Light Metro Rail
-
2024 నాటికల్లా విశాఖ మెట్రో..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర వీధుల్లో మెట్రో రైలు పరుగు తీసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే లైట్‌మెట్రో, ట్రామ్ కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసే బాధ్యతల్లో యూఎంటీసీ సంస్థ తలమునకలు కాగా.. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ బిజీగా ఉంది. లైట్ మెట్రో రైలు కారిడార్ నిర్మాణానికి ఒక కిలోమీటరుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా.. ట్రామ్ కారిడార్‌కు రూ.100 నుంచి రూ.120 కోట్లుగా భావిస్తున్నారు. లైట్ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ని నవంబర్ నెలాఖరుకు, ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ని డిసెంబర్ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదించేందుకు యూఎంటీసీ అంగీకరించింది. నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్ ఉంటోంది.. మెట్రో కారిడార్ రూట్‌మ్యాప్‌లలో జరుగుతున్న అభివృద్ధి 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్ మొదలైన అంచనాలతో డీపీఆర్ తయారవుతోంది. కీలక నిర్ణయాలు పూర్తవడంతో.. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి. లైట్ మెట్రోరైలు, మోడ్రన్ ట్రామ్ కారిడార్లకు సంబంధించిన సవివర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ చేతిలో సిద్ధమవుతోంది. లైట్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో రూపొందించిన 42.55 కిలోమీటర్ల డీపీఆర్‌ను అప్డేట్ చేస్తూ.. 79.91 కి.మీకు సంబంధించిన డీపీఆర్‌ను రూ.5.34 కోట్లకు, 60.20 కి.మీ పొడవున్న ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను రూ.3.38కోట్లకు అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ లిమిటెడ్ (యూఎంటీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన డీపీఆర్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. నవంబర్‌లో లైట్ మెట్రో.. డిసెంబర్లో ట్రామ్ ఏప్రిల్, మేలో రెండు డీపీఆర్‌లకు చెందిన బాధ్యతలను అప్పగించి.. ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే.. కోవిడ్–19 కారణంగా లాక్డౌన్ విధించడంతో డీపీఆర్ పనులను యూఎంటీసీ ప్రారంభించడంలో ఆలస్యమైంది. దీంతో ప్రభుత్వం అదనపు సమయం కేటాయించింది. లైట్‌మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ను నవంబర్ నెలాఖరుకు, ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను డిసెంబర్ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదించేందుకు యూఎంటీసీ అంగీకరించింది. ఈ మేరకు నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్ ఉంటోంది.. మెట్రో కారిడార్ రూట్‌మ్యాప్‌లలో జరుగుతున్న అభివృద్ధి, 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్ మొదలైన అంచనాలతో డీపీఆర్ తయారవుతోంది. లైట్ మెట్రో ప్రాజెక్ట్ 79.91 కి.మీ మేర రూపుదిద్దుకుంటోంది. వివిధ దేశాల్లో చేపట్టిన ప్రాజెక్ట్‌లను అధ్యయనం చేసిన అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) ప్రాజెక్ట్ వ్యయంపై ప్రాథమిక అంచనాలను రూపొందించింది. ఒక కిలోమీటర్ మేర లైట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అదే విధంగా లైట్ మెట్రోతో పోలిస్తే ట్రామ్ కారిడార్ నిర్మాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా గుర్తించారు. ఒక కి.మీ ట్రామ్ కారిడార్ నిర్మించేందుకు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని భావిస్తున్నారు. మొత్తం 79.91 కి.మీ మేర లైట్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.16,000 కోట్లు, 60.20 కి.మీ మేర ట్రామ్ కారిడార్ నిర్మాణానికి రూ.7,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే ట్రామ్‌కు సంబంధించి బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్ దేశాల ప్రాజెక్ట్‌ల వివరాలు సేకరిస్తున్నారు. డీపీఆర్ సిద్ధమైతే ఈ అంచనా వ్యయాల్లో స్వల్ప మార్పులుండనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇవీ అంచనాలు లైట్ మెట్రో డీపీఆర్ పూర్తయ్యే సమయం– 2020 నవంబర్ కిలోమీటర్ నిర్మాణానికి లైట్ మెట్రోకు అయ్యే ఖర్చు– సుమారు రూ.200 కోట్లు ట్రామ్ కారిడార్ డీపీఆర్ పూర్తయ్యే సమయం– 2020 డిసెంబర్ కిలోమీటర్ నిర్మాణానికి ట్రామ్ కారిడార్‌కు అయ్యే ఖర్చు– సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు అగ్రిమెంట్ పూర్తి చేసుకునే సమయం–మార్చి 2021 లైట్ మెట్రో కారిడార్ పనులు ప్రారంభించే సమయం– జూన్ 2021 విశాఖ వీధుల్లో మొదటి మెట్రో సర్వీసు ప్రారంభమయ్యే సమయం– మార్చి 2024 2024 నాటికల్లా పట్టాలెక్కేలా.. ఈ ఏడాది చివరి నాటికల్లా లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ కారిడార్లకు డీపీఆర్‌లు పూర్తి కానున్నాయి. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతాం. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్ పూర్తి చేస్తాం. జూన్ 2021 నాటికి లైట్ మెట్రో కారిడార్ పనులు ప్రారంభిస్తాం. మార్చి 2024 నాటికి లైట్ మెట్రోలో ఒక కారిడార్ నుంచి ప్రయాణాలు ప్రారంభించేలా.. మెట్రోరైలు ప్రాజెక్ట్‌ను శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – రామకృష్ణారెడ్డి, ఎండీ, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ -
విశాఖలో లైట్‌మెట్రోకు ప్రభుత్వం ఉత్తర్వులు
-
భోగాపురం దాకా విశాఖ లైట్ మెట్రో
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ నిర్మించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) సన్నాహాలు చేస్తోంది. కేవలం నగరంలోనే మెట్రో రైలు నడపడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలను తీర్చలేమన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏర్పడే భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలో నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుందని అంచనాకు వచ్చినట్లు ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు కారిడార్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానం కాకపోవడం ఒక లోపంగా మారింది. అలాంటి పరిస్థితి విశాఖలో ఉత్పన్నం కాకుండా చూడాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్నంలో 46.40 కిలోమీటర్ల మేర మూడు లైట్ మెట్రో కారిడార్లు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మొత్తాన్ని కలుపుతూ 140 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్లను ప్రతిపాదించింది. అందులో కొమ్మాది–ఆనందపురం జంక్షన్, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ప్రతిపాదించిన కారిడార్లను రెండో దశలో నిర్మించాలని తొలుత భావించారు. కానీ, భోగాపురం ఎయిర్‌పోర్టుతో తొలి దశలోనే నగరాన్ని అనుసంధానిస్తే బాగుంటుందన్న అంచనాతో రోడ్ మ్యాప్ రూపొందించారు. డీపీఆర్, టెండర్ల ప్రక్రియ ఒకేసారి తొలి దశలో స్టీల్‌ప్లాంట్–కొమ్మాది జంక్షన్, గురుద్వారా–పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం–ఆర్కే బీచ్, కొమ్మాది–ఆనందపురం జంక్షన్, లా కాలేజి–మరికివలస, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ 79.91 కిలోమీటర్ల మేర ఆరు కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్, యూఎంటీసీ, రైట్స్ సంస్థలను సంప్రదించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. డీపీఆర్‌కి సమాంతరంగా ఈ ఆరు కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో టెండర్లు పిలిచే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తద్వారా మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధమయ్యేటప్పటికి నిర్మాణ సంస్థను కూడా ఎంపిక చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. రెండో దశలో ట్రామ్ వ్యవస్థ! రెండో దశలో 60.2 కిలోమీటర్ల మేర నిర్మించే ఎన్ఏడీ జంక్షన్–పెందుర్తి, స్టీల్‌ప్లాంట్–అనకాపల్లి, పాత పోస్టాఫీస్–రుషికొండ బీచ్, రుషికొండ బీచ్–భీమిలి బీచ్ కారిడార్లను ఆధునిక ట్రామ్ వ్యవస్థలుగా నిర్మించాలని భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం తొలి దశలో చేపట్టే ఆరు కారిడార్లలో జన సమ్మర్థం ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో వాటిని లైట్ మెట్రోగా, రెండో దశలో చేపట్టే కారిడార్లలో జన సమ్మర్థం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ట్రామ్ వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం తర్వాతే దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. కానీ, ముందస్తు అంచనాతో ట్రామ్ వ్యవస్థపైనా డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించారు. మొదటి దశ కారిడార్లను ఈ సంవత్సరమే ప్రారంభించి 2024 నాటికి, రెండో దశను 2023లో ప్రారంభించి 2028–29 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు ఏఎంఆర్‌సీ అధికారులు స్పష్టం చేశారు. -
అమరావతిలో మెట్రో మాట ఉత్తదే
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మెట్రో రైలు, లైట్ మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతిలో మెట్రో స్థానంలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ చేపట్టనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్నివిజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డిఎంఆర్సీ) డీపీఆర్ సమర్పించక ముందే కన్సల్టెన్సీ చార్జీల పేరుతో రూ. 60 కోట్లు చెల్లించాలని ఎందుకు అడుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుల విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్న నేపథ్యంలో అసలు అమరావతిలో మెట్రో ఏర్పాటు జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. అసలు మెట్రో రైలు, లైట్ మెట్రో రైలుకు సంబంధించి ప్రతిపాదనలే లేవని కేంద్రం స్పష్టం చేయడంతో టీడీపీ ఆడుతున్న డ్రామా బయటపడింది. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు మెట్రో పేరుతో పైకి మాటలు చెబుతూ ఏవిధంగా ప్రజలను మోసం చేస్తుందో స్పష్టం అవుతోంది. టీడీపీ నేతలు మెట్రో రైలు రాలేదంటూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసలు ప్రతిపాదనలే లేనప్పుడు కేంద్రం ఎలా మంజూరు చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘మాతృ వందనం’లో వెనుకబడ్డ ఏపీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి మాతృ వందనం పథకం(పీఎంవీవై) అమలు అతంత మాత్రంగానే ఉన్నట్టు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్ వెల్లడించిన వివరాల ద్వారా తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్ని రాష్ట్రాల్లో పీఎంవీవై పథకం అమలు తీరు ఎలా ఉందని అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా వాటికి సంబంధించిన గణంకాలను ఆయన వెల్లడించారు. గర్భిణిలు, బాలింతల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ. 5 వేలు అందజేస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 50,831 మంది గర్భిణిలు, బాలింతలైన తల్లులు లబ్ది పొందగా, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 2,352 మంది మాత్రమే లబ్ది పొందారు. ఈ పథకం అమలులో జార్ఖండ్, ఛత్తీస్‌ఘఢ్‌ల కన్నా ఏపీ వెనుకబడి ఉంది. -
విజయవాడకు లైట్ మెట్రో రైలు
సీఎంకు నివేదిక ఇచ్చిన జర్మనీ కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ సాక్షి, అమరావతి: విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కనపెట్టారు. దీనికి బదులుగా లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని సీఎం చంద్రబాబునిర్ణయించారు. జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ రవాణారంగ నిపుణుడు ఎడ్వర్డ్ డాట్సన్ బుధవారం సచివాలయంలో సీఎంను కలసి లైట్ మెట్రోపై నివేదిక అందజేశారు. దానిని పరిశీలించిన సీఎం వెంటనే ఆమోదం తెలిపారు. వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. మూడు మార్గాల్లో రానున్న ఈ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును 40 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తామని, గత ప్రాజెక్టులో లేని గన్నవరం ఎయిర్‌పోర్టు, జక్కంపూడి కాలనీలను ఇందులో అనుసంధానించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.డీఎంఆర్సీ ప్రతిపాదించిన మెట్రోకంటే లైట్ మెట్రో నిర్మాణ ఖర్చు 25 శాతం తగ్గుతుందని, నిర్వహణ ఖర్చూ 22 శాతానికి తగ్గుతుందన్నారు. మెట్రో నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.250 కోట్లు ఖర్చవుతుండగా, లైట్ మెట్రోకు రూ.170 కోట్ల నుంచి రూ.180 కోట్లే ఖర్చవుతుందన్నారు. మెట్రో నిర్వహణ ఖర్చు ఏడాదికి 26 కిలోమీటర్లకు రూ.160 కోట్లు అయితే.. లైట్ మెట్రోకు రూ.106 కోట్లు ఖర్చవుతుందన్నారు. మెట్రోకు కనీసం మూడు బోగీలు తప్పనిసరని, లైట్ మెట్రోను రెండు బోగీలతో ప్రారంభించి ప్రయాణికుల సంఖ్య పెరిగేకొద్దీ అదనపు బోగీ ఏర్పాటు చేసుకునే వీలుంటుందన్నారు. మెట్రో బోగీలో 250మంది ప్రయాణించే వీలుంటే.. లైట్ మెట్రో బోగీలో 200 మంది ప్రయాణించవచ్చన్నారు. రాజధానికి ఏటా రూ.1500 కోట్లివ్వాలి అమరావతిలో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకోసం 11 ఏళ్లపాటు రాష్ట్రప్రభుత్వం ఏటా రూ.1,500 కోట్లను బడ్జెట్లో అదనంగా కేటాయింపులు చేయడం ద్వారా అందజేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) అధికారులు సీఎం చంద్రబాబునాయుడుకు నివేదించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు కోరారు.