పాముకాటుతో వ్యక్తి మృతి
బ్రహ్మసముద్రం : మండలంలోని వేపలపర్తి గ్రామంలో మంగళవారం రాత్రి పాముకాటుకు గురై వన్నూరు లింగప్ప (65) అనే వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద కట్టెలు కొడుతుండగా పాముకాటుకు గురైనట్లు మృతుడి బంధువులు తెలిపారు. దీంతో లింగప్పను అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి భార్య బంధక్క తెలిపింది. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.