Letter of Recommendation
-
టీటీడీ విజిలెన్స్ వలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ
తిరుమల/సాక్షి ప్రతినిధి ఏలూరు: ఫోర్జరీ ఆధార్ కార్డులతో తన సిఫార్సు లేఖలపై వేరే రాష్ట్రాలకు చెందినవారికి తిరుమలలో శ్రీవారి దర్శనం చేయిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శుక్రవారం టీటీడీ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆయనే స్వయంగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారి గిరిధర్‌రావు వెల్లడించిన వివరాలు... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఇతర మతస్తుడైనా తరచూ శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు జారీ చేస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన టీటీడీ ఉన్నతాధికారులు లోతుగా ఈ వ్యవహారాన్ని పరిశీలించారు. గత నెల రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీ సాబ్జీ 19సార్లు సిఫార్సు లేఖలు జారీ చేశారని వెల్లడైంది. ఇందులో మూడుసార్లు ఎమ్మెల్సీయే స్వయంగా తిరుమలకు వచ్చారు. తన సిఫార్సు లేఖలపై దర్శనానికి పంపిన భక్తులంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఎమ్మెల్సీ సాబ్జీ స్వయంగా తిరుమలకు వచ్చారు. 14 మందికి బ్రేక్ దర్శనాలు కావాలని దరఖాస్తు చేశారు. ఆయన ఎమ్మెల్సీ కావడంతో టీటీడీ నిబంధనల మేరకు 10 మందికి అధికారులు బ్రేక్ దర్శన టికెట్లు ఇచ్చారు. అయితే అనుమానంతో ఆయనతోపాటు దర్శనానికి వెళ్తున్నవారిని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. భక్తులు ఫోర్జరీ ఆధార్ కార్డులపై దర్శనానికి వెళుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బెంగళూరుకి చెందిన భక్తుల ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి హైదరాబాద్‌కు చెందినవారిగా సృష్టించారని వెల్లడైంది. అంతేకాకుండా ఆరుగురు భక్తులకు దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో రూ.లక్షా 5 వేలు జమయ్యాయి. దీంతో వీరిపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో డ్రైవర్‌తో పాటు ఎమ్మెల్సీని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అధికార హోదాను అడ్డుపెట్టుకొని దర్శనాల్లో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. మండలి చైర్మన్ ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని ఆ పార్టీ నేతలు భానుప్రకాష్, విష్ణువర్ధన్ రెడ్డి వేర్వేరుగా డిమాండ్ చేశారు. -
ప్రాజెక్టులకు ‘ఎల్వోసీ’ ఇవ్వకండి, ఆర్ధిక శాఖకు కేంద్రం కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: ఆర్థికాంశాల నిర్వహణలో పారదర్శకతను మెరుగుపర్చుకునే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ తరఫున ప్రాజెక్టులను చేపట్టేందుకు ఎంపిక చేసిన సంస్థలకు ’లెటర్ ఆఫ్ కంఫర్ట్’లు (ఎల్వోసీ) జారీ చేయొద్దంటూ ప్రభుత్వంలోని ఇతర శాఖలు, విభాగాలకు సూచించింది. ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు ఇచ్చిన అధికారాలను తక్షణం ఉపసంహరిస్తూ మెమోరాండం జారీ చేసింది. ప్రభుత్వ హామీతో, ప్రాజెక్టులకు అవసరమైన నిధులను వేగవంతంగా సమకూర్చుకునేందుకు కాంట్రాక్టరుకు ఎల్వోసీలు ఉపయోగపడతాయి. రైల్వే వంటి మౌలిక సదుపాయాల కల్పన శాఖలకు వీటిని జారీ చేసే అధికారాలు ఇచ్చారు. అయితే, ఈ ఎల్వోసీలు దుర్వినియోగమవుతున్నాయన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక క్రమశిక్షణ చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలన్నింటినీ బడ్జెట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. -
ఉద్యోగం ఇప్పిసానని టోకరా..!
దేవరకొండ: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు... ప్రతిఫలంగా రూ. 5.50 లక్షలు డిమాండ్ చేశాడు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ఓ నకిలీ జాయినింగ్ ఆర్డర్ తయారు చేసి ఇచ్చారు. దీనికి తోడు ముఖ్యమంత్రే స్వయంగా వీఆర్వో జాబ్ ఇవ్వాలని సూచించినట్లు ఆ కార్యాలయం నుంచి ఒక రికమండేషన్ లెటర్ కూడా తయారు చేసి ఇచ్చారు. కాని ఉద్యోగానికెళ్తే ఆ యు వకుడికి చేదు అనుభవమే ఎదురైంది. బాధితుడు తెలి పిన వివరాల ప్రకారం..దేవరకొండ పట్టణానికి చెందిన జెల్దా వేణు స్థానికంగా ఓ లేడీస్ కార్నర్ నిర్వహిస్తున్నాడు. అతడికి తెలిసిన ఓ వ్యక్తి ద్వారా ఉద్యోగం వస్తుందని తెలపడంతో ఆశ పడా డడు. ఈక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బోధనపల్లి విజయభాస్కర్‌తో పరిచయం ఏర్పడింది. అతను తనకున్న పరిచయాలతో వీఆర్వో ఉద్యో గం ఇప్పిస్తానన్నాడు. అందుకు ప్రతిఫలంగా డిమా ండ్ చేసిన అయిదున్నర లక్షలను వేణు గత జనవరిలో విజయభాస్కర్‌రెడ్డికి ముట్టజెప్పాడు. ఇందు కు భరోసాగా విజయభాస్కర్‌రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట గల రూ. 5లక్షల చెక్కులను వేణుకు ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం గురిం చి భాస్కర్‌రెడ్డిని అడగటంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రికమండేషన్ లెటర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ల్యాం డ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మునగాల మండలం రంగాపురం వీఆర్వోగా నియామకమైనట్లు బోగస్ జాయినింగ్ ఆర్డర్ కూడా వేణుకు ఇచ్చాడు. దీంతో వేణు గత అక్టోబర్ 29న ఉద్యోగంలో చేరడానికి ఆ మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా అవి నకిలీవని తేల్చిచెప్పడంతో నివ్వెరపోయాడు. అయితే కొంత కాలంగా తన డబ్బు తన కు ఇవ్వాలని విజయభాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తుండగా తప్పించుకుని తిరుగుతుండటంతో వేణు బోరుమంటున్నాడు. నిరుపేదనైన తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఈ విషయమై దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వేణు పేర్కొన్నాడు. దీనిపై సీఐని వివరణ కోరగా తమకు లిఖితపూర్వకమైన ఫిర్యాదు అందితే విచారిస్తామన్నారు.