దివ్యధామం... పంచలింగాల క్షేత్రం
దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై అయిదు లింగాలు వెలసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం. పురాతన కాలం నాటి ఈ ఆలయం సర్పదోషాలను పరిహరించడంలో ప్రసిద్ధి గాంచింది. కార్తీక మాసం కావడంతో ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు విచ్చేస్తున్నారు.
స్థలపురాణం
పూర్వం జనమేజయ మహారాజు సర్పయాగాన్ని నిర్వహించాడు. దానిఫలితంగా సర్పదోషం సంక్రమించింది. ఈ దోష నివారణ కోసం దేశం నలుమూలలా కోటి లింగాలను ప్రతిష్టించాడు. ఆ కోటి లింగాలలో చిట్ట చివర ప్రతిష్ఠించినదే ఈ పంచలింగాల క్షేత్రం. చిట్టచివరగా నిర్మించినది కదా అని జనమేజయ మహారాజు ఉదాశీనంగా ఏమీ ఊరుకోలేదు. అనేకమంది యోగులు, మంత్ర సిద్ధుల చేత శాస్త్రోకంగా పంచలింగాలను ప్రతిష్టించి సర్పదోషం నుండి విముక్తి పొందినట్టుగా గంగాపురాణం ప్రస్తావించింది.ఎందరో మహారాజుల పరిపాలన కాలంలో ఈ ఆలయంలో విశేష పూజాపురస్కారాలు జరిగాయి. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖద్వారంగా విలసిల్లింది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయులు దర్శించాడని ఆలయం ముందు ఉండే శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలలో విజయ నగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు నేటì కీ కనిపిస్తాయి. రాయల సీమ కూడా ఈ ప్రాంతం నుండే ఆరంభం అయినట్టు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది.
ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ప్రతిష్టించబడిన వీరభద్రుడు, సకల కోరికలు తీర్చేటువంటి చాముండి మాతను కూడా వదర్శించుకోవచ్చు. ఇంకా ఈ ఆలయం చుట్టు అనేక శివాలయాలు వెలిశాయి. కానీ కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. గధాదరుడు అయినటువంటి గయా నారాయణుడిని కూడా ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు.పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారట. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషం, నవగ్రహ దోషం, మృత్యుదోషం, కుజ దోషం వంటి అనేక దోషాలు నివృత్తి అవుతాయని ఆలయ అర్చకుడు రంగాచార్యులు తెలిపారు. ఆలయానికి తూర్పుముఖంగా తుంగానది ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ చేపట్టింది.పంచభూతాల స్వరూపమే పంచలింగాలఆకాశం, గాలి, నీరు, నిప్పు, వాయువు, భూమి... ఈ పంచభూతాల స్వరూపమే ఇక్కడి పరమశివుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఇక్కడి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉండి భక్తుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎంతో మంది ఋషులు ఇక్కడ తపస్సు ఆచరించి పరమశివుడి అనుగ్రహాన్ని పొందినట్టు ఆలయ పండితులు, చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు.
ఎలా వెళ్లాలంటే..?
కర్నూలు నుంచి కేవలం 5 కి.మీ దూరంలో, తుంగభద్ర నదీతీరాన్ని ఆనుకుని ఉన్న ఈ గ్రామానికి కర్నూలు నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాలున్నాయి.
ఇతర సందర్శనీయ స్థలాలు
ఇక్కడికి సమీపంలో కాల్వబుగ్గ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం ఉంది. ఇంకా కొండారెడ్డి బురుజు, కొమ్మచెరువు ఆంజనేయ స్వామి గుడి, అలంపూర్ జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయాలు న్నాయి.
స్థల పురాణం
వేల సంవత్పరాల క్రితం మునులు జనసంచారం లేని నిర్మల ప్రదేశం కోసం వెదుకుతూ కొండపైకి చేరుకున్నారు. అక్కడ తపస్సు చేయడం ప్రారంభించారు. కొన్ని దుష్టశక్తులు తపోభంగం చేయడానికి యత్నించగా స్వామి వారు లక్ష్మీనరసింహ అవతారంలో దుష్టశక్తును దూరం చేసి, బండరాయిపై వెలిసిశాడని ప్రతీతి. దుష్టశక్తుల బాధ దూరం కావడంతో మునులు కొలనులోకి స్నాన మా^è రించడానికి వెళ్లారు. స్వామి వారు మూడు నామాలు కలిగి ఉండి మత్స్యరూపంలో దర్శనమిచ్చారట.
ఇలా వెళ్లాలి
స్వామి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఉప్పల్, భువనగిరి మీదుగా రావాలి. ఎల్బీనగర్ మీదుగా వచ్చేవాళ్లు చౌటుప్పల్ మీదుగా రావాలి. సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లాల నుంచి చిట్యాల మీదుగా వలిగొండకు చేరుకోవాలి. వలిగొండ నుంచి అరూరు గ్రామం మీదుగా ఉన్న ఘాట్ రోడ్డుపై నుంచి లేదా వలిగొండ, మోత్కూరు ప్రధాన రోడ్డు ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు.