Levy Collection
-
రైల్వేస్టేషన్లలో అదనపు బాదుడుకు ప్లాన్! రైలెక్కినా దిగినా రూ.10 నుంచి 50?
న్యూఢిల్లీ: దేశంలోని పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మార్చేసి అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని మనం మురిసిపోతున్నాం కానీ, ఆ మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చుని ప్రయాణికులపై బాదడానికి రైల్వే శాఖ సన్నద్ధమైంది. ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికుల జేబుకి ఇక చిల్లు పడడం ఖాయం. ఈ స్టేషన్లలో లెవీ ఫీజు వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఆయా స్టేషన్లు వినియోగంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజులు వసూలు చేస్తామని చెప్పారు. మోదీ చిన్నతనంలో టీ అమ్మిన స్టేషన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఫీజుని వారు ప్రయాణించే తరగతులని బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని టికెట్ బుక్ చేసుకునే సమయంలో అదనంగా వసూలు చేస్తారు. ఈ లెవీ ఫీజు మూడు కేటగిరీల్లో ఉంటుంది. ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారి నుంచి రూ.50, స్లీపర్ క్లాసు ప్రయాణికులకు రూ.25, జనరల్ బోగీలలో ప్రయాణించే వారి నుంచి రూ.10 వసూలు చేయనున్నట్టుగా రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్ వెల్లడించింది. ఆయా స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరని కూడా మరో 10 రూపాయలు పెంచనున్నారు. సబర్బన్ రైల్వే ప్రయాణాలకు మాత్రం ఈ లెవీ ఫీజులు ఉండవు. -
పూర్తికాని లెవీ సేకరణ
మిర్యాలగూడ : ప్రజావసరాల కోసం ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) ప్రతిఏటా మిల్లర్ల నుంచి సేకరించే లెవీబియ్యం లక్ష్యం నెరవేరలేదు. సేకరణకు గడువు ఇంకా 20 రోజులే ఉన్నా, మొత్తంగా 77శాతం లక్ష్యమే పూర్తయ్యింది. 2013-14వ సంవత్సరానికి గాను గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి లెవీబియ్యం సేకరణ ప్రారంభించారు. జిల్లాలో వరిసాగు గణనీయంగా ఉన్నప్పటికీ, మిల్లర్ల పట్ల అధికారులు మెతకవైఖరి అవలంబించడం వల్ల లెవీ సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2012-13లో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 8.09 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. కాగా పచ్చిబియ్యం నూరుశాతం లక్ష్యం పూర్తి చేసినా, బాయిల్డ్ బియ్యం మాత్రం కేవలం 5.86 లక్షలు మెట్రిక్‌టన్నులు మాత్రమే సేకరించి లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారు. అయినా లెవీబియ్యం ఇవ్వని మిల్లర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. డీఎస్ఓ నాగేశ్వర్రావు మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు గడువు ఉందని, సాధ్యమైనంత త్వరగా టార్గెట్ రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నుంచి నూతన లెవీ విధానం? ఈ ఏడాది నుంచి కేంద్రప్రభుత్వం నూతన లెవీవిధానం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో మిల్లర్లు రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం లెవీబియ్యం ప్రభుత్వానికి ఇచ్చి, 25 శాతం బయట మార్కెట్లో విక్రయించుకునేవారు. కానీ నూతనవిధానం ద్వారా 25 శాతం లెవీబియ్యం ప్రభుత్వానికి ఇచ్చి, 75 శాతం బయట మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కాగా 2014-15లో లెవీబియ్యం సేకరణ లక్ష్యం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. -
ఎగుమతుల వైపు మిల్లర్ల చూపు
తాడేపల్లిగూడెం : లెవీ సేకరణ విషయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అనుసరిస్తున్న విధానం అస్తవ్యస్తంగా ఉండటంతో మిల్లర్లు విదేశాల వైపు చూస్తున్నారు. లెవీ కోసం సేకరించిన ధాన్యాన్ని ఆడించగా వచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వడానికి వారెవరూ ఇష్టపడటం లేదు. ఎఫ్‌సీఐ తీరు పొమ్మనలేక పొగ పెట్టినట్టుగా ఉంది. లెవీ సేకరణ నిబంధనలు మారాయని చెబుతున్న ఎఫ్‌సీఐ అధికారులు ఆ ఉత్తర్వుల వివరాలను గోప్యంగా ఉంచుతూ తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిల్లో బియ్యూన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వ డం కంటే విదేశాలకు ఎగుమతి చేయడమే మంచిదనే ఆలోచనకు వచ్చారు. ఇంచుమించుగా ఎఫ్‌సీఐ ఇస్తున్న ధరకే కొనుగోలు చేసేం దుకు దక్షిణాఫ్రికా నుంచి ఆర్డర్లు రావడంతో ఎగుమతిదారులు ఉభయగోదావరి జిల్లాల్లో మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కాకినాడ పోర్టులో వీటిని నిల్వచేసి, ఎల్సీలు ఉన్న సరుకును సముద్ర మార్గంలో దక్షిణాఫ్రికాకు ఓడల ద్వారా తరలిస్తున్నారు. కాకినాడ పోర్టుకు చేరా క్వింటాల్ బియ్యానికి రూ.2,400 చొప్పున ధర చెల్లిస్తున్నారు. 25 శాతం నూకలు ఉన్న బియ్యానికి ఈ ధర లభిస్తోంది. 1010 రకం బియ్యం ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వాస్తవానికి ఎఫ్‌సీఐ మిల్లర్ల నుంచి 25 శాతం నూకలు ఉన్న బియ్యాన్ని తీసుకోవాలి. కానీ 20 శాతం నూకలు ఉన్నా బియ్యాన్ని తీసుకునేది లేదని, ఒక్కోసారి 18 శాతం, మరోసారి 15 శాతం నూకలు మాత్రమే ఉండాలంటూ ఎఫ్‌సీఐ అధికారులు రోజుకో కొత్త మెలిక పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే సొమ్ములు చేతిలో పడే అవకాశం ఉండటంతో ఎగుమతుల వైపు మిల్లర్లు దృష్టి సారించారు. దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేసేందుకు ఒక్క పశ్చిమగోదావరి జిల్లానుంచే 10 వేల టన్నుల వరకు బియ్యూన్ని కొనేందుకు ఎగుమతిదారులు ముందుకొచ్చారు. కాకినాడ నుంచి ఎగుమతులు చేసే ఓ కంపెనీ ప్రతినిధులు, భీమవరానికి చెందిన ఇద్దరు ప్రతినిధులు జిల్లాలో జోరుగా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లకు దక్షిణాఫ్రికా తరఫున లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీ స్థాయిలో దక్షిణాఫ్రికాకు బియ్యం ఎగుమతి అవుతున్నాయి. గత లెవీలో సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లర్ల వద్ద పుష్కలంగా ఉన్నాయి. లెవీగా సేకరించిన ధాన్యాన్ని ఆడించగా వచ్చిన బియ్యంలో 75 శాతం ఎఫ్‌సీఐకి లెవీగా మిల్లర్లు ఇవ్వాలి. మిగిలిన 25 శాతం బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు విక్రయించుకునే వెసులుబాటు మిల్లర్లకు ఉంది. గత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో సేకరించిన ధాన్యం ఆడించగా వచ్చిన బియ్యంలో 25 శాతం విక్రయించుకునే అవకాశం ఉన్నా, అందులో కేవలం సగం సరుకును విక్రయించుకునేందుకు మాత్రమే మిల్లర్లకు అనుమతులు వచ్చాయి. దీంతో సగం సరుకు మిల్లుల్లోనే ఉండిపోయింది. ఒకపక్క ఎఫ్‌సీఐ అసంబద్ధ విధానాలు, మరోపక్క లెవీ సేకరణ శాతంపై కమ్ముకున్న నీలినీడలు మిల్లర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారుు. ఈ తరుణంలో ఎగుమతికి అనుమతులు లభించడం మిల్లర్లకు ఊరట కలిగిస్తోంది. దీంతో వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. -
లెవీ సేకరణలో కోత!
విజయనగరం కంటోన్మెంట్:పౌర సరఫరాల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణను తగ్గించే ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు మిల్లర్లు సేకరిస్తున్న బియ్యంలో 75 శాతం లెవీకి అప్పగించి.. మిగతా 25 శాతం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం... ఇకపై మిల్లర్లు సేకరించే బియ్యంలో 25 శాతం మాత్రమే లెవీకి ఇచ్చి, మిగతా 75 శాతం వారు బహిరంగ మార్కెట్లో విక్రయించుకోచ్చు. దీని వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు మిల్లర్లు 25 శాతం లేవీ మాత్రమే సేక రించి, మిగతా దాని గురించి పట్టించుకోరు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర 25 శాతం తరువాత మరి ఇచ్చే పరిస్థితి ఉం డదు. ఇప్పటివరకు సివిల్ సప్లయ్, లేదా ఎఫ్‌సీఐ బియ్యాన్ని మిల్లర్లు నుంచి కిలో 26 రూపాయల చొప్పున కొనుగోలు చేసి, కిలో రూపాయి చొప్పన రేషన్ డిపోల ద్వారా పేదలకు అందజేస్తోంది. అయితే ఈ రూపాయిలో రేషన్ డిపో డీలర్‌కు 20పైసలు కమీషన్‌గా చెల్లిస్తోంది. దీంతో కిలో బియ్యంవద్ద కేవలం 80 పైసలు మాత్రమే ప్రభుత్వానికి లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతోనే లెవీ సేకరణ శాతం ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు రైతులు తేలికపాటి రకాలైన వరి వంగడాలనే సాగు చేసి విక్రయిస్తున్నారు. ఇతర రకాలకు ఈ ప్రాంత భూములు అనుకూలంగా ఉండవు. కేంద్ర ప్రభుత్వ నూతన విధానం వల్ల రైతులు సాగు చేసిన తేలికపాటి పంటను మిల్లర్లు కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకురారు. మద్దతు ధర కూడా కొంతవరకే ఉంటుంది. దళారులు, వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమా దం ఉంది. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న మసూరి, సోనా మసూరి, సాంబమసూరి వంటి రకాలను రైతులు ఎప్పటి నుంచో పం డించడం మానేశారు. ఇప్పుడు ఉన్న వర్షాభావ పరిస్థితులు, పెరిగిన పెట్టుబడులతో కేవలం తేలిక రకాలైన 1001,1010 వరి వంగడాలను మాత్రమే సాగు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం రేషన్ భారాన్ని మోయలేమని కేవలం 25 శాతం మాత్రమే తీసుకుంటామని చెబుతుండడంతో మిల్లర్లు 25 శాతం కొనుగోలు చేసి చేతులెత్తేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాగా ప్రస్తుతం జిల్లాకు ప్రతి నెలా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నాయి. ఈ లెక్కన ఏడాదికి లక్షా 32 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 25 శాతమే తీసుకుంటామని చెప్పడంతో ఈ భారం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పడుతుంది. 26 రూపాయల లెక్కన మిగతా 50 శాతం బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కష్టమే.