limca book of record
-
మహాభక్త శిఖామణి శ్రీశ్రీశ్రీ...
ముల్లోకములలో జరుగు ఘటనలను తన యోగబలంచేత దర్శించగల నారదుడు ఉన్నట్టుండి గట్టిగా కేకేశాడు. కునికిపాట్లు పడుతున్న నాస(నారదుడి సహాయకుడు) మేల్కొని ‘‘అయ్యా! తమరి ఆజ్ఞా’’ అన్నాడు చేతులు కట్టుకుంటూ.‘‘మనం అర్జంటుగా భూలోకానికి వెళ్లి రావలెనోయ్’’ మహతి వీణను మెడలో వేసుకుంటూ అన్నాడు నారదుడు.‘‘ఎందుకు స్వామి?’’ వినయంగా అడిగాడు నాస.‘‘భూలోకంలో ఎవరో మానవుడు ఘోర వీర శూర తపస్సు చేస్తున్నాడు. కనీవిని ఎరగని తపస్సు అది. దేవతలకు ఇన్ఫాం చేశాను. భూలోకం వెళ్లడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదోయ్. త్రిలోకసంచారినైన నాకుతప్పుతుందా! పద వెళ్దాం’’ అని తన అసిస్టెంట్‌ను తొందరచేశాడు నారదుడు.‘యమహా భూలోకవేగవాహన్ 4003’లో వాళ్లు భూలోకానికి చేరుకున్నారు.అటుగా వెళుతున్న వ్యక్తిని పిలిచి...‘‘నీ పేరేమిటోయి?’’ అడిగాడు నారదుడు.‘‘దారినపోయే దానయ్య’’ అని చెప్పాడు ఆ వ్యక్తి.‘‘గుడ్. ఇదేమిటి? ఈ అడవి ఇలా ఉంది. చెట్లతో అడవి ఏర్పడుతుందిగానీ, మీసంగెడ్డాలతో ఇంత పెద్ద అడవి ఏమిటి?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. ‘‘దీన్ని గెడ్డమడవి అంటారండీ’’ అని చెప్పాడు దానయ్య.‘‘గెడ్డమడవా? ఇదేం అడవి?’’ ఆరాతీశాడు నారదుడు.‘‘ముందు ఇక్కడ అడవి లేదండి. అసలు ఒక్క చెట్టు కూడా లేదండి. మహాభక్తుడొకరు ఇక్కడ తపస్సు చేస్తుండడం వల్ల ఆయన మీసాలు గెడ్డాలు పెరిగి పెద్దవై, మర్రిచెట్టు ఊడల సైజులో పెరిగి ఇలా ఒక అరణ్యంగా ఏర్పడింది. మీసగెడ్డాలతో ఏర్పడిన ఈ అడవి గిన్నిస్ బుక్‌లోకి మరియు లిమ్కాబుక్‌లోకి కూడా ఎక్కింది. ఈ అడవి ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది....’’ ఇలా నాన్‌స్టాప్‌గా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు దానయ్య.దానయ్య చెప్పిన విషయాలు విన్న తరువాత...‘‘నేను అర్జంటుగా ఆ భక్తశిఖామణిని చూడాలి’’ అంటు కార్లు దూరని ఆ కారడవిలోకి ప్రవేశించి తపస్సు చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లాడు.ఆ వ్యక్తి నోటి నుంచి....‘రా....గో....పాల్...ఓం...వర్మ...’ అనే శబ్దాలు వినిపిస్తున్నాయి.‘‘నాయనా...కళ్లు తెరిచి ఒకసారి చూడు’’ భుజం తట్టాడు నారదుడు.ఆ వ్యక్తి ఒక కన్ను మాత్రమే తెరిచి...‘‘ఎవరు మీరు?’’ అని అడిగాడు.‘‘నన్ను నారదమహర్షి అందురు. అది సరే నీ పేరేమిటి’’ అడిగాడు నారదుడు.‘‘నన్ను రామ్‌గోపాల్‌వర్మ అందురు’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘భక్తులందరూ తమ ఇష్ట దైవనామాన్ని జపిస్తూ తపస్సు చేస్తుంటారు. అదేమిటి...నువ్వు నీ నామాన్నే జపిస్తూ తపస్సు చేస్తున్నావు?’’ అని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ వర్మ ఇలాచెప్పాడు:‘‘దేహమేరా దేవాలయం అన్నాడు శోభన్‌బాబు. మనలో ఒక దేవాలయం ఉన్నప్పుడు దేవుడు మాత్రం ఎందుకు ఉండడనేది నా పాయింట్. నా దేహమే దేవాలయమైనప్పుడు...అందులో దేవుడిని నేనుమాత్రం ఎందుకు కాకూడదు? అందుకే నా పేరుతో నేను జపం చేసుకుంటున్నాను’’ కర్ణకఠోరంగా క్లారిటీ ఇచ్చాడు వర్మ.ఆకాశంలో రెండు మెరుపులు సిగ్గుతో మెరిసాయి. ఉరుము గర్జించబోయి భోరుమని ఏడ్చింది.‘‘నువ్వే దేవుడివైనప్పుడు వరం కోసం వేరే దేవుడి గురించి తపస్సు చేయడం ఎందుకు?’’ అడిగాడు నారదుడు.వర్మ గుడ్లు తేలేశాడు. ఆ తరువాత ఏదో చెప్పబోయాడు.మళ్లీ ఏదోచెప్పబోతుండగా...‘‘భక్తవర్మ! నువ్వు ఏదో ఒకటి చెప్పడం కంటే ఇలా మౌనంగా ఉండటమే చాలా బాగుంది. ఐ అప్రిషియేట్ యూ. సరే...ఏం వరం కావాలో కోరుకో నాయనా’’ అడిగాడు నారదుడు.అదేమిటి? వరాలు ఇచ్చేది శివుడు కదా...సరే ఎవరో ఒకరులే. నాకు అర్జంటుగా వందకోట్లు కావాలండీ.’’ అన్నాడు వర్మ.‘‘వందకోట్లతో ఏంచేస్తావు నాయనా?’’ అడిగాడు నారదుడు.‘వందకోట్లతో ఒక షార్ట్‌ఫిల్మ్ తీసి రికార్డ్ సృష్టించాలనుకుంటున్నాను. అంత పెద్ద బడ్జెట్‌తో షార్ట్‌ఫిల్మ్ తీసిన ఘనత చరిత్రలో నాకే దక్కుతుంది’’ చెప్పాడు వర్మ.‘అలాగే. నీ కోరిక నెరవేరుతుంది. ఇంటికి వెళ్లి చూడు’’ వరం అనుగ్రహించి అక్కడి నుంచి మాయమయ్యాడు నారదుడు.‘ఇవి పెట్టుడు మీసాలు, గెడ్డాలని....ముంబైనుంచి వచ్చిన వాళ్లు ఈ గెడ్డం అడవి సెట్టింగ్ వేశారని పాపం నారదుల వారికి తెలియదు’ అని తనలోతాను నవ్వుకున్నాడు వర్మ.మెరుపు వేగంతో హైదరాబాద్‌కి వెళ్లాడు.తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లాడు. ఎటు చూసినా కోట్లే!టేయిల్ కోట్, మార్నింగ్ కోట్, ఫ్రాక్ కోట్, డిన్నర్ కోట్, స్మోకింగ్ కోట్, డస్టర్ కోట్, ట్రెంచ్ కోట్, రెయిన్ కోటు...ఇలా ప్రపంచ నలుమూలలకు చెందిన వంద కోట్లు ఆ ఇంట్లో ఉన్నాయి.వర్మకు దిమ్మతిరిగింది. ఎన్నడూ లేనిది ‘ఓ మైగాడ్’ అని గట్టిగా అరిచాడు. – యాకుబ్ పాషా -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం పరుగు
బాలానగర్(జడ్చర్ల) : లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో పేరు సంపాదించేందుకు ఓ యువకుడు పరుగు అందుకున్నారు. వివరాలిలా.. వరంగల్ జిల్లా పరకాల మండలం కుంటఆత్మకూకు చెందిన తిరుపతి(26) హైదరాబాద్‌లోని డెల్ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఉదయాన్నే బొటానికల్ గార్డెన్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు. గమనించిన బాలానగర్‌కు చెందిన నందిటైర్స్ ఎండీ భరత్‌రెడ్డి యువకుడితో ఆరా తీశారు. దీంతో అతను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించే దిశగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానని, దాతలు సహకరిస్తే గతంలోని 192 కిలోమీటర్స్ రికార్డును అధిగమిస్తానని పేర్కొన్నారు. దీంతో స్పందించిన భరత్‌రెడ్డి తన నందిటైర్స్ సంస్థ ద్వారా అవసరమై సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో తిరుపతి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అవసరమైన వనరులను సమకూర్చకొని తన పరుగును ప్రారంభించారు. ఓ అంబులెన్స్, సహాయక సిబ్బంది తోడు రాగా బొటానికల్ గార్డెన్ నుంచి ప్రారంభించిన పరుగును బాలనగర్ మండలంలోని నందిటైర్స్ పరిశ్రమ వరకు చేరి 100 కిలోమీటర్లు పూర్తిచేసి ముగించారు. తిరుపతికి ఘన సన్మానం: పరిశ్రమ ఎండీ స్థానిక నాయకులతో కలిసి తిరుపతిని ఘనంగా సత్కరించారు. తిరుపతి మాట్లాడుతూ 192 కిలోమీటర్లుగా ఉన్న బెంగుళూరుకు చెందిన అరుణ్‌భరద్వాజ్ రికార్డును చెరిపి తన పేరున నమోదు చేసుకునేందుకు కృషిచేస్తున్నానన్నారు. ఇందుకు హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్ వరకు పరుగుతీసి రికార్డును నెలకొల్పుతానన్నారు. తన తల్లి పక్షవాతం బారిన పడిందని, తండ్రి బీపీతో బాధపడుతున్నాడని తన కుంటుంబాన్ని పోషించే స్థాయిలేని తనకు నందిటైర్స్ ఎండీ ఆర్థికంగా ఆదుకొని ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఎలాంటి గుర్తింపు లేని తనకు రమేష్ అనే కోచ్‌ను నియమించి ఈ ఘనత సాధించే దిశగా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
నల్లధనానికి వ్యతిరేకంగా విద్యార్ధుల రికార్డు ప్రయత్నం
-
సింగరేణికి లిమ్కా బుక్ రికార్డ్స్‌లో చోటు
సామూహిక యోగాకు గుర్తింపు శ్రీరాంపూర్(ఆదిలాబాద్): యోగాలో సింగరేణికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు కంపెనీ వ్యాప్తంగా నిర్వహించిన సామూహిక యోగాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. ఈ మేరకు యూజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం సీఎండీ ఎన్.శ్రీధర్ ‘మీ కోసం- మీ ఆరోగ్యం కోసం’ వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేశారు. యోగా దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకొని కార్మికులకు యోగా ప్రాముఖ్యత తెలియజేయడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కంపెనీ విస్తరించిన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధి 11 ఏరియూల్లో ఒకేసారి 176 సెంటర్లలో యోగా ప్రదర్శనలు నిర్వహించగా 60,369 మంది పాల్గొన్నారు. బెంగళూరు యోగా వర్సిటీకి చెందిన యోగా నిపుణులతో శిక్షణ ఇప్పించారు. అన్ని ఏరియాల్లో ఆ రోజున లిమ్కా బుక్ ప్రతినిధులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. చివరికి లిమ్కా బుక్‌లో చోటు దక్కింది. శుక్రవారం ఈ సర్టిఫికెట్‌ను కంపెనీ అధికారులకు అందజేసే అవకాశం ఉంది. ఈ రికార్డు సాధించడంపై యాజమాన్యం, కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
108 నిమిషాల్లో 108 వినాయకులు..
హైదరాబాద్: 108 మంది విద్యార్థులు 108 నిమిషాల్లో 108 రకాల గణనాధ చిత్రాలను గీసి అబ్బురపరిచారు. ఈ అరుదైన చిత్ర మాలికల సమాహారానికి నగరంలోని వీఎన్ఆర్ సద్గురు పాఠశాల వేదికైంది. పాఠశాలకు చెందిన 108 మంది విద్యార్థులు వివిధ రూపాలలో పార్వతీ తనయుడి చిత్రాలను గీసి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
యోగాసనాలతో స్కూల్ విద్యార్థుల రికార్డ్
-
ఓ తండ్రి ప్రేమ!
బిడ్డ కోసం రికార్డుల వేట నిమిషంలో 62 గుంజీలు రెండేళ్ల కుమారుడితో మరో సాహసం సైకిల్ వెనక్కి తొక్కించిన వైనం సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని గుజరాతీ ఉన్నతి పాఠశాల ఈ కృత్యానికి శనివారం వేదికైంది. నగరంలోని మల్కాజిగిరి వాణీనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అమీర్ కె వడ్సరియా.... అతని రెండున్నరేళ్లకుమారుడు మేహుల్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం వినూత్న ప్రయోగం చేశారు. అమీర్ ఒక నిమిషంలో 62 గుంజీలు తీశాడు. మేహుల్ ఒక నిమిషంలో 50 మీటర్ల వరకు ట్రైసైకిల్‌ను రీవర్స్‌లో(వెనక్కి) తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో అమీర్ గంట వ్యవధిలో ఉన్న 1100 గుంజీల రికార్డును... 1450 గుంజీలు తీసి బద్దలుకొట్టారు. శనివారం ఒక నిమిషంలో 62 గుంజీలు తీసి మరో రికార్డు నెలకొల్పారు. చికిత్స కోసమే.... గుజరాత్‌కు చెందిన అమీర్ ఎనిమిదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని...భార్యా పిల్లలతో నగరానికి వచ్చాడు. మల్కాజిగిరి ప్రాంతంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ చాలీచాలని డబ్బులతో బతుకుబండిని లాగిస్తున్నాడు. అయిదేళ్లుగా పెద్ద కుమారుడు ఆమన్(8) కండరాల క్షీణత వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రో)తో బాధ పడుతున్నాడు. కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. చికిత్స చేయించడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించ లేదు. కొడుకు కోసమే గుంజీలు తీయడం ప్రారంభించానని... ఈ రికార్డు నెలకొల్పడం ద్వారా వచ్చే డబ్బుతో బిడ్డకు వైద్య సేవలు అందించవచ్చని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అమీర్ పేర్కొన్నాడు. తన చిన్న కుమారుడు మేహుల్ తోనూ ట్రై సైకిల్ రివర్స్‌లో తొక్కించడం ప్రారంభించానన్నాడు. వీటిని వీడియో తీసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు పంపిస్తానని తెలిపాడు. ఈ రూపంలో డబ్బు సమకూరితే బిడ్డ వైద్య సేవలకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు చెప్పాడు. బిడ్డ కోసం తండ్రి...అన్న కోసం చిన్నారి చేసిన ఈ ప్రయోగాలు చూపరులను ఆకట్టుకోవడంతో పాటు...కదిలించాయి. -
లిమ్కా రికార్డ్స్‌లోకి కరీంనగర్ జిల్లా వాసి
గోదావరిఖని: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంగ్లిష్ పాలిన్డ్రోమ్ (ముందు నుంచి వెనక్కి, వెనుక నుంచి ముందుకు చదివే వీలున్న వాక్యం) తయారు చేసిన కరీంనగర్ జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన యార్లగడ్డ పోలీస్ లిమ్కా బుక్ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు. ముఖ్యమైన 3,663 పదాలతో ఆయన తయారు చేసిన వాక్యం అతిపెద్ద పాలిన్డ్రోమ్గా ప్రపంచ రికార్డు సాధించింది. వాడిన పదం వాడకుండా వాక్య నిర్మాణం చేయడం దీని ప్రత్యేకత. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్, ఎంఏ సోషియూలజీ చదివి, ఆర్జీ-2 జీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈయన ఈ పాలిన్డ్రోమ్ తయారు చేయడానికి ఐదేళ్లు పట్టింది. దీన్ని జూలైలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించగా వారు గుర్తిస్తూ ఆగస్టు 29న సర్టిఫికెట్ పంపించారు. గిన్నిస్ బుక్ దరఖాస్తు పరిశీలనలో ఉందని, మూడు నెలల పరిశీలన తర్వాత అందులోనూ నమోదయ్యే అవకాశముందని పోలీస్ తెలిపారు.