'నిషా'కు షారూఖ్ ఖాన్ చేయూత
ముంబై: షారూఖ్ ఖాన్ నటించిన 'రబ్ నె బనా ది జోడీ' సినిమా గుర్తుందా? 'మీ జీవితానికి వెలుగునిస్తాం' అనేది ఈ సినిమాకు ఉప శీర్షిక. ఈ టైటిల్ను బాలీవుడ్ బాద్ షా నిజం చేశాడు. ఓ చిన్నారి జీవితంలో వెలుగు నింపాడు. లైట్ మాన్ కూతురు చదువు ఆగిపోకుండా చేశాడు.
38 ఏళ్ల మహ్మద్ అజాజ్ షేక్... బాలాజీ టెలి ఫిలిమ్స్లో లైట్ మాన్గా పనిచేస్తున్నాడు. ఫీజు కట్టకపోవడంతో అతడి 12 ఏళ్ల కూతురు నిషా చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుకున్న షారూఖ్ ఆమె చదువుకు ఐదేళ్ల పాటు సహకారం అందిస్తానని హామీయిచ్చాడు.
అజాజ్ భార్య ఓ పోటీలో తాను గెల్చుకున్న బహుమతిని షారూఖ్ చేతులుగా మీదుగా అందుకుంది. తన కూతురు చదువు అజాజ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఆగిపోయిన విషయాన్ని షారూఖ్కు తెలిపింది. వెంటనే స్పందించిన షారూఖ్.. చిన్నారి చదువుకు చేయూతనిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. షారూఖ్కు అజాజ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తన కూతురు మళ్లీ స్కూల్కు వెళుతుందని సంతోషం వ్యక్తం చేశారు.