లెనొవో ఐడియాప్యాడ్ ఏ10 @ రూ.19,990
బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్లు తయారు చేసే లెనొవొ కంపెనీ కొత్త నోట్‌బుక్, ఐడియాప్యాడ్ ఏ10ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ డ్యుయల్-మోడ్ నోట్‌బుక్ ధర రూ.19,990 అని పేర్కొంది. పూర్తి సైజ్ కీ బోర్డ్‌తో కూడిన 10.1 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ హైబ్రిడ్ డివైస్‌ను 300 డిగ్రీల కోణంలో ఫ్లిఫ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ నోట్‌బుక్‌లో 10 పాయింట్ మల్టీ-టచ్ ఫీచర్, కోర్టెక్స్ -ఏ9 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 0.3 మెగా పిక్సెల్ వెబ్‌క్యామ్, 32 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్, మైక్రో-యూఎస్బీ పోర్ట్, రెండు యూఎస్బీ 2.0 పోర్ట్‌లు, మైక్రో హెచ్డీఎంఐ పోర్ట్, మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 10 గంటల చార్జింగ్ ఉండే బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలున్నాయి.