Liquid oxygen plant
-
పేదల ప్రాణాలకు భరోసా
గాంధీఆస్పత్రి: కోవిడ్ సెకెండ్‌వేవ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా బాధించింది. ఆక్సిజన్ అందక రోగి మృతి చెందాడు అనే వార్తలు దేశవ్యాప్తంగా వినిపించాయి. ఆయా ప్రభుత్వాలు ప్రాణవాయువు కోసం పాకులాడాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వాహనట్యాంకుల ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఆయా ఆస్పత్రులకు సరఫరా చేసింది. నాటి పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో పలు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ నిధులతో అత్యంత అధునాతనమైన మరో ప్లాంట్‌ను సిద్ధం చేసింది. 26 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్‌ను నిల్వ చేసే ట్యాంకులున్నాయి. నూతనంగా మరో 20 కేఎల్ ట్యాంకు మంజూరైంది. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సుమారు మూడువేల మంది రోగులకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం గాంధీ ఆస్పత్రి సొంతం. ► కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో 20కేఎల్, 6 కేఎల్ (కిలోలీటర్లు) సామర్ధ్యం గల రెండు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు వెయ్యి మంది రోగులకువెంటిలేటర్‌పై 24 గంటల పాటు ఆక్సిజన్ అందించవచ్చును. ► 26 కేఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఉండగా, నూతనంగా మరో 20 కేఎల్ ట్యాంకు మంజూరైంది. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీని నిర్మాణం పూర్తయితే 46 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుంది. ► సుమారు రెండున్నర కోట్ల రూపాయల పీఎం కేర్ నిధులతో కేంద్రప్రభుత్వం అత్యంత అధునాతనమైన రెండు ఆక్సిజన్ ప్లాంట్లను గాంధీప్రాంగణంలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే అక్సిజన్ 95 శాతం స్వచ్ఛంగా ఉంటుంది. ► కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా నిమిషానికి వెయ్యి చొప్పున రెండు యూనిట్స్ ద్వారా రెండు వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చును. ఆక్సిజన్ ప్రెషర్ స్వింగ్ ఎడ్సార్ప్‌సన్ పద్ధతిలో ఈ యూనిట్ పనిచేస్తుంది. ► కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పలు ఫార్మా, ల్యాబోరేటరీలకు చెందిన ఆరు కంపెనీలు కోట్లాది రూపాయల వ్యయంతో గాంధీప్రాంగణంలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాయి. ఈయూనిట్ల ద్వారా గాలిలో ఉన్న ఆక్సిజన్ (అట్మాస్పియర్ ఎయిర్) ను సేకరించి, ప్రత్యేక పద్ధతిలో ఆక్సిజన్‌ను వేరుచేసి పైప్లైన్ల ద్వారా రోగులకు సరఫరా చేస్తారు. ► గాలిలో 20 శాతం ఆక్సిజన్, 70 శాతం నైట్రోజన్, 10 శాతం వివిధ రకాల గ్యాస్‌లు ఉంటాయి. అట్మాస్పియర్ ఎయిర్ ద్వారా ఉత్పత్తి చేసే ఆక్సిజన్ 93 నుంచి 95 శాతం స్వచ్ఛంగా ఉండగా, లిక్విడ్ ఆక్సిజన్ 99 శాతం çప్యూరిటీగా ఉంటుంది. వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తారు. ► గాంధీఆస్పత్రిలో ప్రధాన భవనంలోని ఎనిమిది అంతస్థులు, ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్, అత్యవసర విభాగ భవనాలు, ఎమర్జెన్సీవార్డులు, లేబర్‌రూంలతోపాటు గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని లైబ్రరీ భవనంలో ఆక్సిజన్ పైప్లైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్ పైప్లైన్ల పొడవు సుమారు 52 కిలోమీటర్లు ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ► ఆక్సిజన్ పైప్లైన్లు మరమ్మత్తులకు గురైతే రోగులకు అందించేందుకు సుమారు 200 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు నేరుగా తీసుకువెళ్లేందుకు సిలిండర్లకు ట్రాలీలు అనుసంధానం చేశారు. ► గాంధీలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయి. పీఎం కేర్ ఆధ్వర్యంలో రెండు యూనిట్లు, అరబిందో ఫార్మా, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్, దివీస్ ల్యాబోరేటరీస్, హెటిరో ల్యాబ్స్, ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్, నాట్కో ఫార్మా లిమిటెడ్ కంపెనీలు ఆక్సిజన్ ప్లాంట్స్‌ను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత కోవిడ్ నోడల్ సెంటరైన గాంధీఆస్పత్రిలో అత్యంత అధునాతన వసతులు, మౌళిక సదుపాయాలు కల్పించి, నిరుపేదలకు మరింత మెరుగైన సేవలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. సుమారు రెండువేలకు పైగా వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు సిద్ధం చేశామని, సుమారు మూడు వేల మంది రోగులకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యం సాధించామన్నారు. – రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ -
హమ్మయ్యా.. ఇక ఆక్సిజన్ కొరత ఉండదేమో?
గాంధీ ఆస్పత్రి : కోవిడ్ నోడల్ సెంటరైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ రెండు రోజుల్లో అందుబాటులోకి రానుంది. సుమారు రెండున్నర కోట్ల రూపాయల పీఎం కేర్ నిధులతో నిర్మించిన ఈ కేంద్రంలో నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేసే రెండు యంత్రాలను సిద్ధం చేశారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ ప్లాంట్‌ను సందర్శించి నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్ రెడ్డిలు ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను పరిశీలించి పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన ఆక్సిజన్ ప్లాంట్ రెడీ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పూర్తయినట్లు సంబంధిత అధికారులు, కాంట్రాక్టరు ఆస్పత్రి పాలనా యంత్రాంగానికి తెలిపారు. శుక్ర, శనివారాల్లో ప్లాంట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ తయారు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ సమీపంలోని లైబ్రరీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన పడకలకు అనుసంధానం చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. (చదవండి: Telangana Police: వర్రీలో వారియర్స్) -
సమస్యల పరిష్కారానికి కృషి
=మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య =ఎంజీఎంలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు ప్రారంభం ఎంజీఎం, న్యూస్‌లైన్ : ఎంజీఎం ఆస్పత్రి సమస్యలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య అన్నారు. ఎంజీఎంలో ఆస్పత్రిలో 10 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ సిరిసిల్ల రాజయ్య శుక్రవారం ప్రారంభించారు. ఆనంతరం ఎంజీఎం అకాడమీ హాల్లో డాక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రిలోని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తో త్వరలో సమావేశమవుతామని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో సిబ్బంది భర్తీ, కావాల్సిన సాంకేతిక పరికరాల కొనుగోలు, ఆస్పత్రి అభివృద్ధి నిధుల విని యోగం గురించి ప్రభుత్వ దృష్టికి తెస్తామన్నారు. అనేక సమస్యలు ఉన్నప్పటికీ పేద ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించడానికి ఇక్కడి సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. వ్యవస్థలోని లోపాలను అధిగమించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ఎం జీఎం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తు తం ఉన్న 250 పోస్టులకు 69 ఔట్ సోర్సింగ్ ద్వారా, మిగిలినవి రెగ్యూలైరైజ్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ప్రతీ వారం ఎంజీఎం పనితీరుపై జిల్లా కలెక్టర్ రివ్యూ చేయాలని సూచించారు. తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 5.25 లక్షలు ఆస్పత్రి అభివృద్ధికి, రూ. 4 ల క్షలు కేయూ క్రికెట్ మైదానం అభివృద్ధికి ఇచ్చానని చెప్పారు. ఎంపీ రాజయ్య మాట్లాడుతూ ఎంజీఎంలో వెంటిలేటర్లకు రూ. 12 లక్షలు ఎంపీ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 40 డాక్టర్ల పోస్టుల భర్తీకి ఒత్తిడి తెస్తామని అన్నారు. ఆస్పతి అభివృద్ధి నిధులను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించాలని మంత్రులను జిల్లా కలెక్టర్ కిషన్ కోరారు. అవసరమైన పరికరాల కొనుగోలుకు అనుమతులు ఇప్పించాలన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కె.శ్రీధర్, డాక్టర్ తాటి కొండ రాజయ్య, మునిసిపల్ కమిషనర్ పండాదాస్, అదనపు జేసీ సంజీవయ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, ఆర్‌ఎంఓలు డాక్టర్ నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్, డాక్టర్లు చంద్రశేఖర్, ప్రవీణ్, వెంకట్‌రెడ్డి, బందెల మోహన్‌రావు, శ్రీనివాస్, కరుణాకర్‌రెడ్డి, దొడ్డ రమేష్, తహసీల్దార్ రవి, ఆర్ఐ నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.