ప్రపంచవ్యాప్తంగా ఈఏ స్పోర్ట్స్ పలు గేమింగ్స్‌ను అభివృద్ధి చేయడంలో ఎంతో ప్రఖ్యాతిని పొందింది. ఈఏ స్పోర్ట్స్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, నీడ్ ఫర్ స్పీడ్ వంటి గేమ్స్ భారీ ఆదరణను పొందాయి. కాగా ఈఏ స్పోర్ట్స్ గేమ్స్‌ను డెవలప్ చేసే సమయంలో ఆయా క్రీడాలకు సంబంధించిన సంస్థల పేర్లను వాడుకుంటాయి. సంస్థల పేర్లను వాడుకున్నందుకుగాను ఈఏ స్పోర్ట్స్ కొంత మొత్తాన్ని ఆయా సంస్థలకు చెల్లిస్తుంది. తాజాగా ప్రముఖ గేమింగ్ దిగ్గజం ఈఏ స్పోర్ట్స్, ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా సంస్థలు మధ్య బ్రాండ్ లైసెన్సింగ్ విషయంలో అనిశ్చితి నెలకొంది.
చదవండి: అరేవాహ్...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ..!
ఈఏ స్పోర్ట్స్‌లో ఫుట్‌బాల్ గేమ్ అత్యంత ఆదరణను పొందింది. ఫుట్‌బాల్ గేమ్‌కు ఫిఫా పేరును ఈఏ స్పోర్ట్స్ తన ఫుట్‌బాల్ గేమ్‌కు వాడుకుంటుంది. అందుకుగాను ఇప్పటికే ఈఏ స్పోర్ట్స్ ఫిఫా సంస్థకు సంవత్సరానికి సుమారు 150 మిలియన్(రూ .1130 కోట్లు) డాలర్లను చెల్లిస్తోంది. ఈఏ స్పోర్ట్స్, ఫిఫా మధ్య పదేళ్లపాటు ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం వచ్చే ఏడాదితో ముగియనుంది. దీంతో ఫిఫా సమాఖ్య ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే రెట్టింపు డబ్బులను ఇవ్వాలని ఈఏ స్పోర్ట్స్‌కు షరతును పెట్టింది.
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం...నాలుగు సంవత్సరాల కోసం సుమారు ఒక బిలియన్ (సుమారు రూ. 7,532 కోట్లు) పైగా ఫిఫా సమాఖ్య కోరుకుంటుంది. అంతేకాకుండా ఈఏ స్పోర్ట్స్ అదనపు రెవెన్యూ నుంచి అదనపు ఫీజును కూడా వసూలు చేయాలని ఫిఫా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
A new report in the @nytimes states that the dispute between EA and FIFA is related to cost and new revenue streams
— Daniel Ahmad (@ZhugeEX) October 13, 2021
FIFA wants to charge EA double the amount ($1bn+ every 4 years) for the license and limit EA's ability to monetise beyond the game itselfhttps://t.co/5gNas9Iz9b pic.twitter.com/hZ9YnOZDMN
చదవండి: సొంత బ్రాండ్లకే సెర్చ్‌లో టాప్ ప్రయారిటీ.. భారత్‌లో కాపీ ప్రొడక్ట్స్!?
Comments
Please login to add a commentAdd a comment