Leverage Review
-
అప్పులు తగ్గించుకుంటున్నాం...
న్యూఢిల్లీ: వ్యాపారాల విస్తరణ కోసం ఎడాపెడా రుణాలు తీసుకుంటూ (ఓవర్లీవరేజ్), అప్పుల కుప్పగా మారిందంటూ వస్తున్న విమర్శలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల భారాన్ని సగానికి పైగా తగ్గించుకున్నామని తెలిపింది. నికర రుణాలు, ఆపరేటింగ్ లాభాల నిష్పత్తిని మెరుగుపర్చుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఓవర్లీవరేజ్ అంశంపై ఇటీవలి క్రెడిట్‌సైట్స్ నివేదికపై స్పందిస్తూ అదానీ గ్రూప్ 15 పేజీల నోట్‌ను విడుదల చేసింది. రుణాలు, నిర్వహణ లాభాల నిష్పత్తి గడిచిన తొమ్మిదేళ్లలో 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లకు దిగి వచ్చినట్లు పేర్కొంది. 2015–16లో గ్రూప్ సంస్థల మొత్తం రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు 55 శాతంగా ఉండగా .. 2021–22లో దీన్ని 21 శాతానికి తగ్గించుకున్నట్లు తెలిపింది. ఇక అప్పట్లో 31 శాతంగా ఉన్న ప్రైవేట్ బ్యాంకుల రుణాలు ప్రస్తుతం 11 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. బాండ్ల ద్వారా సమీకరించుకుంటున్న నిధుల పరిమాణం 14 శాతం నుంచి 50 శాతానికి పెరిగిందని అదానీ గ్రూప్ పేర్కొంది. 2022 మార్చి ఆఖరు నాటికి గ్రూప్ స్థూల రుణాల రూ. 1.88 లక్షల కోట్లుగాను, నగదు నిల్వలను తీసేస్తే నికర రుణాలు రూ. 1.61 లక్షల కోట్లుగాను ఉన్నాయి. కమోడిటీ ట్రేడింగ్ కంపెనీగా మొదలైన అదానీ గ్రూప్ గత కొన్నేళ్లుగా పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్ లాంటి వివిధ రంగాల్లోకి శరవేగంగా విస్తరించింది. ఇందుకు కా వాల్సిన ఆర్థిక వనరుల కోసం రుణాలనే ఎంచుకుంటోందని, తద్వారా అప్పుల కుప్పగా మారిందని క్రెడిట్ఇన్సైట్స్ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ‘గడిచిన కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ దూకుడుగా విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తోంది. అత్యధికంగా పెట్టుబడులు అవసరమయ్యే కొత్త లేదా సంబంధం లేని వ్యాపారాల్లోకి అడుగుపెడుతోంది. దీనితో రు ణాల గణాంకాలు, నిధుల ప్రవాహంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది‘ అని క్రెడిట్‌సైట్స్ తెలిపింది. పరిస్థితి తల్లకిందులైతే .. రుణాల ఆధారిత వృద్ధి ప్రణాళికలు బెడిసికొట్టి, తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకుపోయే ముప్పు ఉందని హెచ్చరించింది. ఫలితంగా గ్రూప్ కంపెనీల్లో ఒకటి పైగా సంస్థలు దివాలా తీసే అవకాశాలు ఉన్నాయని క్రెడిట్‌సైట్స్ పేర్కొంది. -
ఎక్కడి రేట్లు అక్కడే..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్షలో యథాతథస్థితిని కొనసాగించే అవకాశం ఉందని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం శాంతించినప్పటికీ... ఈ నెల 5న ప్రకటించనున్న పాలసీ నిర్ణయంలో కీలక రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. వరుసగా రెండు పాలసీల్లో రెపో రేటును పెంచిన ఆర్బీఐ గత సమీక్ష(అక్టోబర్)లో మాత్రం రేట్లను పెంచకుండా అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. డాలరుతో రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో అక్టోబర్‌లో బ్యాంకర్లు, నిపుణులు ఆర్బీఐ రెపో రేటును పెంచొచ్చని అంచనా వేశారు. అయితే, దీనికి భిన్నంగా ఆర్బీఐ వ్యవహరించడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. 5న నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) 6.5 శాతంగా ఉంది. రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నగదుపై బ్యాంకులకు లభించే వడ్డీ) 6.25 శాతంగా కొనసాగుతోంది. ఇక సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి– బ్యాంకులు తమ డిపాజిట్ నిల్వల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం–దీనిపై ఎలాంటి వడ్డీ లభించదు) 4 శాతం వద్ద ఉంది. రూపాయి రివర్స్‌గేర్... అక్టోబర్‌లో సమీక్ష నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 72–73 రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత 74.5 స్థాయికి కూడా క్షీణించి వేగంగా కోలుకుంది. ప్రస్తుతం మళ్లీ కీలకమైన 70 ఎగువకు రికవరీ అయింది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధర (బ్రెంట్ క్రూడ్) 85 డాలర్ల నుంచి ఇప్పుడు ఏకంగా 60 డాలర్ల కిందికి దిగొచ్చింది. ఈ రెండు అంశాలూ ఆర్బీఐ రేట్ల పెంపు ఆలోచనలను పక్కనబెట్టేలా చేస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2018–19, క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కాస్త మందగించి 7.1 శాతానికి పరిమితమైంది. తొలి త్రైమాసికం(క్యూ1)లో వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ2లో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31%కి దిగొచ్చింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి కూడా. ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.7 శాతం. ఎవరేమంటున్నారంటే... ఆర్బీఐ ఈ నెల 5న ప్రకటించనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయంలో కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని కోటక్ రీసెర్చ్ అభిప్రాయపడింది. ‘గత సమీక్షలో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం రిటైల్ ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతంగా ఉండొచ్చని, అదేవిధంగా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, ఆహార ధరలు భారీగా దిగిరావడంతో ద్వితీయార్ధంతో 2.9–4.3 శాతం, వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో 4.5 శాతం స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొచ్చని మేం భావిస్తున్నాం. మరోపక్క, గత కొద్ది నెలలుగా భగ్గుమన్న పెట్రో ధరలు.. శాంతించడం కూడా ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు తోడ్పడుతుంది’ అని కోటక్ రీసెర్చ్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉండొచ్చని.. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ అంచనా వేశారు. ఈ తరుణంలో పాలసీలో ఆర్బీఐ రెపో రేటులో మార్పులూ చేయకపోచ్చని ఆయన వ్యాఖ్యానించారు. -
ఇక దిక్సూచి ఆర్బీఐ నిర్ణయమే
స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనా జీడీపీ గణాంకాల ఎఫెక్ట్ ఉంటుంది పార్లమెంట్ సమావేశాలకు ప్రాధాన్యత తీవ్ర హెచ్చుతగ్గులకు అవకాశం న్యూఢిల్లీ: సామాన్యుడి దగ్గర్నుంచి పారిశ్రామిక వర్గాల వరకూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షపై స్టాక్ మార్కెట్లు సైతం దృష్టిపెట్టాయి. మంగళవారం(2న) రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న విధాన సమీక్ష ఇకపై స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక గడిచిన శుక్రవారం(28న) మార్కెట్లు ముగిశాక వెలువడ్డ జూలై-సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని తెలిపారు. వీటితోపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశ విశేషాలు, ఆర్థిక సంకేతాలు కీలకంగా నిలవనున్నాయని వివరించారు. ప్రధాన సూచీలు ఈ వారం కొంతమేర ఒడిదుడుకులను చవిచూసే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలకు ఆటో రంగ అమ్మకాలు వెల్లడికానున్నాయి. దీంతో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలుస్తాయని అంచనా వేశారు. వడ్డీ కోత అంచనాలు...: గత వారం చివర్లో సరికొత్త గరిష్టాలను చేరిన మార్కెట్లపై 5.3%కు పరిమితమైన జీడీపీ వృద్ధి ప్రభావం ఉంటుందని పలువురు నిపుణులు విశ్లేషించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ఆర్థిక వ్యవస్థ 5.7% వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపువైపు దృష్టిపెట్టే అవకాశంలేకపోలేదని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే మార్కెట్లలో కనిపిస్తున్న ప్రస్తుత సానుకూల వాతావరణం కారణంగా ప్రధాన సూచీలు ఈ వారం కూడా కొత్త రికార్డులను సృష్టించే అవకాశముందని చెప్పారు. అంత సులువుకాదు: పార్లమెంట్ సమావేశాలు, పాలసీ సమీక్ష వంటి అంశాల నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. నవంబర్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ డేటా సోమవారం(1న), సర్వీసెస్ డేటా బుధవారం(3న) విడుదలకానున్నాయి. ఇంకా, నవంబర్ వాహన విక్రయాలు సోమవారం వెల్లడికానున్నాయి.