lifts ban
-
బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: విరిగిన బియ్యంసహా ఆర్గానిక్ నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం ఎత్తివేసింది. ఈ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే చర్య ఇది. దేశీయంగా లభ్యత పెంపు లక్ష్యంగా సెప్టెంబర్ తొలి రోజుల్లో బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. రిటైల్ మార్కెట్లలో ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ సరఫరాలను మెరుగుపరచే లక్ష్యంతో బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకాన్ని కూడా విధించింది. ఆర్గానిక్ నాన్-బాస్మతీ రైస్, ఆర్గానిక్ నాన్-బాస్మతీ బ్రోకెన్ రైస్ ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బియ్యం ఎగుమతుల విలువ 5.5 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 9.7 బిలియన్ డాలర్లు. సరైన చర్య... ‘‘భారత్ ఏటా 10,000-15000 టన్నుల సేంద్రీయ బియ్యాన్ని (బాస్మతి, బాస్మతీయేతర) ఎగుమతి చేస్తుంది. గత 4–5 ఏళ్లలో ఆర్గానిక్ బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులు వేగంగా వృద్ధి చెందాయి. నిషేధం ఎత్తివేస్తూ, ప్రభుత్వం సరైన చర్య తీసుకుంది’’ అని ప్రభుత్వ ప్రకటనపై ఆల్ ఇండియా రైస్ ఎగుమతిదారుల సంఘం మాజీ అధ్యక్షుడు విజయ్ సెటియా వ్యాఖ్యానించారు. -
మనీ లాండరింగ్ కేసు: వివోకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివోకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. బ్యాంకుల ఖాతాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే 945 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. అలాగే రూ. 250 కోట్ల బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఆయా ఖాతాలను ఆపరేట్ చేసుకోవచ్చని తెలిపింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు, బ్యాంకు ఖాతాల స్వాధీనంపై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, జస్టిస్ సుబ్రమణియంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి ఈడీ దాడులు, బ్యాంకు ఖాతాల సీజ్‌పై వివో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తే 2,826 కోట్ల రూపాయల నెలవారీ జీతాలు చెల్లించలేమని పేర్కొంది. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. వివో తరపున సీనియర్ న్యాయ వాదులు సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదిస్తూ బ్యాంకు ఖాతాలను సీజ్ వల్ల వివో కార్యకలాపాలు నిలిచి పోయాయని వాదించారు. కాగా పన్నులు ఎగవేసేందుకు దేశంలో ఆదాయాన్ని తక్కువ చూపించి కోట్ల రూపాయలను చైనాకు తరలించిందనే ఆరోపణలపై ఈడీ జూలై 5న దేశవ్యాప్తంగా వివో కార్యాలయాలపై విస్తృత దాడులు చేసింది. 119 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.465 కోట్లను స్వాధీనం చేసుకుంది. మరో రూ.73 లక్షల నగదు, రెండు కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేసింది. భారత్‌లో పన్నులు ఎగవేసేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో 2017-21 మధ్యకాలంలో రూ.62,476 కోట్ల టర్నోవర్‌ను చైనాలోని మాతృసంస్థకు తరలించిందని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
ఈ కష్ట‘మెట్లు’ తప్పున్!
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాలన్నా.. విద్యార్థులు, ఉద్యోగులు బస్‌పాస్‌లు తీసుకోవాలన్నా అందుబాటులో ఉన్నది ఏకైక వసతి మెట్ల మార్గమే. రెండంతస్తులు పైకి వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సిటీ బస్సుల్లో రెతిఫైల్కు చేరుకునేవారు, దూరప్రాంతాల నుంచి రైళ్లలో సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తున్న వేలాది మంది ప్రయాణికులు మెట్రో రైలు కోసం ఈ మెట్ల మార్గంలో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి.. అటు మియాపూర్, కూకట్పల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి ఎలాంటి కుదుపు లేకుండా మెట్రో రైళ్లలో హాయిగా సికింద్రాబాద్ ఈస్ట్‌కు చేరుకున్నవారు రెతిఫైల్ మెట్లను ఎక్కలేక, దిగలేక చుక్కలు చూస్తున్నారు. పైగా ఈ మెట్లు ఎంతో ఇరుకుగా, నిటారుగా ఉండడంతో పిల్లలు, మహిళలు, వయోధికులు అవస్థలు పడుతున్నారు. లగేజీతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రెతిఫైల్ నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కలేకపోతున్నారు. మెట్రో స్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లను అనుసంధానం చేసేలా ఉన్న రెతిఫైల్ బస్‌స్టేషన్‌లో కనీస సదుపాయాలు లేకపోవడం ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమించింది. కొరవడిన సమన్వయం... ♦ రెతిఫైల్ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గురుద్వారా, చిలకలగూడ క్రాస్‌రోడ్స్, బ్లూసీ హోటల్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు సుమారు 1500కు పైగా బస్సులు ఆయా బస్టాపుల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. కనీసం 10 లక్షల మంది సికింద్రాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. ♦ మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. మెట్రో రైళ్లలో సికింద్రాబాద్‌కు చేరుకోవాలంటే తప్పనిసరిగా రెతిఫైల్ నుంచి వెళ్లాల్సిందే. నిత్యం సుమారు 10 వేల మంది ప్రయాణికులు మెట్రో నుంచి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల కోసం రెతిఫైల్ మీదుగా వెళ్తారు. ఆరీ్టసీ, మెట్రోరైల్, దక్షిణమధ్య రైల్వేల మధ్య సమన్వయం కొరవడడంతో రెతిఫైల్ స్టేషన్లో కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ వాస్తవానికి ఇది ఆర్టీసీకి చెందిన ప్రయాణికుల ప్రాంగణం. ఈ బస్‌స్టేషన్‌లో అద్దెల రూపంలో ఆర్టీసీకి రూ.లక్షల్లో ఆదాయం లభిస్తోంది. కానీ ప్రయాణికుల సదుపాయాలపై మాత్రం ఆర్టీసీ దృష్టి సారించడం లేదు. రైలు, బస్సులు, మెట్రో మధ్య అనుసంధానం కోసం ఈ స్టేషన్‌కు ఆధునిక హంగులు కల్పించే అవకాశం ఉంది. కానీ మెట్రో, ఆర్టీసీ, దక్షిణమధ్య రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రయాణికులు ఒక కనెక్టివిటీ నుంచి మరో కనెక్టివిటీకి సాఫీగా చేరుకోలేకపోతున్నారు. ర్యాంపులు, లిఫ్ట్‌లు అవసరం... ♦ మెట్రో రైళ్లకు, సాధారణ రైళ్లకు అనుసంధానంగా ఉన్న రెతిఫైల్ నుంచి రాకపోకలు సాగించేందుకు ర్యాంపులు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఎంతో అవసరం. భారీ లగేజీతో సికింద్రాబాద్ ఈస్ట్‌కు చేరుకొనేవారు అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లాలన్నా రెండంతస్తుల మెట్లు ఎక్కడం కష్టంగా మారింది. కొద్ది పాటి సదుపాయాలతో ప్రయాణికులకు మూడు ప్రజారవాణా సదుపాయాలను అందుబాటులోకి తీసురావచ్చు. అందుకు కావాల్సిందల్లా మూడు సంస్థల మధ్య సమన్వయమే. -
ఎయిరిండియాకు భారీ ఊరట
పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తన గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలకు అనుమతినిస్తూ పాక్ ఆంక్షలను ఎత్తివేసింది. భారత్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలను తన గగనతలంలో ప్రయాణించడానికి అనుమతినిస్తున్నామని పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఎయిర్ మెన్ (నోటామ్) నోటీసు జారీ చేసింది. మంగళవారం రోజు తెల్లవారుజామునుంచి ఏటీఎస్ (ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్) మార్గాల్లో అన్ని రకాల విమాన సర్వీసులకు తక్షణమే అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ విమాయాన సంస్థ ఎయిరిండియా భారీ ఊరట కలగనుంది. మరోవైపు గగనతల ఆంక్షలను ఎత్తివేయడానికి పాక్ నోటామ్ జారీచేయడం భారత అధికారులు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వెంటనే సవరించిన నోటామ్‌ను జారీ చేసింది. తద్వారా సాధారణ విమాన ట్రాఫిక్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని వెల్లడించినట్టు సమాచారం. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) దాడుల తరువాత పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో సుమారు 491 కోట్ల రూపాయల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిన ఎయిర్ ఇండియాకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించగలదని భావిస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జూలై 3 న రాజ్యసభలో సమర్పించిన గణాంకాల ప్రకారం ప్రైవేటు విమానయాన సంస్థలు స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ వరుసగా రూ .30.73 కోట్లు, రూ .25.1 కోట్లు, రూ .12.1 కోట్లు నష్టపోయాయి. అటు పాకిస్తాన్ కూడా మూసివేత నిర్ణయానికి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఏదైనా ఒక దేశం గగనతలం మీది నుంచి రాకపోకలు సాగించే విమానాలు వాటి బరువు, ప్రయాణించే దూరాన్ని బట్టి ఆ దేశానికి కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే బోయింగ్ 737 విమానానికి అయితే 580 డాలర్లు, ఎయిర్‌బస్ 380కి అయితే అంతకంటే పెద్ద మొత్తంలో ఆ దేశ సివిల్ ఏవియేషన్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మూసివేత తర్వాత దాదాపు రూ.688 కోట్ల (100 మిలియన్ డాలర్లు) మేర నష్టపోయింది. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. -
గైక్వాడ్‌కు మళ్లీ విమానయోగం
నిషేధం ఎత్తివేసిన ఎయిర్ ఇండియా ► పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో నిర్ణయం న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమాన ప్రయాణంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రైవేటు విమానయాన సంస్థలు దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకొంటాయని భావిస్తున్నామన్నారు. ఘటనపై గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసి, ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. గత నెల 23న ఎయిర్ ఇండియా సీనియర్ అధికారిని గైక్వాడ్ చెప్పుతో 25సార్లు కొట్టారు. దీనికి నిరసనగా ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు విమాన సంస్థలు విమానంలో ఆయన ప్రయాణించడాన్ని గతంలో నిషేధించాయి. బేషరతు క్షమాపణ చెబితేనే... మరోవైపు... విమాన అధికారిపై చేయిచేసుకున్న ఎంపీ గైక్వాడ్ బేషరుతుగా క్షమాపణ చెప్పే వరకూ ఆయన్ని విమానంలో ప్రయాణించబోనివ్వమని ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనికి సంఘం లేఖ రాసింది. క్షమాపణ చెప్పకుండా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేస్తే అది సంస్థ ఉద్యోగులతో పాటు భారతీయుల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని సంఘం లేఖలో పేర్కొంది. దీంతోపాటు ఏఐకి చెందిన ‘ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ గైక్వాడ్ బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ఆయన్ను విమానాల్లో తిరగనివ్వమని హెచ్చరించింది. ఉపసంహరించుకోండి... గైక్వాడ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని మంత్రిత్వ శాఖ ప్రైవేటు విమాన సంస్థలను కోరింది. అయితే దీనిపై ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్’ (ఎఫ్ఐఏ) అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఎఫ్ఐఏ నుంచి ఎలాంటి సమాచారం అందనంతవరకూ ఎంపీపై నిషేధం కొనసాగుతుందని ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి చెప్పారు. ఎయిరిండియా నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ గైక్వాడ్ శుక్రవారం రైలులో ముంబైకి పయనమయ్యారు. నిషేధానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గైక్వాడ్‌కు చేరకపోవటంతో రైల్లో వెళ్తున్నారని ఎంపీ సన్నిహితులు తెలిపారు. -
ఎంపీ గైక్వాడ్‌పై నిషేధం ఎత్తేసిన ఎయిరిండియా