lingapalem
-
ఉద్యాన పంటల సాగుకు రూ.32 కోట్లు రాయితీ
లింగపాలెం : 2016–17 ఆర్థిక సంవత్సరం నాటికి జిల్లాలో ఉద్యానపంటలు సాగు చేసే రైతులకు రూ.32 కోట్ల సబ్సిడీని అందించే లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా ఉద్యానపంటల ఉప సంచాలకుడు వైవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఉద్యాన పంటల పథకం రాయితీలపై ధర్మాజీగూడెంలో రైతులకు గురువారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి రైతు ఉద్యాన పంటలను సాగు చేసి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందాలని సూచించారు. ఈ పంటలు సాగుచేసే రైతులకు రాయితీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. సబ్సిడీపై యంత్రాలను అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది జిల్లాలో లక్షా 46 వేల హెక్టార్లలో రైతులు ఉద్యాన పంటలు సాగు చేశారన్నారు. ఇప్పటికి రూ.20 కోట్లు సబ్సిడీ కింద రైతులకు అందించినట్టు ప్రసాద్ తెలిపారు. ఉద్యాన పంటలకు సంబంధించి నిమ్మ, బొప్పాయి, శాశ్వత పందిళ్లపై సాగుచేసే కూరగాయలు, అరటి, నర్సరీల్లో నారు పెంపకాలు, పువ్వులు, ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు సబ్సిడీలు అందించనున్నట్టు చెప్పారు. 2017–18 సంవత్సరానికి రూ.50 కోట్ల వరకు రాయితీలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నప్పటికీ సబ్సిడీలు రావటం లేదని పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంటలను ఎక్కువ మంది సాగు చేస్తున్నా చాలాతక్కువ మందికి సబ్సిడీలు అందుతున్నాయని పేర్కొన్నారు. సబ్సిడీలు అందని రైతుల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గారపాటి భజ్జియ్య, ఏపీఎంఐపీ పీడీ ఎస్.రామ్మోహనరావు, ఉద్యానపంటల ఏడీ ఎ. దుర్గేష్, అసిస్టెంట్ సెరీకల్చర్ ఆఫీసర్ కె.రంగారావు, ఉద్యాన శాఖ ఏవో సంతోష్ పాల్గొన్నారు. -
ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య
ఏలూరు అర్బన్ : ముక్కుపచ్చలారని బాలుడొకడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ధర్మాజీగూడెంకు చెందిన ముక్కు రాంబాబు, అరుణ దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు సాయి గోపాల్ (12) అదే గ్రామంలోని పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నేప£ý ్యంలో ఎవరూ లేని సమయం చూసి సాయి గోపాల్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వీరు హుటాహుటిన బాలుడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిగోపాల్ కన్నుమూశాడు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ధర్మాజీగూడెం ఎస్సై వి.క్రాంతికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
95 శాతం వికలాంగత్వం.. అయినా కనికరించని యంత్రాంగం
* పుట్టుకతో మానసిక వికలాంగుడైన ఆజాద్ * పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న తల్లి లింగపాలెం : తొంభై ఐదు శాతం వికలాంగత్వం ఉన్నా పింఛన్ ఇచ్చేందుకు యంత్రాంగం కనికరించడం లేదు. వికలాంగుడైన ఎనిమిదేళ్ల కొడుకును చంకన ఎత్తుకుని అతడి తల్లి అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్నా రేపు.. ఎల్లుండి అంటూ తిప్పుకుంటున్నారే తప్ప పింఛన్ మాత్రం మంజూరు చేయడం లేదు. ఆ తల్లి పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. వివరాలు ఇలా ఉన్నాయి. లింగపాలెం మండలంలోని మఠంగూడెంకు చెందిన దేశావత్ జ్యోతి, శ్రీను దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం అజాద్ జన్మిం చాడు. పుట్టుకతోనే అతడు మానసిక వికలాంగుడు. కాళ్లు, చేతులు పనిచేయవు. మాటలురావు. అన్నం తినలేడు. అన్నీ తల్లిదండ్రులే దగ్గరుండి చూసుకుంటున్నారు. అజాద్‌కు వికలాంగుల పింఛన్ ఇప్పించాలని కోరుతూ నాలుగేళ్లుగా తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అనేకసార్లు దరఖాస్తులు సైతం అందించినట్టు ఆజాద్ తల్లి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్‌కు 95 శాతం వికలాంగత్వం ఉన్నట్టు వైద్యులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని తెలిపారు. తమకు ఇద్దరు కుమారులని, ఆజాద్ పెద్ద కొడుకని చెప్పారు. కూలి పనులకు వెళితే గాని కుటుంబ గడవదని, తాను ఇంట్లోనే ఉండి కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని ఆమె తెలిపింది. ఆజాద్‌కు పింఛన్ ఇవ్వాలని అధికారులను కోరితే రేషన్‌కార్డులో ఆజాద్ పేరు లేదని చెప్పారని, దీంతో రచ్చబండ కార్యక్రమంలో కార్డులో పేరు చేర్పించామని జ్యోతి చెప్పింది. ఆజాద్ పేరును తెల్ల రేషన్‌కార్డులో చేర్చారని, అది పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగి పింఛన్ ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయింది. ఏలూరు వెళ్లి ప్రజావాణిలో దరఖాస్తు చేసినా ఫలితం లేదని చెప్పారు. అధికారులు కనికరించి తమ కుమారుడికి వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆమె వేడుకుంటోంది. -
కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం
లింగపాలెం, నూస్లైన్ : కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై ప్రయూణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చింతలపూడి మండలం ఊటసముద్రం పంచాయతీ ఖండ్రిగగూడేనికి చెందిన మాజీ సర్పంచ్ అప్పిరెడ్డి దుర్గారావు(54) సమీప బంధువైన సంకు మల్లయ్య(48)తో కలిసి శుక్రవారం మోటార్ బైక్‌పై చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తుండగా లింగపాలెం జూబ్లీనగర్ సమీపంలో ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న దుర్గారావు, మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కారు బైక్‌ను ఢీకొట్టి అనంతరం పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. మల్లయ్య సీతానగరం గ్రామానికి చెందినవాడు. వీరిద్దరూ ఏలూరు ఆసుపత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ప్రమాద స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతులు దుర్గారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, మల్లయ్యకు భార్య, ఒక పాప ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మాజీగూడెం ఏఎస్సై కె.నాగేశ్వరావు తెలిపారు. కారు డ్రైవర్ పరారైనట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో కారు, బైక్ నుజ్జునుజ్జు అయ్యాయి.