Leo Varadkar
-
ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతికి చెందిన వ్యక్తి
-
ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి భారత సంతతి వ్యక్తి
డబ్లిన్: భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఐర్లాండ్ ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రొటేషన్ పద్ధతిలో ఫిన్‌గేల్ పార్టీకి చెందిన వరాద్కర్‌కు మరోసారి అవకాశం దక్కింది. 2017లో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2020లో ఫిన్‌గేల్, మార్టిన్ ఫియన్నాఫెయిల్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రొటేషన్ పద్ధతిలో వరాద్కర్‌కు మరో అవకాశం లభించింది. మైఖెల్ మార్టిన్ స్థానంలో ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. రెండోసారి అవకాశం లభించిన క్రమంలో డబ్లిన్‌లోని ఐర్లాండ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు లియో వరాద్కర్. ‘ మన పౌరులందరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలను అందించాలనే కాంక్షతో వినయంగా, సంకల్పంతో ఈ నియామకాన్ని అంగీకరిస్తున్నా. ఐర్లాండ్ ప్రధానిగా అవకాశం రావటం జీవతకాల పురస్కారం. గత 100 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి ఆధారంగా రానున్న తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తా. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రచించి పక్కాగా అమలుపరుస్తాను. కరోనా వ్యాప్తి సమయంలో సహకారం అందించిన మైఖేల్ మార్టిన్‌కు కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నారు వరాద్కర్. ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న లియో ఐర్లాండ్‌లోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా గతంలోనే చరిత్ర సృష్టించారు. 38 ఏళ్లకే అత్యున్నత పదవిని చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగానూ నిలిచారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కళాశాలలో మెడికల్ డిగ్రీ అందుకున్న వరాద్కర్.. మొదట ప్రాక్టీస్ మొదలు పెట్టినా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2007 తొలిసారి గెలుపొందారు. 2015లో స్వలింగ వివాహాలను చట్టబధ్దం చేసింది. ఈ క్రమంలో తాను గే అని బహిరంగంగానే ప్రకటించారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం.. రష్యా మాస్టర్ ప్లాన్‌తో తీవ్ర ఇబ్బందులు -
కరోనా సంక్షోభం: ఐరిష్ ప్రధాని కీలక నిర్ణయం!
డబ్లిన్: మహమ్మారి కరోనా ప్రపంచ దేశాలపై కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంటూ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటలీ, స్పెయిన్, అమెరికా ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో చికిత్స చేయలేమని స్పెయిన్ చేతులెత్తేయగా.. అమెరికాలో కరోనా మృతుల సంఖ్యను ఊహించడం కష్టమేనంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం కోవిడ్-19 తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు వైద్య సిబ్బంది కొరతను ఎదుర్కొనేందుకు విశ్రాంత డాక్టర్లు, నర్సులను తిరిగి విధుల్లో చేరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐర్లాండ్ సైతం కరోనాను కట్టడి చేసేందుకు వాలంటీర్లు, రిటైర్డు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఇందుకు దాదాపు 60 వేల స్పందించి కరోనాపై పోరాటానికి ముందుకు వచ్చారు. వీరిలో ఆ దేశ ప్రధాని లియో వరాద్కర్(41) కూడా ఉండటం విశేషం. కాగా అశోక్ వరాద్కర్- మిరియం వరాద్కర్(డాక్టర్- నర్సు) దంపతులకు జన్మించిన లియో.. 2003లో డబ్లిన్‌లోని ట్రినిటీ యూనివర్సిటీ నుంచి వైద్య విభాగంలో పట్టా పొందారు. అనతికాలంలోనే రాజకీయాల్లో ప్రవేశించి దేశ ప్రధాన మంత్రి స్థాయికి చేరుకున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో లియో డాక్టర్‌గా విధులు నిర్తర్వించేందుకు వచ్చారని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఆదివారం మీడియాకు వెల్లడించారు. వారంలో ఒకరోజు తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులలో చాలా మంది ఇప్పటికే కరోనాపై పోరుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రధాని సైతం తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు’’అని పేర్కొన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా ఐర్లాండ్‌లో ఇప్పటి వరకు 158 మంది మృతి చెందగా.. దాదాపు 5 వేల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. (ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని) -
ఆ వేడుకలకు గోవా రానున్న ఐర్లాండ్ ప్రధాని
పనాజీ: భారత దేశానికి పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు పర్యటిస్తుంటారు. కాని తాజాగా భారతదేశాన్ని పర్యటించనున్న ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్కి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన భారతమూలాలు ఉన్న ఐర్లాండ్ ప్రధాని. గోవా సముద్రతీర ప్రాంతంలో నిర్వహించే 2020 నూతన సంవత్సర వేడుకల్లో తన కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి భరత్ వస్తున్నట్లు సోమవారం గోవా రాష్ట్ర అధికారులు తెలిపారు. అయితే ప్రధాని లియో వరద్కర్ భారత పర్యటన వ్యక్తిగతమైందని.. ఈ పర్యటనలో భాగంగా లియో ఎటువంటి అధికారిక కార్యక్రమాలకు హాజరుకారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. జనవరి 1 వరకు ప్రధాని లియో వరద్కర్ తన కుంటుంబ సభ్యులతో గోవాలో గడుపుతారని ఆయన పేర్కొన్నారు. జనవరి 1 మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరిగి ఐర్లాండ్ వెళతారని ఆ పోలీసు అధికారి తెలిపారు. వరద్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని తీరప్రాంత సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న తన పూర్వీకుల గ్రామమైన వరద్ను ఆదివారం సందర్శించనున్నారు. ‘2017 లో నేను ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. నా తండ్రి ఒక వైద్యుడు. ఆయన 1960లో ఇంగ్లాండ్ వెళ్లారు. నా పూర్వికుల గ్రామమైన వరద్ను సందర్శించటం ఇదే మొదటిసారి. ఇప్పుడు వరద్ గ్రామంలో మూడు తరాలకు చెందిన నా కుటుంబ సభ్యులను కలుసుకోవడం చాలా ప్రత్యేకం’ అని లియో వరద్కర్ తెలిపారు. ప్రధాని వరద్కర్ వరద్గ్రామ పర్యటనలో భాగంగా గ్రామ దేవతను దర్శించుకోనున్నారు. అదేవిధంగా వరద్ గ్రామ ప్రజలు ప్రధాని వరద్కర్‌ను సత్కరించన్నుట్లు తెలుస్తోంది. -
ఐర్లండ్ ప్రధానిగా భారత్ సంతతి నేత
-
ఐర్లాండ్ పీఎం మనవాడే
-
ఐర్లండ్ ప్రధానిగా భారత్ సంతతి నేత
► అధికార పార్టీ ఎన్నికల్లో లియో వారడ్కర్ గెలుపు ► తొలి ‘గే’, పిన్నవయస్కుడైన ప్రధానిగా రికార్డు డబ్లిన్: ఐర్లండ్ తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన లియో వారడ్కర్ (38) ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రధాని ఎండా కెన్నీ రాజీనామాతో జరిగిన అధికార ఫైన్ గేల్ పార్టీ అంతర్గత ఎన్నికలో 60 శాతం ఓట్లతో వారడ్కర్ గెలిచారు. ఐర్లండ్‌కు అత్యంత పిన్న వయస్కుడైన, తొలి మైనార్టీ ప్రధానిగా నిలిచారు. తొలి స్వలింగ సంపర్క (గే) ప్రధానిగానూ రికార్డులకెక్కారు. ప్రధాని పదవికి పార్టీ సీనియర్ నేత సిమన్ కోవెనీ, వారడ్కర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానిగా ఎంపికవటంపై వారడ్కర్ హర్షం వ్యక్తం చేశారు. ‘నేను సగం భారతీయుడిని, డాక్టర్‌ను, గే పాలిటీషియన్ని మాత్రమే కాదు. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుంది’ అని అన్నారు. జూన్ 13న జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఆయన అధికారికంగా బాధ్యతలు అందుకోనున్నారు. ముంబైలో మూలాలు.. ముంబై నుంచి వచ్చి స్థిరపడిన హిందూ, మçహారాష్ట్రీయుడైన డాక్టర్ అశోక్ వారడ్కర్, ఐరిష్ నర్స్ మీరియమ్ మూడో సంతానమే లియో. 66 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న దేశంలో టీషక్ (ప్రధాని) పదవికి ఆసియా మూలాలున్న ‘గే’ను ఎన్నుకోవడం పదేళ్ల కిందటి వరకు ఊహకు అందని విషయం. వారడ్కర్.. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీలో మొదట లా కోర్సులో చేరినా, వెంటనే మెడిసిన్‌కు మారారు. 2003లో మెడిసిన్ పూర్తిచేశారు. అదే ఏడాది ఫింగల్ కౌంటీ కౌన్సిల్‌కు లియోను ఫైన్ గేల్ పార్టీ కోఆప్ట్ చేయడంతో రాజకీయ ప్రయాణం గాడినపడింది. 2007లో డబ్లిన్ వెస్ట్ స్థానం నుంచి ఐర్లండ్ దిగువసభకు ఎన్నికై, మంత్రిగా సని చేశారు. కుంభకోణాల ఫలితంగా ప్రధాని కెన్నీ రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. -
‘గే’గా ప్రకటించుకున్న భారత సంతతి మంత్రి
డబ్లిన్: భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ఆరోగ్య మంత్రి లియో వరాడ్కర్(36) తాను స్వలింగ సంపర్కినని ప్రకటించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా రేడియోలో ఆదివారం ఈ ప్రకటన చేశారు. కేథలిక్ దేశమైన ఐర్లాండ్‌లో ప్రభుత్వ నేత ఒకరు స్వలింగసంపర్కుడినని ప్రకటించుకోవడం ఇదే తొలిసారి.