Lifetime Punishment
-
1000 మంది గర్ల్‌ఫ్రెండ్స్.. 1075 ఏళ్ల జైలు శిక్ష
ఇస్తాంబుల్: వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడు అద్నన్ అక్తర్‌కు టర్కీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్లపై లైంగిక దాడులు, ఆర్మీ గూఢచర్యం, బ్లాక్‌మెయిలింగ్ తదితర కేసుల్లో దోషిగా తేల్చి.. మొత్తంగా 1,075 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. స్థానిక మీడియా వివరాల ప్రకారం... అద్నన్ అక్తర్ ఓ ప్రైవేటు టీవీ చానెల్ ద్వారా మతపరమైన బోధనలు చేస్తూ పాపులర్ అయ్యాడు. మహిళల నడుమ కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని ప్రతిబింబించేలా తెరపై దర్శనమిస్తూ చర్చలు నిర్వహించేవాడు. వారిని కిటెన్స్ అని పిలుస్తూ అసభ్యకర రీతిలో వ్యవహరించేవాడు. ఈ క్రమంలో అతడి కార్యకలాపాలపై నిఘా పెట్టిన టర్కీ మీడియా వాచ్డాగ్ ఇప్పటికే అతడి చానెల్‌పై నిషేధం విధించింది. మరోవైపు స్థానిక పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు అద్నన్ నివాసాలపై దాడులు చేసి, 2018లో అతడిని అరెస్టు చేశారు. అతడితో పాటు పదుల సంఖ్యలో అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నేరాలను, నేరస్తులను ప్రోత్సహించడం సహా మైనర్లను లైంగికంగా వేధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం, బ్లాక్మెయిల్ చేయడం, రాజకీయ, సైనిక రంగాల్లో గూఢచర్యం నెరపినందుకు గానూ అద్నన్పై అభియోగాలు నమోదు చేశారు.(చదవండి: ప్రిన్సెస్ డయానాలో ఉన్న ఆకర్షణ అదే: మాజీ లవర్) ఈ నేపథ్యంలో 10 ప్రధాన కేసుల్లో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి ఈ మేరకు శిక్ష విధించింది. అతడి ఫాలోవర్లలో 13 మందికి సైతం కఠిన కారాగార శిక్షలు విధించింది. కాగా ఈ విషయంపై స్పందించిన 64 ఏళ్ల అద్నన్.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను ఏ తప్పు చేయలేదని, పథకం ప్రకారమే కుట్ర పన్ని ఇరికించారని, కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక మత ప్రబోధనలతో పాటు రచయితగా కూడా అద్నన్ పేరు సంపాదించాడు. డార్విన్ జీవపరిణామక్రమానికి సంబంధించిన అంశాలపై హరున్ యహయా అనే కలం పేరుతో రచనలు చేశాడు. నాకు 1000 మంది గర్ల్‌ఫ్రెండ్స్ అనేకానేక సెక్స్ స్కాండల్స్‌తో 90వ దశకంలో వెలుగులోకి వచ్చిన అద్నన్ అనేక అక్రమాలకు పాల్పడ్డట్లు రుజువైంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ప్రిసైడింగ్ జడ్జి ఎదుట హాజరైన అతడు.. ‘‘ ఆడవాళ్లను చూస్తే నా గుండె ప్రేమతో ఉప్పొంగిపోతుంది. ప్రేమించడం అనేది మానవ సహజ లక్షణం. నేను అదే చేశాను. నాకు దాదాపు వెయ్యి మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారందరినీ సంతోషపెట్టగల అసాధారణ సామర్థ్యం నాకుంది’’ అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. కాగా అమ్మాయిలకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించి వారితో అర్ధనగ్న ప్రదర్శనలు చేయించేవాడని కూడా అతడిపై ఆరోపణలు ఉన్నాయి. -
మావోయిస్టు నేత చంద్రమౌళికి జీవిత ఖైదు
భీమదేవరపల్లి: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి ఉరఫ్ మదన్‌లాల్‌కు జీవితకాల శిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్‌లోని బాల్గఢ్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లోని అప్పటి రావాణా శాఖ మంత్రిని మావోయిస్టులు హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ చంద్రమౌళికి ఈ శిక్ష ఖరారు చేసింది. 2005లో అరెస్టు అయిన చంద్రమౌళి మూడు రాష్ట్రాల జైళ్లలో శిక్షను అనుభవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన ఉగ్గె కనకయ్య-సూరమ్మల పెద్ద కొడుకైన ఉగ్గె చంద్రమౌళి పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే పీపుల్స్‌వార్ ఉద్యమానికి ఆకర్షితుడై సానుభూతిపరుడిగా మారాడు. అప్పట్లో చెంజర్లకు చెందిన శంకరమ్మతో అతనికి వివాహం జరిగింది. వారికి కుమారుడు భాస్కర్ జన్మించాడు. 1980లో మాణిక్యాపూర్‌లో ఇదే గ్రామానికి చెందిన మావోయిస్ట్ నాయకుడు శనిగరం వెంకటేశ్వర్లు ఆలియాస్ సాహు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ దళపతి గణపతి అలియూస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావుతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రమౌళి విప్లవోద్యమానికి అంకితమై 1981లో అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడిగా ఉంటూ అనతి కాలంలోనే హుస్నాబాద్, హుజూరాబాద్ సీవో (సెంట్రల్ ఆర్గనైజర్)గా బాధ్యతలు స్వీకరించారు. 1988లో ఆయన అరెస్టయ్యూరు. బెయిల్‌పై విడుదల కాగానే తిరిగి ఉద్యమంలోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో పనిచేశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా నియామకమైన కొద్ది రోజులకే 2005 ఆగస్టు 6న మహారాష్ట్రలోని నాగపూర్‌లో అరెస్టయ్యూరు. పార్టీ కేంద్ర కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు నాగపూర్‌లోని ఓ లాడ్జీలో ఉన్న అతనిని అక్కడి పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. అప్పటికి చంద్రమౌళి కేంద్ర కమిటీ సభ్యుడనే విషయం అక్కడి పోలీసులకు తెలియదు. చంద్రమౌళిపై మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఏపీ రాష్ట్రాల్లో మొత్తం 35 కేసులు నమోదు చేశారు. ఇంతకాలం మధ్యప్రదేశ్‌లోని బాల్‌ఘడ్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్, మహారాష్ట్రలోని బిలాస్పూర్ జైలులో ఉన్నారు. మధ్యప్రదేశ్ రావాణా శాఖ మంత్రి హత్య సంఘటనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులో చంద్రమౌళి ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ నెల 14న మధ్యప్రదేశ్‌లోని బాల్‌ఘడ్ కోర్టు అక్కడి రవాణా శాఖ మంత్రి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ చంద్రమౌళికి జీవితకాల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా ‘నా కొడుకు ఇంతకాలం జైల్లో ఉన్నాడు. ఇక విడుదల అయితడని ఎదురు సూత్తన్న’ అని చంద్రమౌళి తల్లి సూరమ్మ కన్నీటి పర్యంతమయింది.