Lieutenant Governor Kiran Bedi
-
సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య సమరం..
-
సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య సమరం..
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఏ మాత్రం తగ్గడం లేదు. తన మీద పాలకులు చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక, ప్రభుత్వం నుంచి రాజ్ నివాస్‌కు వచ్చే అన్ని రకాల ఫైల్స్, అందులోని వివరాలు, ఆమోద ముద్ర వరకు ప్రజలకు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. అన్ని విషయాల్ని బహిర్గతం చేస్తామంటూ రాజ్‌నివాస్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రకటించడం విశేషం. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వానికి, పథకాలకు వ్యతిరేకంగా కిరణ్ వ్యవహరిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంపించే ఫైల్స్‌ను తుంగలో తొక్కుతున్నారని, అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజాహిత కార్యక్రమాలన్నీ గవర్నర్ రూపంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని పేర్కొంటూ వస్తున్నారు. ఇది కాస్త ప్రజల్లో ఆగ్రహాన్ని రేపింది. కిరణ్ పర్యటన సాగే ప్రాంతాల్లో ఆందోళనలు, వ్యతిరేకత తప్పడం లేదు. ఆమెను ఘెరావ్ చేయడం, వెనక్కు వెళ్లాలన్న నినాదంతో ప్రజలతో కలిసి పాలకులు ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాను ఏ మాత్రం తగ్గేది లేదన్నట్టుగా కిరణ్ దూకుడు పెంచడం గమనార్హం. సీఎం నారాయణస్వామి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టే విధంగా కొత్త ఎత్తుగడ వేశారు. ఇక, అన్నీ బహిర్గతం: తాను ఫైల్స్‌ను పక్కన పెడుతున్నట్టు, పథకాలకు ఆమోదం ఇవ్వడం లేదని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి నిర్ణయం తీసుకున్నారు. రాజ్ నివాస్‌కు వచ్చే అన్ని ఫైల్స్, ఇతర వివరాలను ప్రజలకు తెలియజేయనున్నట్టు ప్రకటించారు. తమ ఆమోదానికి తగ్గ అన్ని వివరాలను రాజ్ నివాస్ వెబ్సైట్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. ఆ మేరకు ఈనెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాజ్ నివాస్‌కు వచ్చిన ఫైల్స్, తాము వేసిన ఆమోద ముద్ర వివరాలను ప్రకటించారు. ఇందులో ఉచిత బియ్యం పంపిణీకి రూ.1931 కోట్ల కేటాయింపునకు తగ్గ ఫైల్, ఠాకూర్ కళాశాల పేరు మార్పు, ఆరోగ్యశాఖలో వైద్యుల పోస్టుల భర్తీ, ఆయా సంస్థలకు ట్రస్టీల నియామకం, నామినేటెడ్ పోస్టులు వంటి అంశాలతో కూడిన ఫైల్స్ ఉన్నాయి. ఇక, మీద ప్రతి బుధ, శనివారాల్లో రాజ్ నివాస్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫైల్స్, వాటి స్థితి, ఆమోదం వరకు అన్ని వివరాలను తెలియజేస్తామని కిరణ్ పేర్కొనడం గమనార్హం. తాజాగా, తమను ఢీకొట్టే విధంగా కిరణ్ అడుగుల వేగాన్ని పెంచడం పాలకులకు మింగుడు పడడం లేదని చెప్పవచ్చు. -
ఈ గవర్నర్ మాకొద్దు
► కిరణ్‌బేడీపై వ్యతిరేకత ► స్పీకర్‌కు 3 పార్టీల లేఖాస్త్రం ► రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు ► పుదుచ్చేరిలో ముదిరిన ఆధిపత్య పోరు సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో అధికార ఆధిపత్య పోరు మరింతగా ముదిరింది. అసెంబ్లీ వేదికగా స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఉల్లంఘించడం వివాదానికి దారి తీసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి వ్యతిరేకంగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ గవర్నర్ తమకు వద్దే వద్దు అని, వెనక్కు పంపించా ల్సిందేనంటూ స్పీకర్ వైద్యలింగంకు ఆ పార్టీల ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని కేంద్రం రంగంలోకి దించింది. దీంతో గవర్నర్, సీఎంల మధ్య తరచూ వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అధికార ఆధిపత్యం కోసం ఇన్నాళ్లు సీఎం, గవర్నర్ మధ్య సమరం సాగింది. ప్రస్తుతం సీఎంకు మద్దతుగా స్పీకర్ , ఎమ్మెల్యేలు తోడయ్యారు. మరో కొత్త వివాదం: సీఎం తీసుకునే నిర్ణయాలకు గవర్నర్ అడ్డు పడటం, గవర్నర్ ఉత్తర్వులను సీఎం తుంగలో తొక్కడం వంటి పరిణామాలు ఇన్నాళ్లు పుదుచ్చేరిలో వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో గత వారం మొదలియార్ పేట ఎమ్మెల్యే భాస్కరన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుదుచ్చేరి నగర కార్పొరేషన్ కమిషనర్ చంద్రశేఖరన్‌ను వెయిటింగ్ లిస్టులో పెడుతూ అసెంబ్లీ వేదికగా స్పీకర్ వైద్యలింగం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా చంద్రశేఖరన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. అయితే, అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్ తప్పుబట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను రద్దు చేయడం మరో కొత్త వివాదానికి దారి తీసింది. అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతూ గవర్నర్ వ్యవహరించడాన్ని అధికార, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్రంగానే పరిగణించారు. గవర్నర్ కిరణ్ బేడీ ఆదేశాల మేరకు చంద్రశేఖరన్ సోమవారం మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరించారు. దీంతో గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్, డిఎంకే, అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు. సమష్టిగా.. ప్రభుత్వ నిర్ణయాల్నే కాదు, అసెంబ్లీ నిర్ణయాలు, తీర్మానాలను ఉల్లంఘించే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్, డీఎంకే,అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు. ఈ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్‌కు లేఖలు రాశారు. స్వయంగా స్పీకర్ వైద్యలింగంకు ఈ లేఖల్ని సమర్పించారు. అందులో ఈ గవర్నర్ తమకు వద్దే వద్దు అని, వెనక్కు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కిరణ్ బేడి తీరును ఏకరువు పెడుతూ, ఆ లేఖల్లో పలు అంశాలను వివరించారు. ఈ లేఖల్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపించేందుకు స్పీకర్ నిర్ణయించారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి అడుగులు వేయడానికి పుదుచ్చేరి ప్రభుత్వం కసరత్తుల్లో పడింది. కాగా, సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏక పక్షంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి, అసెంబ్లీకి ప్రత్యేక అధికారాలు ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణించాలని సూచించారు. -
ఈ గవర్నర్ మాకొద్దు
♦ కిరణ్‌బేడీపై వ్యతిరేకత ∙ ♦ స్పీకర్‌కు 3 పార్టీల లేఖాస్త్రం ♦ రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు ♦ పుదుచ్చేరిలో ముదిరిన ఆధిపత్య పోరు సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో అధికార ఆధిపత్య పోరు మరింతగా ముదిరింది. అసెంబ్లీ వేదికగా స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఉల్లంఘించడం వివాదానికి దారి తీసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి వ్యతిరేకంగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ గవర్నర్ తమకు వద్దే వద్దు అని, వెనక్కు పంపించా ల్సిందేనంటూ స్పీకర్ వైద్యలింగంకు ఆ పార్టీల ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని కేంద్రం రంగంలోకి దించింది. దీంతో గవర్నర్, సీఎంల మధ్య తరచూ వివాదాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అధికార ఆధిపత్యం కోసం ఇన్నాళ్లు సీఎం, గవర్నర్ మధ్య సమరం సాగింది. ప్రస్తుతం సీఎంకు మద్దతుగా స్పీకర్ , ఎమ్మెల్యేలు తోడయ్యారు. మరో కొత్త వివాదం: సీఎం తీసుకునే నిర్ణయాలకు గవర్నర్ అడ్డు పడటం, గవర్నర్ ఉత్తర్వులను సీఎం తుంగలో తొక్కడం వంటి పరిణామాలు ఇన్నాళ్లు పుదుచ్చేరిలో వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో గత వారం మొదలియార్ పేట ఎమ్మెల్యే భాస్కరన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుదుచ్చేరి నగర కార్పొరేషన్ కమిషనర్ చంద్రశేఖరన్‌ను వెయిటింగ్ లిస్టులో పెడుతూ అసెంబ్లీ వేదికగా స్పీకర్ వైద్యలింగం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా చంద్రశేఖరన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. అయితే, అసెంబ్లీ నిర్ణయాన్ని గవర్నర్ తప్పుబట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను రద్దు చేయడం మరో కొత్త వివాదానికి దారి తీసింది. అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతూ గవర్నర్ వ్యవహరించడాన్ని అధికార, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్రంగానే పరిగణించారు. గవర్నర్ కిరణ్ బేడీ ఆదేశాల మేరకు చంద్రశేఖరన్ సోమవారం మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరించారు. దీంతో గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్, డిఎంకే, అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు. సమష్టిగా.. ప్రభుత్వ నిర్ణయాల్నే కాదు, అసెంబ్లీ నిర్ణయాలు, తీర్మానాలను ఉల్లంఘించే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్, డీఎంకే,అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు. ఈ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్‌కు లేఖలు రాశారు. స్వయంగా స్పీకర్ వైద్యలింగంకు ఈ లేఖల్ని సమర్పించారు. అందులో ఈ గవర్నర్ తమకు వద్దే వద్దు అని, వెనక్కు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కిరణ్ బేడి తీరును ఏకరువు పెడుతూ, ఆ లేఖల్లో పలు అంశాలను వివరించారు. ఈ లేఖల్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపించేందుకు స్పీకర్ నిర్ణయించారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి అడుగులు వేయడానికి పుదుచ్చేరి ప్రభుత్వం కసరత్తుల్లో పడింది. కాగా, సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏక పక్షంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి, అసెంబ్లీకి ప్రత్యేక అధికారాలు ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణించాలని సూచించారు.