=మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య
=ఎంజీఎంలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు ప్రారంభం
ఎంజీఎం, న్యూస్‌లైన్ : ఎంజీఎం ఆస్పత్రి సమస్యలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య అన్నారు. ఎంజీఎంలో ఆస్పత్రిలో 10 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ సిరిసిల్ల రాజయ్య శుక్రవారం ప్రారంభించారు. ఆనంతరం ఎంజీఎం అకాడమీ హాల్‌లో డాక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రిలోని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తో త్వరలో సమావేశమవుతామని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.
ఎంజీఎం ఆస్పత్రిలో సిబ్బంది భర్తీ, కావాల్సిన సాంకేతిక పరికరాల కొనుగోలు, ఆస్పత్రి అభివృద్ధి నిధుల విని యోగం గురించి ప్రభుత్వ దృష్టికి తెస్తామన్నారు. అనేక సమస్యలు ఉన్నప్పటికీ పేద ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించడానికి ఇక్కడి సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. వ్యవస్థలోని లోపాలను అధిగమించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు.
మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ఎం జీఎం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తు తం ఉన్న 250 పోస్టులకు 69 ఔట్ సోర్సింగ్ ద్వారా, మిగిలినవి రెగ్యూలైరైజ్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ప్రతీ వారం ఎంజీఎం పనితీరుపై జిల్లా కలెక్టర్ రివ్యూ చేయాలని సూచించారు. తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 5.25 లక్షలు ఆస్పత్రి అభివృద్ధికి, రూ. 4 ల క్షలు కేయూ క్రికెట్ మైదానం అభివృద్ధికి ఇచ్చానని చెప్పారు. ఎంపీ రాజయ్య మాట్లాడుతూ ఎంజీఎంలో వెంటిలేటర్లకు రూ. 12 లక్షలు ఎంపీ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 40 డాక్టర్ల పోస్టుల భర్తీకి ఒత్తిడి తెస్తామని అన్నారు. ఆస్పతి అభివృద్ధి నిధులను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించాలని మంత్రులను జిల్లా కలెక్టర్ కిషన్ కోరారు. అవసరమైన పరికరాల కొనుగోలుకు అనుమతులు ఇప్పించాలన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కె.శ్రీధర్, డాక్టర్ తాటి కొండ రాజయ్య, మునిసిపల్ కమిషనర్ పండాదాస్, అదనపు జేసీ సంజీవయ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, ఆర్‌ఎంఓలు డాక్టర్ నాగేశ్వర్‌రావు, హేమంత్, శివకుమార్, డాక్టర్లు చంద్రశేఖర్, ప్రవీణ్, వెంకట్‌రెడ్డి, బందెల మోహన్‌రావు, శ్రీనివాస్, కరుణాకర్‌రెడ్డి, దొడ్డ రమేష్, తహసీల్దార్ రవి, ఆర్‌ఐ నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
Published Sat, Dec 21 2013 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement