైతం అందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటికే దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను రద్దు చేసి ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మరి నెదర్లాండ్ ప్రభుత్వం అందుకు విభిన్నంగా కొత్త చట్టంపై పనిచేయడంతో ఇతర దేశాలకు చెందిన సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్‌ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్! -
వేధించే సంతానాన్ని వెళ్లగొట్టవచ్చు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: తమను వేధించే సంతానాన్ని ఆ తల్లిదండ్రులు ఇంటి నుంచి పంపించివేయవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వారు నివసిస్తున్న ఇల్లు సొంతమా, అద్దెదా అనే విషయం పట్టించుకోనక్కరలేదంది. ఇంటిపై తల్లిదండ్రులకు న్యాయపర హక్కులు ఉన్నంత వరకూ వారిని వేధించే వయోజనులైన పిల్లలను ఆ ఇంటి నుంచి పంపొచ్చని పేర్కొంది. తల్లిదండ్రుల ఇంటి నుంచి తమను వెళ్లగొట్టాలని 2015లో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తాగుబోతు అయిన మాజీ పోలీసు, అతని సోదరుడు వేసిన పిటిషన్ పై ఈ తీర్పిచ్చింది. తాము మెయింటెనెన్స్ కోసం డబ్బు కోరకపోయినా.. కేవలం శారీరకంగా వేధించామనే ఆరోపణలపైనే ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిందని ఆ సోదరులు కోర్టులో వాదించారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం–2007ను ట్రిబ్యునల్ అతిక్రమించిందని తెలిపారు. కోర్టు స్పందిస్తూ.. వృద్ధులు తమ ఇంటిలో ప్రశాంతంగా జీవించే హక్కును కల్పించడానికి.. శారీరకంగా, మానసికంగా వేధించే సంతానాన్ని ఇంటినుంచి వెళ్లగొట్టే ఆదేశాలు ట్రిబ్యునల్ ఇవ్వవచ్చని పేర్కొంది.