‘జల్లికట్టు’ స్ఫూర్తితో కేంద్రంపై యుద్ధం
సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి తమిళనాడు ప్రజల స్ఫూర్తితో అందరం కలసి పోరాడుదామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కేవలం మూడు రోజుల ఉద్యమంతో తమిళులు తమ డిమాండ్‌ను సాధించుకున్నారని, మనం మూడేళ్లయినా విభజన హామీలు సాధించుకోలేకపోయామని లేఖలో పేర్కొన్నారు.
(లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రజా ఉద్యమం ముందు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాల్సిందేనన్న విషయం జల్లికట్టు విషయంలో మరోసారి రుజువైందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాసాధనకు రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.