Light Man
-
మణిరత్నం ఆదుకోవాలి.. సినీకార్మికుడి ఫిర్యాదు
దర్శకుడు మణిరత్నంపై సినీ లైట్‌మెన్ పోలీస్ కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. అనంతరం మణిమారన్ మీడియాతో మాట్లాడుతూ తాను సినీ లైట్‌మెన్‌గా పని చేశానని లైట్‌మెన సంఘంలో సభ్యుడిగా ఉన్నానన్నాడు.10 ఏళ్ల క్రితం తాను దర్శకుడు మణిరత్నం చిత్రాలకు పనిచేశానని చెప్పాడు. కాగా అప్పుడు నటుడు అభిషేక్‌బచ్చన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన గురు చిత్ర షూటింగ్ స్థానిక పెరంబూరులో జరినప్పుడు తాను విష జ్వరానికి గురయ్యానని తెలిపాడు. ఆస్పత్రిలో చేరగా చికిత్సకు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. తాను పేదవాడిని కావడంతో తన వద్ద అంత డబ్బు లేకపోవటంతో దర్శకుడు మణిరత్నం ఇంటికి వెళ్లి సాయం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపాడు. చివరికి ఆర్థికసాయం కోరుతూ ఒక లేఖ కూడా రాశానని, అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు. తన భార్య పని చేసి తన కుటుంబాన్ని పోషిస్తోందని చెప్పాడు. లైట్‌మెన్ సంఘం నుంచి రూ. 2 లక్షలు వైద్య సాయానికి అందించాల్సిందిగా కోర్టు ఆదేశించిందని చెప్పాడు. అయితే ఆ సంఘం నిర్వాహకులు తనను రూ.20 వేలు లంచం ఇవ్వాలని అడిగారన్నాడు. తాను అప్పు చేసి ఆ డబ్బును సంఘంకు ఇచ్చానని, అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం లైట్‌మెన్ సంఘం రూ. 2 లక్షలు కాకుండా లక్ష రూపాయలే ఇచ్చిందని చెప్పాడు. మరో లక్ష ఇవ్వాల్సి ఉందన్నాడు. తను మణితర్నం చిత్రాలకు పని చేశానని, ఆయన మానవత్వంతో తనకు ఆర్థికసాయం చేయాలని కోరారు. అందుకోసం తాను స్థానిక నుంగంబాక్కమ్ వళ్లువర్ కోట్టం వద్ద కుటుంబంసహా నిరాహార దీక్ష చేయడానికి పోలీసుల అనుమతి కోరడానికే కమిషనర్ కార్యాలయానికి వచ్చినట్లు మణిమారన్ తెలిపాడు. ఈ సంఘటన కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా
పెరంబూర్: దర్శకుడు మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాని లైట్‌మ్యాన్ బెదిరించడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. మణిరత్నం బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ జంటగా గురు అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్లో పనిచేస్తున్న సమయంలో మణిమారన్ అనే లైట్‌మ్యాన్ రక్తసంబంధిత వ్యాధికి గురయ్యాడు. అతని వైద్య ఖర్చులకు లైట్‌మ్యాన్ సంఘం గాని, మణిరత్నం, చిత్ర యూనిట్ ఎలాంటి డబ్బు అందించలేదు. తన లైట్‌మ్యాన్ సంఘంపై కోర్టులో కూడా పోరాడాటం. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా సంఘం తనకు రావలసిన రూ.2లక్షలు చెల్లించలేదని, ఆ విషయం గురించి అడిగితే సంఘ కార్యదర్శి రామన్ రూ.20 వేలు లంచం అడుగుతున్నారని మణిమారన్ వాపోయాడు. పదేళ్ల నుంచి తన కుటుంబ సభ్యులే వైద్య ఖర్చులు భరిస్తున్నారని, తనకు రావలసిన నగదు ఇప్పించకపోతే మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని మణిమారన్ పేర్కొన్నాడు. -
'నిషా'కు షారూఖ్ ఖాన్ చేయూత
ముంబై: షారూఖ్ ఖాన్ నటించిన 'రబ్ నె బనా ది జోడీ' సినిమా గుర్తుందా? 'మీ జీవితానికి వెలుగునిస్తాం' అనేది ఈ సినిమాకు ఉప శీర్షిక. ఈ టైటిల్‌ను బాలీవుడ్ బాద్ షా నిజం చేశాడు. ఓ చిన్నారి జీవితంలో వెలుగు నింపాడు. లైట్ మాన్ కూతురు చదువు ఆగిపోకుండా చేశాడు. 38 ఏళ్ల మహ్మద్ అజాజ్ షేక్... బాలాజీ టెలి ఫిలిమ్స్‌లో లైట్ మాన్‌గా పనిచేస్తున్నాడు. ఫీజు కట్టకపోవడంతో అతడి 12 ఏళ్ల కూతురు నిషా చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుకున్న షారూఖ్ ఆమె చదువుకు ఐదేళ్ల పాటు సహకారం అందిస్తానని హామీయిచ్చాడు. అజాజ్ భార్య ఓ పోటీలో తాను గెల్చుకున్న బహుమతిని షారూఖ్ చేతులుగా మీదుగా అందుకుంది. తన కూతురు చదువు అజాజ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఆగిపోయిన విషయాన్ని షారూఖ్‌కు తెలిపింది. వెంటనే స్పందించిన షారూఖ్.. చిన్నారి చదువుకు చేయూతనిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. షారూఖ్‌కు అజాజ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తన కూతురు మళ్లీ స్కూల్‌కు వెళుతుందని సంతోషం వ్యక్తం చేశారు.