Lifestyle Counseling
-
ఎంత సంపాదిస్తే ఏం లాభం? వేళకు తిండి, కంటినిండా నిద్రా లేకుంటే!
Healthy Lifestyle Tips: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజువారీ జీవితంలో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నారు చాలామంది. కొంత మంది అయితే మాడిపోతున్న పొట్టను పిజ్జా, బర్గర్లతోనో, బిస్కెట్లతోనో మాయ చేస్తూ, కూరుకుపోతున్న కళ్లను టీ చుక్కలతో బలవంతంగా తెరిపి'స్తూ నిద్రాహారాలు మాని మరీ పని చేస్తుంటారు. ఇలా బిజీ లైఫ్‌లో పడి చాలా మంది తమ ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ధ చూపించడం కూడా మరచిపోతున్నారు. ఫలితంగా కడుపులో అల్సర్లు, గ్యాస్... లావుపాటి కళ్లద్దాలు, ఊబకాయాలతో రకరకాల రోగాల బారిన పడుతున్నారు. ఎంత సంపాదిస్తే ఏం లాభం? వేళకు తిండి, కంటినిండా నిద్రా, ఆ సంపాదనను అనుభవించేందుకు తగిన ఆరోగ్యం లేకపోతే! పరుగులు పెట్టడం తప్పదు, సంపాదించడమూ తప్పదు. అయితే జీవనశైలిలో తగిన మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా... ఆనందంగా జీవించవచ్చు. అందుకు తగిన మార్గాలివిగో... ప్రపంచంతో పాటు పోటీ పడి ముందుకు సాగటం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయం. ఇది కాదనలేని సత్యం. అయితే ఇదే సమయంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపడం అత్యవసరం. ఇందుకోసం ప్రతి ఒక్కరు తమ కోసం తాము రోజూ కొంత సమయాన్ని విధిగా కేటాయించాలని, లేదంటే చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాయామంతో మొదలు పెట్టాలి కరోనా ప్రభావం వల్ల మొన్నటి దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు చాలా మంది. కొంతమంది ఇప్పటికీ అదే పద్ధతిలో ఉన్నారు. కొన్ని సంస్థలలో మాత్రం వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వచ్చేలా, మిగిలిన రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించమని ఉద్యోగులకు చెబుతున్నారు. దీనితో కనీసం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే.. తినడం, పనిచేయడం, పడుకోవడం వంటివి చేస్తున్నారు. దీనిమూలంగా ఒకవిధమైన లేజీనెస్, ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించడం, ఇంటిలో చిన్న చిన్న కీచులాటలు తప్పడం లేదు. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి రోజు ఉదయం లేవగానే రన్నింగ్, జాగింగ్ వంటివి చేయడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటే.. ఇంట్లోనే వీలైన వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా చిన్న చిన్న వ్యాయామాలు లేదా యోగా చేయడం ద్వారా.. పని ఒత్తిడి దూరమై, ప్రతి రోజూ కొత్తగా ప్రారంభించేందుకు వీలవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌ను బ్రేక్ చేయొద్దు: వ్యాయామం చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బద్ధకించవద్దు. ఇడ్లీ, దోసె, ఉప్మా, చపాతి, మొలకలు, పండ్ల ముక్కలు, కీరా ముక్కలు... ఇలా ఏదైనా సరే మీకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ తప్పకుండా చేయండి. టిఫిన్ తినకుండా పని చేయడం వల్ల నిస్సత్తువగా ఉండటం, పని మీద ఏకాగ్రత లేకపోవడం, పని చేయడానికి తగిన శక్తి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాతే మీ పనిలోకి దిగండి. మంచి నీళ్లు తాగటం మంచిది శరీరంలో అన్ని క్రియలు సరిగ్గా జరగాలంటే నీరు చాలా అవసరం. అందుకే తరచూ నీళ్లు తాగటం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సమృద్ధిగా నీళ్లు తాగడం వల్ల చర్మం నిగ నిగలాడుతూ.. ఆరోగ్యంగా ఉంటుంది. దాహం అయితేనే నీళ్లు తాగడం అనేది కాకుండా... కనీసం గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకోవడమూ మంచిది. ఆహారంపై దృష్టి తప్పనిసరి ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చాలామంది ఒక సమయం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు. అంతే కాదు, టైమ్ పాస్ కోసం స్నాక్స్ అంటూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. రోజు టైమ్ టేబుల్ ఫిక్స్ చేసుకుని.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో స్నాక్స్ వంటివి తీసుకోవడం వల్ల ఆహారంలో రుచితో పాటు పోషకాలు కూడా ఉండేలా చూసుకోవడం అవసరం. రిలాక్సేషన్‌కు రిలాక్సేషన్ ఇవ్వకండి ఎంత పని చేసినా, మధ్య మధ్యలో కాసేపు సేదతీరడం అవసరం. లేదంటే మెదడు వేడెక్కి పనిమీద ధ్యాస తగ్గిపోతుంది. ఫలితంగా ఎక్కువ గంటలు పని చేసిన ట్లు అనిపిస్తుంది కానీ చేసిన పని కనిపించదు. ఒత్తిడి వద్దే వద్దు ఇంట్లోనే ఉండటం వల్ల చాలా మందికి ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతుండటం సాధారణ సమస్యగా మారింది. ఇందుకోసం ఒత్తిడిగా అనిపించినప్పుడు కాసేపు పనిని పక్కన పెట్టి.. ఇంట్లో వాళ్లతో మాట్లాడటం కాసేపు ప్రకృతిని ఆస్వాదించడం వంటివి చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌గా పక్కన పెట్టేయండి అన్నింటికీ మించి స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఎందుకంటే, చాలా మంది ఫోన్ వాడుతూ టైమ్ ఎంతసేపు గడిచించో కూడా పట్టించుకోరు. అందుకే స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్‌గా వాడటం అలవాటు చేసుకోవాలి. ఎంతసేపు వాడుతున్నాం అనే విషయంపై దృష్టి సారించాలి. నిద్రను జోకొట్టకండి రోజంతా చురుకుగా ఉండాలంటే కంటినిండా నిద్ర పోవడం చాలా అవసరం. రోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. దీని ద్వారా మరుసటి రోజును తాజాగా, నూతనోత్సాహంతో ఆరంభించవచ్చు. మనం పైన చెప్పుకున్నవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లో ఉన్నవారికే అనిపించవచ్చు కానీ, రిటైర్ అయి విశ్రాంత జీవితం గడిపేవారు అయినా, ఇంటి వద్దే ఉండి కుటుంబ సభ్యుల కోసం పనులు చేస్తూ పనిలోనే లీనమైపోయే గృహిణులు అయినా... ఇలా ఎవరూ మినహాయింపు కాదు. చదవండి👉🏾 Vimala Reddy: టైమ్‌పాస్ కోసం బ్యూటీ కోర్స్ చేశా.. 2 గంటలకు ఆరున్నర వేలు వచ్చాయి.. ఆ తర్వాత.. -
వర్క్ ప్లేస్ / లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్
ఒత్తిడితోనూ ఒళ్లునొప్పులు వస్తాయా? నా వయసు 50 ఏళ్లు. ఇటీవల కొన్ని ఆర్థిక సమస్యలతో డబుల్‌షిఫ్ట్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. నా పనిలో అకౌంట్స్ చాలా నిశితంగా చూడాలి. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్నది కూడా. ఇటీవల నాకు తీవ్రంగా ఒళ్లునొప్పులు, నడుము నొప్పి వస్తున్నాయి. ఇంటికెళ్లే ముందు నిస్సత్తువగా ఉంటోంది. ఇది ఒత్తిడి కారణంగానే అంటారా? మందులతో కాకుండా దయచేసి నా సమస్యకు సాధారణ పరిష్కారాలు చూపించండి. – వై. నిరంజన్‌రెడ్డి, నకిరేకల్ అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారు తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో ఎక్కువ అలసటతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తి సంబంధ సమస్యలు సైతం రావచ్చు. మీలాంటి వారు అలసట, వృత్తి సంబంధ సమస్యలను నివారించడానికి ఈ సూచనలు పాటించడం మేలు. ♦ పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగ రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది ♦ చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. వ్యక్తులు అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు ♦ మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా సాధారణం ♦ కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి ♦ కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు ♦ రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి ♦ భోజన వేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగ్గొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు ♦ ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. కంప్యూటర్ ముందు అదే‘పని’గా... నేను ఆఫీసుకు వచ్చి కంప్యూటర్ ముందు కూర్చున్నానంటే సాయంత్రం వరకూ లేవనే లేవను. మధ్య మధ్య ఫ్రెండ్ పిలిచినా నా పని పూర్తయ్యేవరకు నాకు మధ్యలో పని వదిలేసి వెళ్లాలనిపించదు. అంతంత సేపు కూర్చొనే ఉండటం మంచిది కాదని ఫ్రెండ్స్ అంటున్నారు. ఫ్రెండ్స్ మాటలతో నాలో ఆందోళన పెరుగుతోంది. ఇది వైద్యపరంగా వాస్తవమేనా? పరిష్కారాలేవైనా ఉంటే సూచించండి. – కె. సెల్వరాజ్, హైదరాబాద్ మీలా కూర్చొని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా ఒకే భంగిమలో కూర్చొని ఉండటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇలా సుదీర్ఘకాలం పాటు కూర్చొనే ఉండటం అన్నది టైప్–2 డయాబెటిస్, ప్రాణాంతకమైన గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లకూ కారణమవుతుంది. కూర్చునే వృత్తుల్లో ఉన్నా లేదా ప్రయాణాలు చేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా సీట్లో చాలాసేపు కూర్చోవడం, లేదా టీవీని వదలకుండా చూస్తూ కూర్చోవడం, బైక్‌మీద ఎక్కువ ప్రయాణం వంటివి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. పొగతాగడం వంటి దురలవాటు ఎంత దుష్ప్రభావం చూపుతుందో, ఇలా కూర్చొనే ఉండటం అన్న అంశం కూడా అంతకంటే ఎక్కువ దుష్ప్రభావమే చూపుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించిన వాస్తవం. ప్రతివారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం అవసరం. అదేపనిగా కూర్చోవడాన్ని బ్రేక్ చేయడం కోసం కొన్ని సూచనలు పాటించాలి. అవి... ♦ టీవీ / కంప్యూటర్ / ల్యాప్‌టాప్‌లను బెడ్రూమ్స్లో ఉపయోగించకండి ♦ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటికి పనిచెప్పే ఏదో పనిని ఎంచుకోండి ♦ ఎస్కలేటర్ వంటి సౌకర్యం ఉన్నా మెట్లెక్కండి nరోజూ కనీసం 30 నిమిషాలు నడవాలని నియమం పెట్టుకోండి ♦ మీ వర్క్ ప్లేస్‌తో ఫోన్లో మాట్లాడేటప్పుడు అటూ ఇటూ నడుస్తూ మాట్లాడండి ♦ మీ పనిలో కాసేపు కాఫీ లేదా టీ బ్రేక్ తీసుకోండి ♦ మీకు దగ్గరి కొలీగ్స్‌తో మాట్లాడాల్సి వస్తే మొబైల్ / మెయిల్ ఉపయోగించకండి. వారి వద్దకే నేరుగా వెళ్లి మాట్లాడండి. ♦ దేహానికి ఒకింత కదలికల కోసం నడక తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి ♦ టీవీ చూడటం కంటే మంచి హాబీని పెంపొందించుకోండి. ఈ టిప్స్ మీకు కొంతలో కొంత మేలు చేస్తాయి. - డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
వేసవి వేడి పెరిగింది కదా... వ్యాయామం ఆపేయాలా? ఈమధ్యే ఫిబ్రవరి మొదటివారంలో వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు మార్చిలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కదా... ఇలాంటి వేడి వాతావరణంలో వ్యాయామం చేయకూడదని, అది మంచిదికాదని ఫ్రెండ్స్ అంటున్నారు. నేను వ్యాయామం ఆపేయాలా? దయచేసి నాకు సలహా ఇవ్వండి. – ఎల్. రామచంద్రం, విజయవాడ వేసవిలో వ్యాయామం ఆపేయాల్సిన పనిలేదు గానీ ఈ సీజన్లో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితో పాటు ఖనిజలవణాలను కోల్పోతుంది. మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. చాలా మంది చెప్పేట్లుగా వాతావరణంలో వేడి పెరుగుతున్న ఇలాంటి సమయంలో వ్యాయామం మాననక్కర్లేదు గానీ పైన చెప్పిన అనర్థాలు నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించండి. అవి... ♦ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి. ♦ చెమటను పీల్చే కాటన్ దుస్తులను ధరించండి. ♦ బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ♦ మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి. ఆరోగ్యకరంగా బరువు పెరగడం ఎలా? నా వయసు 23 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటానని అందరూ ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. బరువు కేవలం 46 కేజీలు మాత్రమే. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. – ఎమ్. సంతోష్, విశాఖపట్నం కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... ♦జన్యుపరమైనవి సరిగా తినకపోవడం ♦ చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం ♦ అవి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపకరమైన రుగ్మతలు ఉన్నప్పుడు కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... ♦ మీకు ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ౖహె పర్ థైరాయిడిజమ్) మీరు తీసుకునే ఆహరంలో పోషకాలు పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ వివరాలను అడిగి తెలుసుకుంటారు. ♦ ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. మీకు కొన్ని సూచనలు : ∙మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో మరో మూడుసార్లు తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి ♦ మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై చెడుప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హై–ప్రోటీన్ డైట్ వద్దు. ♦ మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి. ♦ ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి. ♦ ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి. ♦ వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. ♦ మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి. ♦ అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానికి దోహదపడతాయంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు. - డాక్టర్ సుధీంద్ర ఊటూరి ,లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పిజ్జా, బర్గర్లు మాత్రమే తింటున్నాడు..!
మా బాబు వయసు పన్నెండేళ్లు. ఇటీవల వాడు పిజ్జా, బర్గర్లను మాత్రమే ఇష్టపడుతున్నాడు. వాడి బరువు క్రమంగా పెరగడంతో పాటు ఊబకాయంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. – నవీన, రాజమండ్రి పిల్లలు టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాయామాలు, ఆటల వంటి కార్యకలాపాలపై ఎక్కువ సమయం వెచ్చించడం లేదు. కౌమార బాలబాలికలు ఆహార నియమాలు సరిగా పాటించకపోగా... అనారోగ్యకరమైనవీ, పోషకాలు సరిగా లేనివి అయిన ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో ఒబేసిటీ, ఆస్తమా వంటి శారీరక రుగ్మతలతోపాటు వాళ్ల వికాసం, మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపుకంటే ఎక్కువగా పిల్లలు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇలా పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో స్థూలకాయం, హైబీపీ, హైకొలెస్ట్రాల్, టైప్–2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వాళ్లు చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకపోవడం వల్ల పిల్లలను పైన పేర్కొన్న లైఫ్‌సై్టల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఎక్కువగా తినేలా చూడండి. తాజా పండ్లు ఎక్కువగా అందేలా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లి ఆటలు ఎక్కువ ఆడేలా ప్రోత్సహించండి. టెలివిజన్, కంప్యూటర్, మొబైల్, ఐపాడ్ వంటి వాటితో ఎక్కువగా ఆడనివ్వకండి. రోజూ ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేలా చూడండి. బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలను చాలా పరిమితంగా అందేలా చూడండి. ఇవి మీ బాబు విషయంలో తప్పక అనుసరించాల్సిన జాగ్రత్తలు. వాటిని తప్పక పాటించండి. ఇటీవల ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి మీడియా ద్వారా డాక్టర్ల నుంచి ప్రజలకు ఎన్నో సూచనలు అందుతూనే ఉన్నాయి. కానీ ఇంకా చాలామంది అంత ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. ఇది పిల్లల మీద, వాళ్ల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ఇంట్లోనే డయాలసిస్... సీఏపీడీ
హోమియో కౌన్సెలింగ్ 1. మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. - సునయన, నెల్లూరు ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో ఎన్నో స్థాయులు, వివిధ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలో లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లలు తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం, నలుగురిలో కలవడలేకపోవడం, ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు గమనించి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠ స్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎఎమ్ రెడ్డి,పాజిటివ్ హోమియోపతి 2. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నేను ఇటీవల బాగా అలసిపోతున్నాను. నడుము నొప్పి కూడా వస్తోంది. మాది ఎనిమిది గంటల షిఫ్ట్. నేను డబుల్ డ్యూటీలు చేస్తుంటాను. వరసగా రెండో షిఫ్ట్ కూడా పనిచేయడం వల్ల ఇలా జరుగుతోందా? ఈ అలసట అధిగమించడానికి మార్గాలు చెప్పండి. - మస్తాన్‌రావు, హైదరాబాద్ మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో తీవ్రమైన అలసట, బాగా ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు ఏకధాటిగా (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారిలో మీలా వృత్తిపరమైన అలసట వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇలా పనిచేసేవారిలో తీవ్రమైన అలసటతో పాటు కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలూ రావచ్చు. మీలాంటి వారు అలసటతో పాటు, వృత్తిసంబంధమైన ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించండి. * పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. *చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. *మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉన్నా అలసటకు లోనవుతారు. మీ సమస్యలను మీవెంట ఇంటికి మోసుకెళ్లకండి. * తగినంతగా నిద్రపొండి. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. *మీరు పనిచేసే చోట కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పుల పరిమితికి మించి తాగకండి. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. *రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. * భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. *ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ-హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్,సికింద్రాబాద్ 3. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. నేను ఉండే ఊళ్లో డయాలసిస్ సెంటర్ లేదు. డయాలసిస్ కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? - షణ్ముఖరావు, ఆత్మకూరు ఇలా వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించాల్సిన వ్యక్తుల్లో కిడ్నీ మార్పిడి మంచి చికిత్స. అయితే ఇది అందరికీ సాధ్యపడే అంశం కాదు. మాటిమాటికీ హాస్పిటల్‌కు వెళ్లేందుకు అనువుగా లేనివారు, ఇంట్లోనే డయాలసిస్ చేసు కునే ప్రక్రియను కంటిన్యువస్ ఆంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ (సీఏపీడీ) మెషిన్‌ను వాడటం మంచిది. ఇది చాలా సులువైన ప్రక్రియ. డయాలసిస్ పూర్తయ్యాక మామూలుగా తమ వృత్తులూ చేసుకోవచ్చు. దీనివల్ల జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) కూడా బాగా మెరుగవుతుంది. ఇలా డయాలసిస్ చేసుకునే వారికి బీపీతో పాటు ఇతర మందులు చాలా తక్కువగా అవసరం పడతాయి. నా వయసు 32 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట కూడా ఉంటోంది. ఇలా తరచూ జ్వరం, మూత్రంలో మంట వస్తున్నాయి. ఇలా మాటిమాటికీ జ్వరం రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? - మాలతి, జగ్గయ్యపేట మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
మరీ సన్నగా ఉన్నాను...!
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ మరీ సన్నగా ఉన్నాను...! నా వయసు 20 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. చాలామంది నన్ను ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. బరువు కేవలం 47 కేజీలు మాత్రమే. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. - ఎన్. సుధీర్, ఈ-మెయిల్ కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... జన్యుపరమైనవి సరిగా తినకపోవడం చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం అతి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపరమైన రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... మీలో ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ైెహ పర్ థైరాయిడిజమ్) మీరు తీసుకునే ఆహరంలో పోషకాల పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. మీకు కొన్ని సూచనలు : మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో మరో మూడుసార్లు తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్ డైట్ వద్దు. మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి. ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి. వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి. అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానికి ఉపయోగపడతాయంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సిందేనా? నా వయసు 42 ఏళ్లు. ప్రస్తుతం నేను క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్నాను. వ్యాధి స్టేజ్-5లో ఉంది. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాలని డాక్టర్లు అంటున్నారు. కచ్చితంగా వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించాలా? ఒకసారి చేయించుకుంటే సరిపోదా? - దశరథ్, కరీంనగర్ మీరు సీకేడీ స్టేజ్-5 లో ఉన్నారని వివరించిన దాన్ని బట్టి మీ కిడ్నీ పనితీరు కేవలం 15% మాత్రమే ఉంటుంది. ఈ విలువను బట్టి చూస్తే కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు పరిగణిస్తారు. మీరు వారానికి ఒకసారి మాత్రమే డయాలసిస్ చేయించుకుంటే, మీలోని వ్యర్థాల దుష్ర్పభావం మీ శరీరంలోని ఇతర అవయవాల మీద పడుతుంది. పైగా గుండెపనితీరు సక్రమంగా ఉండాలంటే మీరు డాక్టర్లు పేర్కొన్న మేరకు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డయాలసిస్ క్రమం తప్పితే, మీ జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గుతుంది. కాబట్టి వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవడం మంచిది. అవసరం కూడా. నా వయసు 68 ఏళ్లు. నేను ఆరేళ్ల నుంచి బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నాను. నెల క్రితం నుంచి ముఖం, కాళ్లలో వాపు కనిపిస్తోంది. ఆకలి లేమి, నడిస్తే ఆయాసంతో బాధపడుతున్నాను. డాక్టర్ సలహా మీద క్రియాటినిన్, బ్లడ్‌యూరియా, 2డీ ఎకో పరీక్షలు చేయించాను. క్రియాటినిన్ 6.2 ఎంజీ/డీల్, యూరియా 182 ఎంఎల్, గుండె పనితీరు 68.2 శాతం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇకపై డయాలసిస్ చేయించుకొమ్మని డాక్టర్లు సలహా ఇచ్చారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేదని కూడా సూచించారు. ఈ పరిస్థితుల్లో నాకు తగిన సలహా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. - వెంకటేశ్వర్లు, కోదాడ గుండెపనితీరు తక్కువగా ఉన్నవారిలో కాళ్లవాపు, ఆయాసం ఎక్కువగా కనిపించడం సాధారణమే. మీరు పేర్కొన్న రక్తపరీక్షల వివరాలను బట్టి చూస్తే మీ డాక్టర్ గారు చెప్పింది వాస్తవమే. మీరు డయాలసిస్ చేయించుకుంటే చాలా మంచిది. ప్రస్తుతం ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. డయాలసిస్ చేయించుకోవడం వల్ల మీ గుండె పనితీరు, సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. మీకు సమీపంలోని నెఫ్రాలజిస్ట్‌ను కలిసి ఇంట్లోనే చేయించుకోగల డయాలసిస్ వివరాలను తెలుసుకోండి. యూరాలజీ కౌన్సెలింగ్ ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్‌కు సర్జరీ తప్పదా? నా వయసు 58 ఏళ్లు. నేను రెండేళ్లుగా ప్రోస్టేట్ గ్రంథి పెరగడం (ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్తో) బాధపడుతున్నాను. చాలాకాలంగా మందులు వాడుతున్నా ప్రయోజనం లేదు. డాక్టర్ శస్త్రచికిత్స చేయించుకొమ్మంటున్నారు. శస్త్రచికిత్స చేయించుకోవడం తప్పదా? - శ్రీనివాసరావు, రాజంపేట మనదేశంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు 50 ఏళ్లు పైబడిన వారిలో 50 శాతం మందిలో, 70 ఏళ్లు పైబడిన వారిలో 80 శాతం మందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ గ్రంథి వాపు వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం, మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, ధార సన్నగా, బలహీనంగా రావడం, రాత్రుళ్లు తరచూ మూత్రవిసర్జనకు లేవాల్సి రావడం, ఒక్కోసారి మూత్రంలో రక్తం పడటం, మూత్రం బ్లాడర్‌లో మిగిలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలతో పాటు, మూత్రం వస్తున్నట్లుగా అనిపిస్తున్నా మూత్రవిసర్జన చేయలేకపోవడం, చలిజ్వరం, మూత్రంలో రక్తం, పొత్తికడుపులో లేదా మూత్రమార్గంలో నొప్పితో పురుషులు తప్పక వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఈ వ్యాధి బయటపడుతుంది. దీనికి సరైన చికిత్స చేయించకపోతే తరచూ మూత్రసంబంధ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) రావడం, మూత్రాశయం (బ్లాడర్)లో రాళ్లు, కిడ్నీ ఫెయిల్యూర్ అయి డయాలసిస్‌కు దారితీయడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. కేవలం చాలా త్వరగా బయటపడ్డ (అర్లీ) ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్‌కు మాత్రమే మందులతో చికిత్స చేయవచ్చు. అయితే ఇక మందులతో ప్రయోజనం లేనప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్సను సిఫార్సు చేస్తారు. వాపు వచ్చిన ప్రోస్టేట్ భాగాన్ని తొలగించేందుకు డాక్టర్లు ‘ట్రాన్స్యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్’ (టీయూఆర్‌పీ) లేదా లేజర్‌తో చేసే ప్రోస్టేట్ సర్జరీ (హోలెప్) వంటి ప్రక్రియలను అనుసరిస్తారు. ఈ శస్త్రచికిత్సల్లో సాధారణమైన మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా ఆ ప్రాంతానికే పరిమితమయ్యేలా పాక్షికమైన మత్తు (రీజియనల్ మత్తు) ఇవ్వాల్సి వస్తుంది. రోగి రెండు లేదా మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటే చాలు. టీయూఆర్‌పీ అనేది చాలా సురక్షితమైనదని నిరూపితమైన (గోల్డెన్ స్టాండర్డ్) ప్రక్రియ. ఇక లేజర్ శస్త్రచికిత్సలో రక్తస్రావం అయ్యే అవకాశాలు టీయూఆర్‌పీ కంటే తక్కువ. మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తే అది ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి తీవ్రమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి సురక్షితంగా చేయగలిగిన ఈ సాధారణ శస్త్రచికిత్సను చేయించుకోవడం అవసరం. -
రెండోసారి కామెర్లు, ఏం చేయాలి?
లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్ అది బ్లాక్‌బెర్రీ సిండ్రోమ్ కావచ్చు! నేను స్మార్ట్‌ఫోన్‌ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాను. ఇటీవల నా బొటనవేలు చాలా నొప్పిగా అనిపిస్తోంది. ఈ నొప్పి తగ్గడానికి మార్గాలు చెప్పండి. - ఎస్.ఆర్. శాంతకుమార్, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో డీ-క్వెర్‌వెయిన్ సిండ్రోమ్ అంటారు. మనం మన స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్ ఇన్ఫ్లమేషన్కు గురై వాపు వస్తుంది. మళ్లీ అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానక మళ్లీ మళ్లీ గాయం తిరగబెడుతుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. అవి... టైపింగ్ లేదా టెక్ట్స్ మెటీరియల్ పంపడం కోసం ఒక బొటన వేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా మార్చి మార్చి ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించడం. ఫోన్‌ను ఒక చేత్తో పట్టుకొని మరో చేతి బొటనవేలిని ఉపయోగించే బదులు, దాన్ని ఒక ఉపరితలం మీద పెట్టి ఇరుచేతుల వేళ్లను మార్చి ఉపయోగిస్తూ ఉండటం. మణికట్టును చాలా రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడటం. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒళ్లో పెట్టుకొని ఉండకుండా, కాస్త ఛాతీ భాగం వద్ద ఉండేలా చూసుకోవడం. ఒళ్లో పెట్టుకోవడం వల్ల కంటి మీద, ఒంగి స్క్రీన్ చూస్తూ ఉండటంతో మెడ మీద భారం పడుతుంది. అదే ఫోన్‌ను ఛాతీ వద్ద పెట్టుకుంటే అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది. ఫోన్‌ను శరీరానికి ఏదో ఒక వైపున ఉంచకుండా మధ్యన ఉంచడం. దీని వల్ల శరీరం అసహజ భంగిమలో ఒంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది. ఫోన్ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం. పొడవు పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్ వాడుతూ బొటనవేలి ఉపయోగాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది. ‘ఐ యామ్ ఇన్ మీటింగ్’ లాంటి కొన్ని రెడీమేడ్ వాక్యాలు ఉంటాయి. వాటి సహాయం తీసుకుంటే టైపింగ్ బాధ తగ్గడంతో పాటు, సమయమూ ఆదా అవుతుంది. ఎవరిపేరునైనా కనుగొనాలంటే పూర్తిగా స్క్రీన్ స్క్రోల్ చేస్తుండే బదులు షార్ట్‌కట్స్ ఉపయోగించడం ద్వారా సమయాన్నీ, బొటనవేలి ఉపయోగాన్నీ తగ్గించవచ్చు. అదేపనిగా ఫోన్ ఉపయోగించే వారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2-3 నిమిషాల పాటు బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించండి. గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ రెండోసారి కామెర్లు, ఏం చేయాలి? మా బాబు వయసు 12 ఏళ్లు. రెండేళ్ల క్రితం వాడికి పచ్చకామెర్లు వచ్చాయి. నెల రోజుల తర్వాత అవే తగ్గిపోయాయి. కానీ ప్రస్తుతం మళ్లీ పచ్చగా కనిపిస్తున్నాయి. మళ్లీ పచ్చకామెర్లు వచ్చాయేమోనని ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - కావ్య, విజయవాడ సాధారణంగా ఈ వయసులో పచ్చకామెర్లు రావడానికి ముఖ్యంగా ‘హెపటైటిస్-ఏ’ అనే వైరస్ కారణం. మీరు ఇంతకు ముందే ఒకసారి కామెర్లు వచ్చాయంటున్నారు కాబట్టి ఈ వైరస్‌తో మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా అరుదు. కాబట్టి మీ బాబు కామెర్లకు ‘విల్సన్ డిసీజ్’ వంటి ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు. అలాగే మీ బాబుకు దురద, రక్తహీనత వంటి లక్షణాలేమైనా ఉన్నాయా రాయలేదు. కాబట్టి మీరు ఒకసారి మీ బాబును గ్యాస్ట్రోఎంటరాల జిస్ట్కు చూపించి, తగిన పరీక్షలు చేయించి, తగిన చికిత్స తీసుకుంటే అతడు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. మా పాప వయసు పదేళ్లు. ఆమె మలవిసర్జనలో ఎలాంటి సమస్యా లేదు. కానీ అప్పుడప్పుడూ మలంలో రక్తం పడుతోంది. ఇలా రక్తం ఎందుకు పడుతోందో అర్థం కావడం లేదు. మాకు తగిన సలహా ఇవ్వగలరు. -సుజాత, మల్లేపల్లి మీరు రాసిన లక్షణాలను, మీ పాప వయసును పరిగణనలోకి తీసుకొని చూస్తే పెద్ద పేగుల్లో కంతులు (పాలిప్స్) ఉన్నట్లు అనిపిస్తోంది. వీటి వల్ల రక్తం పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి మీ పాపకు సిగ్మాయిడోస్కోపీ చేయించండి. ఒకవేళ కంతులు ఉన్నట్లు నిర్ధారణ అయితే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా వాటిని తొలగించవచ్చు. ఈ చికిత్స చేయడంతో మీ పాప సమస్య తొలగిపోతుంది. మీ దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోండి. నా వయసు 55 ఏళ్లు. నేను ఆల్కహాల్ సిర్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. డాక్టర్ సలహా మేరకు ఎండోస్కోపీ చేయించాను. ఆహారవాహికలో రక్తనాళాలు ఉబ్బి ఉన్నట్లు తెలిసింది. ఈ సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - రహీమ్, చిత్తూరు మీరు ఆల్కహాల్ సిర్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి మీ ఆహార వాహికలో ‘ఈసోఫేజియల్ వారిసెస్’ అభివృద్ధి చెందాయి. వీటి పరిమాణాన్ని బట్టి రక్తపు వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎండోస్కోపీ చేయించాక రక్తనాళాలు ఉబ్బి ఉన్నట్లు తెలిసిందని రాశారుగానీ వారిసెస్ ఏ పరిమాణంలో ఉన్నాయో తెలపలేదు. మామూలుగా వారిసెస్ పరిమాణాలను గ్రేడ్-3, గ్రేడ్-4 ఉన్నట్లుయితే అవి పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండోస్కోపీ ద్వారా బ్యాండిన్ అనే చికిత్సతో ఉబ్బిన రక్తనాళాలను పూర్తిగా తగ్గేట్లుగా చేయవచ్చు. ఈ చికిత్స చేయడం వల్ల రక్తపు వాంతులనూ నివారించవచ్చు. మీరు తప్పనిసరిగా ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయాలి. మీరు ప్రొపనాల్ 20ఎంజీ మాత్రలు రోజుకు రెండుసార్లు వేసుకోండి. మీకు దగ్గర్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోండి. పీడియాట్రీషియన్ కౌన్సెలింగ్ బాబుకు తరచూ తలనొప్పి... ఏం చేయాలి? మా బాబు వయసు పదేళ్లు. తరచూ తలనొపితో చాలా బాధపడుతున్నాడు. ఇంతకుముందు తలనొప్పి చాలా అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. - సుందర్, అమలాపురం మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమ స్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అని భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమందిలో దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు. నివారణ / చికిత్స చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం నుదుటిపై చల్లటి నీటితో అద్దడం నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు యాస్పిరిన్ లేదా ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం నీళ్లు ఎక్కువగా తాగించడం ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలామట్టుకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. న్యూరాలజీ కౌన్సెలింగ్ మూలకణ చికిత్సతో పక్షవాతం నయమవుతుందా? నేను గత 15 ఏళ్లుగా పక్షవాతం (పెరాలసిస్) వ్యాధితో బాధపడుతున్నాను. అయితే పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు వార్తాపత్రికల్లో చదివాను. ఈ చికిత్స ప్రస్తుతం ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలు ఎంత మెరుగ్గా ఉంటాయన్న విషయాలను వివరంగా తెలియజేయగలరు. - ఎమ్. దిలిప్‌కుమార్ శెట్టి, ఎర్రపల్లి, చిత్తూరు జిల్లా ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా రక్తస్రావం వల్ల చనిపోయినా మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మళ్లీ పునరుజ్జీవించలేవు. ఇలాంటి సమయంలో మనం నేర్చుకున్న దాన్ని తిరిగి పొందాలంటే దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. దాంతో మనం పోగొట్టుకున్న అంశం మళ్లీ మనకు దక్కుతుంది. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు. సాధారణంగా 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది. ఇక మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలగను రూపొందించేలా అన్నమాట. ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి వచ్చిన ఫలితాలు అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధనదశలోనే ఉంది. ఇంకా చికిత్స వరకూ రాలేదు.