leonardo da Vinci
-
మొనాలిసా పెయింటింగ్‌పైకి సూప్ స్ప్రే
పారిస్: ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా పెయింటింగ్‌పైకి పర్యావరణ ఉద్యమకారులు సూప్‌ను స్ప్రే చేశారు. అయితే, పెయింటింగ్‌కు గ్లాస్ రక్షణ ఉండటంతో ఎటువంటి నష్ట వాటిల్లలేదు. 16వ శతాబ్దంలో ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ చేతుల్లో రూపుదిద్దుకున్న మొనాలిసా చిత్రం ప్రస్తుతం సెంట్రల్ పారిస్‌లోని లౌవ్రె ప్రదర్శనశాలలో ఉంది. శుక్రవారం ఉదయం ‘రిపోస్టె అలిమెంటయిర్’అనే గ్రూపునకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యమకారులు గుమ్మడి సూప్‌ను మొనాలిసా పెయింటింగ్‌పైకి స్ప్రే చేశారు. అనంతరం వారు ‘కళ, ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార హక్కుల్లో ఏది ముఖ్యమైంది? వ్యవసాయరంగం సమస్యల్లో ఉంది. రైతులు చనిపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మ్యూజియం సిబ్బంది వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పెయింటింగ్‌ను తొలగించి, శుభ్రం చేశాక గంట తర్వాత తిరిగి ప్రదర్శనకు ఉంచారు. మన వారసత్వం మాదిరిగానే ఈ పెయింటింగ్ భవిష్యత్ తరాలకు చెందాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమకారుల వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఇంధన ధరలు పెరిగాయని, నియంత్రణలు ఎక్కువయ్యాయంటూ శుక్రవారం రైతులు పారిస్‌ను దిగ్బంధించారు. గతంలోనూ దెబ్బతింది ప్రదర్శనకు ఉంచిన మొనాలిసా చిత్రంపై 1950లో ఓ సందర్శకుడు యాసిడ్ పోశాడు. దీంతో, పెయింటింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి పెయింటింగ్‌కు రక్షణగా గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. 2019లో పారదర్శకమైన బుల్లెట్‌ప్రూఫ్ అద్దాన్ని రక్షణగా బిగించారు. 2022లో ఓ ఉద్యమకారుడు భూ గ్రహాన్ని కాపాడాలని కోరుతూ పెయింటింగ్‌పైకి కేక్‌ను విసిరేశాడు. -
అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!!
German Renaissance Artist Albrecht Dürer Painting: ఐదేళ్ల క్రితం అమెరికాలో హౌస్ క్లియరెన్స్ సేల్‌లో కేవలం 30 డాలర్ల (రూ. 2,250)కు కొన్న ఓ పెయింటింగ్ ఇప్పుడు వేల కోట్ల ధర పలుకుతోంది. ఈ పెయింటింగ్ 500 ఏళ్ల నాటి అద్భుత కళాఖండం మరి! దీనిని గీసిన చిత్రకారుడెవరో.. ఎందుకంత ధర పలుకుతోందో ఆ విశేషాలు మీ కోసం.. ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ ఒక జర్మన్ చిత్రకారుడు. జర్మనీ పునరుజ్జీవనోద్యమ సమయంలో అతను ఐరోపా అంతటా బాగా పేరు పొందాడు. ముఖ్యంగా వుడ్‌కట్ ప్రింట్లకు ప్రసిద్ధి చెందిన ఆల్బ్రెచ్ట్ డ్యూరర్.. రాఫెల్, గియోవన్నీ బెల్లిని, లియోనార్డో డావిన్సీ వంటి కళాకారులతో సన్నిహితంగా ఉండేవాడు. అతని ‘ఫోర్ హార్స్‌మెన్ ఆఫ్ ది అపోకలిప్స్’ అనే పెయింటింగ్ ఆర్ట్ హిస్టరీలోనే గొప్పదిగా పేరుగాంచింది. ముఖ్యంగా ఇతను ఒక తల్లి, బిడ్డలను పసుపు నారపై వేసిన ఆర్ట్‌వర్క్.. ఆర్ట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోనోగ్రామ్‌లలో ఒకటిగా ఎంచబడుతోంది. మొత్తం మోనోగ్రామ్ డ్రాయింగ్‌ను ఒకేరకమైన సిరాతో వేయబడింది. కనీసం 200 షీట్లపై వాటర్‌మార్క్ కనిపించే కాగితంపై ఈ పెయింటింగ్ వేశాడా జర్మన్ చిత్రకారుడు. ఈ అరుదైన కళాఖండాన్ని ఇప్పుడు లండన్‌లోని ఆగ్‌న్యూస్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. స్మిత్సోనియన్ మ్యాగజైన్ కథనాల ప్రకారం.. ఈ చిత్రాన్ని అగ్‌న్యూస్ గ్యాలరీ విక్రయించాలని యోచిస్తోంది. అయితే స్థిరమైన ధర ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర 374 కోట్ల 33 లక్షలు పలకవచ్చని నిపుణుల అంచనా. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: పర్యాటక మంత్రి -
కుంచెడు కృతజ్ఞత
సైన్యం రెండు రకాల యుద్ధాలు చేస్తుంది. శత్రువును చొరబడనివ్వని యుద్ధం. తెగబడి వస్తే.. సంహరించే యుద్ధం. కరోనాపై ఇప్పుడు జరుగుతున్నది సంహారయుద్ధం.ఈ యుద్ధంలో ఫ్రంట్‌లైన్ సైనికులు.. నర్సులు.కరోనా కొమ్ముల్ని వంచుతున్నారు.‘అంటు’ కొమ్మల్ని నరికేస్తున్నారు. విరామం లేదు.. విరమణ లేదు..ఇల్లు లేదు.. వదిలేసి వెళ్లేది లేదు.‘సిస్టర్.. ఊపిరి అందట్లేదు’.. అటొక పరుగు.‘సిస్టర్.. మీ పాప వచ్చింది’.. ఇటొక పరుగు.ఎలా తీర్చుకోవాలి ఈ సైనికుల రుణం?ఎలా ఓర్చుకోవాలి ఈ కృతజ్ఞతా భారం? కరోనా నుంచి చైనాను గట్టెక్కించిన వైద్య సేవకులలో తొంభై శాతం మంది మహిళా నర్సులే. కరోనాపై పోరాటం ఎలా ఉంటుందో ప్రపంచం మొదట చూసిందీ.. మాస్కులు తొలగిన ఆ చైనా నర్సుల ముఖాల్లోనే! ఒత్తుకుపోయి, నొక్కుకుపోయి, కమిలిపోయి..! మూడు నెలల పోరాటం తర్వాత చైనా ఇప్పటికి కాస్త కుదుట పడింది. ఆ దేశ ప్రజలు నర్సులకు మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నారు. మాటల్లో చెప్పలేనిది పాట అవుతుంది. నర్సులను కీర్తిస్తూ పాటలు పాడారు. సరిపోలేదు. మాటలు, పాటలు కాదని నిశ్శబ్ద, నిశ్చల చిత్రాలను గీయడం మొదలు పెట్టారు. ‘పవర్ ఉమన్’ గా నర్సులను రేఖాచిత్రాల్లోకి తెచ్చారు. ఒక యువతి.. నర్సు బాధ్యతల్ని తొడుక్కుంటోంది. ‘రూపాంతర చిత్రం’ అది. ఒక ‘సిస్టర్’ కరోనాపై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ‘సిస్టర్ వారియర్ చిత్రం’ అది. నర్సులు ఒకరికి ఒకరు ఊతం ఇచ్చుకుంటూ రోగులకు ఊపిరులు ఊదుతున్నారు. ‘నిరంతర సేవల చిత్రం’ అది. ఇంకా.. నర్సుల నిస్వార్థానికి, అంకితభావానికి ప్రతీకగా అనేక చిత్రాలు.. గీశారు, గీస్తున్నారు చైనా పౌరులు. ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, ఏమిచ్చినా తక్కువే అనిపిస్తున్నప్పుడు.. ‘ఆర్ట్’తో భారాన్ని దించుకోవచ్చు. అయితే ‘ఆర్ట్ ఎప్పటికీ పూర్తి కాదు. వదిలేసి వెళ్తామంతే’ అనే మాట వినే ఉంటారు. ఆ మాట అన్నది ఇటలీ చిత్రకారుడు లియోనార్డో డావిన్చీ. ఇవాళ ఆయన జన్మదినం. యేటా ఈరోజు ‘వరల్డ్ ఆర్ట్ డే’ జరుపుకుంటున్నాం. నర్సుల త్యాగనిరతిని, క్రియాశీలత్వాన్ని స్తుతించడానికి చేతుల్లోకి మనం ఎన్ని కుంచెలు, ఎన్ని రంగులు తీసుకున్నా.. ఆ చిత్రాలు ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉంటాయి. తలవడమే తప్ప కొలవలేం. -
మోనాలిసా ముఖంలో విషాదం!
-
మోనాలిసా ముఖంలో విషాదం!
బెర్లిన్: అందమైన ముఖం... అబ్బురపరిచే నవ్వు.. ఎంత చూసిన తనివితీరని కళ్లు.. ఇవన్నీ కలగలిపిన అందాల చిత్రం మోనాలీసా. 500 సంవత్సరాల క్రితం ప్రముఖ చిత్రకారుడు లియనార్డో డావిన్సీ కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రం గురించి తెలియని వారు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదు. అలాంటి మోనాలీసా చిత్రం వెనుక మరో అమ్మాయి బొమ్మ ఉందని ఇటీవలే ఓ ఫ్రెంచ్ శాస్త్రవేత్త చెప్పగా... మరికొంతమంది శాస్త్రవేత్తలు తమ తమ పద్ధతుల్లో ఈ చిత్రాన్ని విశ్లేషిస్తున్నారు. తాజాగా జర్మనీలోని ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా తమదైన విశ్లేషణను తెరమీదకు తెచ్చారు. మోనాలిసా ముఖంలో అందరికీ సంతోషమే కనిపిస్తున్నప్పటికీ అందులో ఆమె బాధపడడం కూడా ఉందంటున్నారు. ఇందుకోసం మోనాలిసా పెదవుల చివరి భాగాలను కొద్ది కొద్దిగా పైకీ కిందకు వంచుతూ ఎనిమిది రకాల పెయింటింగ్స్ రూపొందించారు. వాటిని ఒరిజినల్ పెయింటింగ్స్‌తో కలిపి చూసినప్పుడు ఆశ్చర్యకరంగా మోనాలిసా బాధపడుతున్న సంకేతాలు కూడా కనిపించాయి. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలిసా నిజంగా మోనాలిసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు. -
ఆ పెయింటింగ్ మరో సీక్రెట్ తెలిసింది!
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ దృశ్యరూపమిచ్చిన చిత్రం మోనాలీసా. అయితే శతాబ్ధాలు గడుస్తున్నప్పటికీ ఈ చిత్రం వెనుక రహస్యం ఏమిటన్నది బయటపడలేదు. అయితే ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో తరహాలో కనిపించే ఆ పెయింటింగ్ వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు పురాత్వ శాస్త్రవేత్తలు, ఇతర విభాగాల నిపుణులు ఇప్పటికీ యత్నాలు సాగిస్తూనే ఉన్నారు. దాదాపు ఐదు శతాబ్దాలు గడుస్తున్నా.. మోనాలీసా చిరునవ్వు వెనుక దాగున్న రహస్యం, ఆ చిత్రంలో ఆమె భిన్న కోణాల్లో ఎందుకు దర్శనమిస్తుంది? అసలు ఆమె ఎవరన్నది తెలియకపోయినా ఆదరిస్తూనే వస్తున్నారు. మోనాలీసా పెయింటింగ్ లో ఉన్న మహిళ.. ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య లిసా గెరార్డినీ అని సైంటిస్టు పాస్కల్ కొట్టే గతంలో తెలిపారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలు వ్యక్తంచేశారు. తాజాగా మరో విషయం బయటపడింది. డావిన్సీ తన దగ్గర పనిచేసే ఓ వ్యక్తికి ఇచ్చిన రూపం కూడా మోనాలీసాలో ఉందని, అతడు డావిన్సీకి గే లవర్ అని ఇటలీ పురాతత్వవేత్తలు చెబుతున్నారు. వ్యాపారి భార్య, గే లవర్ అయిన గియాన్ గియాకోమో లను కలిపి ఒకేరూపం ఇవ్వగా మోనాలీసా చిత్రరూపం ఏర్పడిందని ఇటలీకి చెందిన సిల్వానో విన్సెటీ వివరించారు. ఈయన పరిశోధనల్ని కూడా కొందరు నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా, శతాబ్దాలు గడుస్తున్నాయి.. పరిశోధనలు జరుగుతూనే ఉన్నా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగానే మోనాలీసానా? కాదా? అన్న సందేహం మాత్రం నేటికీ తీరకపోవడం గమనార్హం. -
‘మొనాలిసా’ చోరీ... పికాసో అరెస్టు...
సుప్రసిద్ధ చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గీసిన కళాఖండం ‘మొనాలిసా’ 1911లో ఫ్రాన్స్‌లోని లావ్రే మ్యూజియం నుంచి చోరీకి గురైంది. కట్టుదిట్టమైన కాపలా గల మ్యూజియంలో జరిగిన ఈ చోరీ కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు మరో ప్రముఖ చిత్రకారుడు పాబ్లో పికాసోను అనుమానితుడిగా భావించి, అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రశ్నించిన తర్వాత విడిచి పెట్టేశారు. ఆ తర్వాత రెండేళ్లకు చోరీకి గురైన మొనాలిసా చిత్రం దొరికింది. దానిని చోరీ చేసిన పెరుగియా అనే యువకుడికి ఏడు నెలల జైలు శిక్ష పడింది. -
చిత్రమనుకోక..
పెయింటింగ్స్.. ఆఫీసుల్లో, ఇళ్లలో అలంకరించుకోవడం తెల్సిందే. అయితే ఇప్పుడవి అద్భుతమైనచిత్రాలతో అందాన్ని పెంచే ఆర్టిస్టిక్ చీరలుగా మారిపోతున్నాయి. ఆరు గజాల చీర.. అందమైన కాన్వాస్‌గా ఒదిగిపోతోంది.ఒద్దికగా ‘ఆర్ట్’ని చిత్రించుకుంటోంది. చీరలపైనా ‘చిత్తరువు’లు మలచడం నేడు మగువల మనసులను ‘కట్టి’పడేస్తున్న లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్. హ్యాండ్ పెయింటింగ్ శారీస్ ఒరవడిని మార్చేస్తూ పుట్టుకొచ్చిన ఈ ‘చిత్ర’మైన చీరలు... కళాభిమానులైన సిటీ మహిళల చేత ‘శారీ’గమలు పాడిస్తున్నాయి. - ఎస్.సత్యబాబు ఆరు గజాల చీరలో ప్రతి అంశం అపురూపమైనదే. కళాత్మకమైందే. అటువంటి చీరపై ప్రముఖ చిత్రకారుల కళా ప్రతిభను దర్శింపజేస్తే వచ్చే లుక్ ఎంత గొప్పగా ఉంటుంది? ఈ ఆలోచనే హ్యాండ్ పెయింటింగ్ చీరల సృష్టికి దారితీసింది. ఇటీవలే ఊపందుకున్న ఈ తరహా చీరల ట్రెండ్‌కు ఓనమాలు దిద్దించిన వారిలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు ఉత్పల్ఘోష్ ఒకరు. ఆయనే వీటిని సిటీకి పరిచయం చేశారు. అలా అలా... ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలతో హ్యాండ్ మేడ్ శారీస్ రూపొందించడం ఊపందుకుంది. ఇందులో మొన్నటి లియోనార్డో డావిన్సీ చిత్రాల నుంచి నేటి ఎస్ హెచ్ రజా వంటి టాప్ క్లాస్ ఆర్టిస్ట్‌ల పెయింటింగ్స్ నుంచి ఇన్స్పైర్ అయి గీసిన చిత్రాలు ఉంటున్నాయి. ఆరు గజాల ఆర్ట్.. ఆన్లైనే ‘మార్ట్’ ఇంకా మార్కెట్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని ఈ తరహా శారీస్ ఆన్లైన్ ద్వారా బాగా పాపులర్ అయ్యాయి. ‘కోల్‌కతాకు చెందిన ఆర్టిస్ట్ ఉత్పల్ ఘోష్ క్రియేటివిటీ నా కళ్ల పడింది. ఆయన గీసిన ఒక చిత్రం బాగా నచ్చి ఆ చిత్రాన్నే శారీ మీద పెయింట్ చేసి ఇవ్వమని అడిగితే అద్భుతమైన రీతిలో చేసి పంపారు. అది కట్టుకుంటే సన్నిహితులు, బంధువుల నుంచి వచ్చిన స్పందన, ఎంక్వయిరీలే హ్యాండ్ పెయింటింగ్ శారీస్‌ను సిటీకి పరిచయం చేయాలనే ఆలోచనకు నాంది’ అని వివరించారు స్వప్న. సికింద్రాబాద్‌లో నివసించే స్వప్న... ప్రస్తుతం స్టూడియో 6యార్డ్స్ పేరుతో హ్యాండ్ వూవెన్, హ్యాండ్ పెయింటెడ్... ఇలా విభిన్న రకాల శారీస్‌ను ఆన్లైన్ ద్వారా మార్కెట్ చేస్తున్నారు. ఈజీ మేడ్ కాదు... ఈ చీరలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటాయో... తయారీ ప్రక్రియ అంత సంక్లిష్టమైంది. కనీసం 20 నుంచి నెల రోజుల సమయం పడుతుంది ఒక్కో చీర తయారీకి. ఈ పెయింటింగ్‌లోని కళాప్రతిభ సరైన రీతిలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే సరైన ఫ్యాబ్రిక్ జత కూడాలి. అందుకే తాను తన చిత్రాల చిత్రణకు బిష్ణుపూర్ సోనాముఖి సిల్క్‌ను ఎంచుకున్నానని చిత్రకారుడు ఉత్పల్ అంటున్నారు. ముందుగా వస్త్రంపై పెయింటింగ్ పూర్తి చేసిన తర్వాత స్టీమింగ్, డైయింగ్, పాలిషింగ్ వగైరాలు కూడా పూర్తయితే మోడ్రన్ ఆర్ట్ డెరైక్ట్‌గా ఫ్యాబ్రిక్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫ్యాబ్రిక్ నుంచి ప్రతిదీ హ్యాండ్‌మేడ్ కావడమే ఈ శారీస్ విశిష్టత. అచ్చం కాన్వాస్‌పైన వేసినట్టే శారీస్పైన ఆర్టిస్ట్స్ చిత్రాలను గీస్తుంటారు. అంతేకాకుండా ఈ శారీస్ వెయిట్‌లెస్ కూడా కావడంతో పార్టీవేర్‌గా అద్భుతంగా అమరిపోతున్నాయని డిజైనర్లు చెబుతున్నారు. ఆర్ట్ ఆన్ ఆర్డర్... చాలా వరకూ ఇవి కస్టమైజ్డ్గానే ఉంటున్నాయి. కొన్ని పెయింటింగ్స్‌ను చూసి వాటితో శారీస్ రూపొందించాలని షోరూమ్స్ నిర్వాహకులు ఇచ్చిన ఆర్డర్స్‌కు అనుగుణంగా ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. వాటర్ కలర్ పెయింటింగ్స్, అబ్స్ట్రాక్ట్ ఆర్ట్.. ఇలా విభిన్న రకాల చిత్రలేఖనా రీతులకు తగ్గట్టుగా ఫ్యాబ్రిక్‌ని, ఆర్టిస్ట్‌ను ఎంచుకుని తీర్చిదిద్దడంతో ఇవి అటు ఫ్యాషన్ ఇటు ఆర్ట్ రెండింటినీ ఇష్టపడే వారిని ఆకట్టుకుంటున్నాయి. ఆర్ట్‌కు కాంప్లిమెంట్... ఆర్ట్, డిజైనింగ్ ఈ రెండూ ఒకదానితో మరొకటి కాంపీట్ చేయకూడదు. కాంప్లిమెంట్ చేసుకోవాలి. హ్యాండ్ పెయింటింగ్ శారీస్ చేస్తోందదే. పెయింటింగ్ చీరలు మహిళలు ధరించడం అనేది అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. అందుకనే పూర్తిస్థాయిలో వీటి తయారీకి సిద్ధమయ్యాం. - ఉత్పల్ఘోష్, ఆర్టిస్ట్ వందలాదిగా కలెక్షన్... ముందు హ్యాండ్ పెయింటింగ్ శారీకి అభిమానిని. ఇప్పుడు వాటిని సప్లయ్ కూడా చేస్తున్నా. దాదాపు 300 పైగా శారీస్ కలెక్షన్ మా దగ్గర ఉంది. దేశవిదేశాలలో 40 సంస్థలకు రెగ్యులర్‌గా సప్లయ్ చేస్తున్నాం. ఆర్ట్‌లో క్వాలిటీ మిస్సవ్వకుండా ధరించినవారి స్థాయిని పెంచే విధంగా హ్యాండ్ పెయింటింగ్ శారీస్ ఉండాలి. - స్వప్న, స్టూడియో 6 యార్డ్స్