సెపక్‌తక్రా జిల్లా జట్టు క్రీడాకారులు
‘సెపక్‌తక్రా’ జిల్లా జట్టు ఎంపిక
Published Fri, Aug 26 2016 10:25 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
లింగాల: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల,కళాశాల క్రీడామైదానంలో శుక్రవారం‘సెపక్‌తక్రా’జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ ఎంపికకు గాను జిల్లా నలుమూల నుంచి సెపక్‌తక్రా క్రీడపై ఆసక్తి ఉన్న పలువురు క్రీడాకారులు తరలివచ్చారు. పీడీ భాస్కర్, లెక్చరర్ జి.శ్రీనివాసులు పర్యవేక్షణలో జరిగిన పోటీలలో 12 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో ప్రతిభ కనబర్చిన 7 మంది క్రీడాకారులతో జల్లా జట్టును ఎంపిక చేశారు.
అఖిలేష్(అమ్రాబాద్),ఉదయ్(పెబ్బేర్), జగన్(కొత్తకోట),సురేష్(కోడేర్), మహేష్(కోడేర్),సీ. ఆంజనేయులు(అచ్చంపేట), బాబుప్రసాద్(చక్రాపూర్) జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 27,28 తేదీలలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టు ఆడనున్నట్లు పీడీ భాస్కర్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్,అధ్యాపకులు శ్రీనివాసులు, పాండు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement