License agreement
-
పేరు వాడితే...! రూ. 7500 కోట్లు కట్టాల్సిందే...!
ప్రపంచవ్యాప్తంగా ఈఏ స్పోర్ట్స్ పలు గేమింగ్స్‌ను అభివృద్ధి చేయడంలో ఎంతో ప్రఖ్యాతిని పొందింది. ఈఏ స్పోర్ట్స్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, నీడ్ ఫర్ స్పీడ్ వంటి గేమ్స్ భారీ ఆదరణను పొందాయి. కాగా ఈఏ స్పోర్ట్స్ గేమ్స్‌ను డెవలప్ చేసే సమయంలో ఆయా క్రీడాలకు సంబంధించిన సంస్థల పేర్లను వాడుకుంటాయి. సంస్థల పేర్లను వాడుకున్నందుకుగాను ఈఏ స్పోర్ట్స్ కొంత మొత్తాన్ని ఆయా సంస్థలకు చెల్లిస్తుంది. తాజాగా ప్రముఖ గేమింగ్ దిగ్గజం ఈఏ స్పోర్ట్స్, ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా సంస్థలు మధ్య బ్రాండ్ లైసెన్సింగ్ విషయంలో అనిశ్చితి నెలకొంది. చదవండి: అరేవాహ్...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ..! ఈఏ స్పోర్ట్స్‌లో ఫుట్‌బాల్ గేమ్ అత్యంత ఆదరణను పొందింది. ఫుట్‌బాల్ గేమ్‌కు ఫిఫా పేరును ఈఏ స్పోర్ట్స్ తన ఫుట్‌బాల్ గేమ్‌కు వాడుకుంటుంది. అందుకుగాను ఇప్పటికే ఈఏ స్పోర్ట్స్ ఫిఫా సంస్థకు సంవత్సరానికి సుమారు 150 మిలియన్(రూ .1130 కోట్లు) డాలర్లను చెల్లిస్తోంది. ఈఏ స్పోర్ట్స్, ఫిఫా మధ్య పదేళ్లపాటు ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం వచ్చే ఏడాదితో ముగియనుంది. దీంతో ఫిఫా సమాఖ్య ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే రెట్టింపు డబ్బులను ఇవ్వాలని ఈఏ స్పోర్ట్స్‌కు షరతును పెట్టింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం...నాలుగు సంవత్సరాల కోసం సుమారు ఒక బిలియన్ (సుమారు రూ. 7,532 కోట్లు) పైగా ఫిఫా సమాఖ్య కోరుకుంటుంది. అంతేకాకుండా ఈఏ స్పోర్ట్స్ అదనపు రెవెన్యూ నుంచి అదనపు ఫీజును కూడా వసూలు చేయాలని ఫిఫా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. A new report in the @nytimes states that the dispute between EA and FIFA is related to cost and new revenue streams FIFA wants to charge EA double the amount ($1bn+ every 4 years) for the license and limit EA's ability to monetise beyond the game itselfhttps://t.co/5gNas9Iz9b pic.twitter.com/hZ9YnOZDMN — Daniel Ahmad (@ZhugeEX) October 13, 2021 చదవండి: సొంత బ్రాండ్లకే సెర్చ్‌లో టాప్ ప్రయారిటీ.. భారత్‌లో కాపీ ప్రొడక్ట్స్!? -
ఫ్లాట్లను అద్దెకు ఇస్తాం
- గృహ నిర్మాణ శాఖను సంప్రదించిన బిల్డర్లు - లెసెన్స్ అగ్రిమెంట్ విధానాల్లో మార్పు చేయాలని విజ్ఞప్తి - అపార్ట్మెంట్లకు డిమాండ్ లేక సతమతమం - కోట్లల్లో ధరలు.. పక్క ప్రాంతాల బాట పడుతున్న ప్రజలు ముంబై: లగ్జరీ అపార్ట్మెంట్లకు డిమాండ్ లేక సతమతమవుతున్న బిల్డర్లు లెసైన్స్ అగ్రిమెంట్ విధానాల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు సరైన ఊతం లేకపోవడంతో ఇప్పటి వరకు అమ్ముడవని ప్లాట్లను అద్దెకు ఇచ్చి కొంత సొమ్మును సంపాదిద్దామని అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు బిల్డర్ల నుంచి ఏవిధమైన అధికారిక ప్రతిపాదన అందలేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. బిల్డర్లు సరైన ప్రతిపాదనతో వస్తే గృహనిర్మాణ శాఖ స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. మధ్య తరగతి వర్గం వారికి ముంబైలో ఇళ్లు కొనడం చాలా కష్టమని, ఇప్పటి వరకు నగరంలో అమ్ముడవని ప్లాట్లు 5 లక్షల వరకు ఉన్నాయని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ప్లాట్లు గనక అమ్ముడవకపోతే బిల్డర్లు బ్యాంకులకు అప్పు చెల్లించలేరని, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి అమ్ముడవని ప్లాట్లను అద్దెకు ఇవ్వాలని వారు తమను సంప్రదించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్లాట్లు, సర్వీసు అపార్ట్మెంట్లకు గల లెసైన్స్ విధానాన్ని మార్చాలని కోరుతున్నారన్నారు. ముంబైలో అమ్ముడవని ప్లాట్లు, అపార్ట్మెంట్ల ఖరీదు కోట్లల్లో ఉందని, వాటిని కొనలేక ప్రజలు ముంబై చుట్టుపక్కల ప్రాంతాలైన థాణే, నవీ ముంబై, వాసాయ్-విరార్ ప్రాంతాలకు వెళ్తున్నారని అన్నారు. దీంతో అప్పులు తీర్చడానికి ఈ కొత్త విధానంతో ముందుకు వచ్చారని, రూ. రెండు కోట్లు విలువ ఉన్న అపార్ట్‌మెంట్‌ను రూ. 30,000 అద్దెకు ఇవ్వాలని వారు యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటికి అవసరమైన సామాను, పారిశుధ్యం, నీరు, పార్కింగ్ సౌకర్యం, మెయింటెనెన్స్ సౌకర్యాలను బిల్డర్లు సమకూరుస్తారని అధికారి చెప్పారు. అద్దెకు తీసుకునే వారి ఆర్థిక స్థితిని బట్టి తగ్గించడం జరుగుతుందని, తక్కువ సమయం కోసం అపార్ట్మెంట్ కావాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. 5-స్టార్ హోటల్లలో చెల్లించేంత బిల్లు వీటికి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు.