Leon
-
స్పిన్నర్ లియోన్‌కు పిలుపు
► చివరి రెండు వన్డేలకు ఆసీస్ జట్టు ► టి20లకు టెయిట్, వాట్సన్ మెల్బోర్న్: భారత్‌తో మిగిలిన రెండు వన్డేలు ఆడే ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ నాథన్ లియోన్‌కు చోటు దక్కింది. పేసర్ పారిస్ స్థానంలో లియోన్ 13 మంది సభ్యుల జట్టులోకి వచ్చాడు. 2014లో చివరిసారి వన్డే ఆడిన లియోన్... ప్రస్తుత సీజన్ బిగ్‌బాష్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. 20, 23 తేదీల్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయి. వన్డే జట్టులో స్థానం కోల్పోయిన షేన్ వాట్సన్‌తో పాటు షాన్ టెయిట్ కూడా ఆస్ట్రేలియా టి20 జట్టులోకి ఎంపికయ్యారు. భారత్‌తో సిరీస్‌కు అనేక మంది కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసిన సెలక్టర్లు బెయిలీ, మిషెల్ మార్ష్‌లను ఎంపిక చేయలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఏకంగా 17 మందితో జట్టును ప్రకటించడం విశేషం. ఆస్ట్రేలియా టి20 జట్టు: ఫించ్ (కెప్టెన్), బోలాండ్, బోయ్స్, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, హెడ్, నాథన్ లియోన్, క్రిస్ లిన్, మ్యాక్స్‌వెల్, షాన్ మార్ష్, స్టీవ్ స్మిత్, కేన్ రిచర్డ్సన్, షాన్ టెయిట్, ఆండ్రూ టై, మ్యాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్. -
ఆస్ట్రేలియా... అదరహో
► రెండో టెస్టులో విండీస్‌పై ఘన విజయం ► 2-0తో సిరీస్ కైవసం ► బౌలింగ్‌లో రాణించిన మార్ష్, లియోన్ మెల్బోర్న్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... వెస్టిండీస్‌తో నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో 177 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను స్మిత్ బృందం ఒక టెస్టు మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. 460 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 88.3 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హోల్డర్ (68), రామ్‌దిన్ (59), రాజేంద్ర చంద్రికా (37), బ్రాత్‌వైట్ (31)లు మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఆతిథ్య బౌలర్ల ధాటికి కరీబియన్ జట్టు ఓ దశలో 150 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే హోల్డర్, రామ్‌దిన్ ఆరో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. కానీ లోయర్ ఆర్డర్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. విండీస్ 32 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లను కోల్పోయింది. మిచెల్ మార్ష్ 4, లియోన్ 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 32 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగుల వద్దే డిక్లేర్ చేసింది. హోల్డర్ 2 వికెట్లు తీశాడు. లియోన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది. -
ఎబోలా మృతులు 1,229
జెనీవా: పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియార్రా లియోన్, నైజీరియా దేశాల్లో ప్రబలిన భయానకమైన ఎబోలా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1,229కి చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం తెలిపింది. ఈనెల 14, 16 తేదీల మధ్యనే 84 మంది ఎబోలాతో మరణించారని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్నుంచి ఇప్పటివరకూ 2,240 కేసులు నమోదయ్యాయని, పశ్చిమాఫ్రికాలోని గినియా లో తొలుత మొదలైన ఎబోలా వైరస్ మిగతా దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. ఎబోలాతో అస్వస్థులైనవారిని ప్రత్యేక ఏర్పాట్లతో ఆసుపత్రుల్లో చేర్చారు, వారి ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. కాగా, ఎబోలాతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పదిలక్షలమంది బాధితులకు 3నెలలపాటు ఆహార పంపిణీకోసం సన్నాహాలు చేస్తున్నట్టు ఐరాస తెలిపింది.