Liquor Licence
-
ఎక్సైజ్ శాఖకు కాసుల పంట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. టెండర్ ఫీజు రెండింతలు చేయడంతో దరఖాస్తులు వస్తాయో రావోననే సందేహాల నడుమ తెచ్చిన కొత్త ఎక్సైజ్ మార్గదర్శకాలు ఆ శాఖకు కాసుల పంట పండించాయి. 2019–21 సంవత్సరాలకు 2,216 దుకాణాలకుగాను 48,243 దరఖాస్తులు రావడం ఆ శాఖ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ దరఖాస్తుల ద్వారా రూ.964 కోట్లు ఖజానాకు చేరడం ఎక్సైజ్ శాఖ అధికారులకు ఊరటనిస్తోంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నేడు డ్రా తీయనున్నారు. 29 షాపులకు మాత్రం నేడు లాటరీ తీసే అవకాశం లేదు. ఆయా దుకాణాలకు నాలుగుకంటే తక్కువగా దరఖాస్తులు రావడం తో, దరఖాస్తులను అడ్డుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపాకే ఆ 29 షాపులపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. అవసరమైతే మళ్లీ దరఖాస్తులు స్వీకరించే అవకాశం కూడా ఉందన్నారు. ఖమ్మంలో దుమ్ము రేపారు జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ఉమ్మ డి జిల్లాలో అత్యధికంగా 8,733, హైదరాబాద్‌లో అత్యల్పంగా 1,499 దరఖాస్తు లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో ఒక్కో దుకాణానికి 48 మంది టెండర్ వేయడం ఎక్సైజ్ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీకి చెందిన వ్యాపారులు ఎక్కువగా దరఖాస్తు చేసి ఉంటారని అంచనా. సూర్యాపేట, జనగామ, కొత్తగూడెం జిల్లాలకు కూడా సరాసరిన 32 దరఖాస్తులకు పైగా వచ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సగటున 8.7 దరఖాస్తులు రాగా, పెద్దపల్లి జిల్లాలో 9.9 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ వ్యాపారుల తాకిడితో సరిహద్దు జిల్లాలైన నల్ల గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం గమనార్హం. సోమేశ్ ఆకర్షణ మంత్రం గతంతో పోలిస్తే ఈసారి టెండర్ ఫీజు పెంచినా భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆకర్షణ మంత్రమే కారణంగా కనిపిస్తోంది. దరఖాస్తు ఫీజు రెండింతలు చేశామన్న ఆలోచనే దరఖాస్తుదారులకు రాకుండా, టెండర్ ఫీజుతో పాటు చెల్లించాల్సిన ధరావతును తీసేయడం ద్వారా సోమేశ్ అండ్ టీం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఓవైపు అప్పటికే లైసెన్స్‌లున్న రిటైలర్లు కొత్త షాపుల కోసం రూపొందించిన మార్గదర్శకాలు వ్యాపారులకు నష్టం చేకూరుస్తాయని ప్రచారం చేసి పోటీని తగ్గించే యత్నం చేసినా, క్షేత్రస్థాయిలోని ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారంలోని లాభాలను ప్రచారం చేయడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారని తెలుస్తోంది.వీటికి తోడు ఏపీకి చెందిన వ్యాపారులు కూడా ఈసారి మన రాష్ట్రంలోని షాపులపై దృష్టి సారించడంతో దరఖాస్తులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంమీద దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడం, గతంకన్నా 7వేలకు పైగా ఎక్కువ దరఖాస్తులు రావడంతో సోమేశ్ అండ్ టీం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. -
చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు అసహనం
-
చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు అసహనం
సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. స్కూళ్లకు 100 మీటర్లలోపు ఉన్న మద్యం దుకాణానికి లైసెన్స్ ఇవ్వొద్దన్నా మంజూరు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఈ విషయంలో విసిగిపోయిన నేను ఈ నెల 17న విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చా. నా నియోజకవర్గ పరిధిలో 13 బార్లు, 14 వైన్ షాపులు ఉన్నాయి. అందులో 8 మద్యం షాపులు వద్దంటూ ఎమ్మెల్యే గా వినతిపత్రం ఇచ్చాను. అతి దారుణంగా మా లేఖలు ఓ చిత్తు కాగితంగా తీసి పక్కన పడేశారు. అశోకా వైన్స్‌కు లైసెన్స్ ఇచ్చేశారు. ఏదైనా మేం వినతిపత్రం ఇస్తే బుట్టదాఖలు చేయొద్దు. విశాఖలో వైన్స్ మాఫియాను ఎక్సైజ్ సూపరింటెండెంట్ అడ్డుకుంటున్నా...అమరావతి నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. మళ్లీ లైసెన్స్‌లను ఇప్పించుకుంటున్నారు.’ అని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. -
మద్యం దుకాణాలపై మంత్రి కన్ను
మద్యం లెసైన్సీలపై టీడీపీ ఒత్తిళ్లు లాటరీ కోసం దరఖాస్తు లేయకుండా అడ్డు ఉన్న దుకాణాల్నీ కొనేస్తున్న వైనం జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాలపై మంత్రి కన్ను సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలోని మద్యం దుకాణాలపై టీడీపీ కన్ను పడింది. ఇసుక అక్రమ రవాణాపై ఇప్పుడిప్పుడే విజిలెన్స్ సహా అన్ని విభాగాల నుంచి నిఘా పెరగడంతో నేతలు మద్యం వ్యాపారం వైపు దృష్టి మళ్లించారు. గుడ్‌విల్ పేరిట దుకాణాల్ని సొంతం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం పొరుగు జిల్లాల మద్యం వ్యాపారుల్ని రంగంలోకి దించారు. సాక్షాత్తూ జిల్లా మంత్రికి సన్నిహితంగా ఉంటున్న మద్యం వ్యాపారే ఈ తతంగం నడుపుతుండడంతో బలహీనమైన వ్యాపారులు ఏమీ అనలేకపోతున్నారు. అధికార పార్టీ నేతలతో తమకెందుకొచ్చిన తగాదా అంటూ వారి ఒత్తిడికి తలవంచుతున్నారు. ఇందుకు ఎక్సైజ్ అధికారులు కూడా వంత పాడుతుండడం విశేషం. జిల్లా మంత్రి చొరవతో... జిల్లాలో 232మద్యం దుకాణాలున్నాయి. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలనుంచి మరో ఏడు దుకాణాలు ఇక్కడకు తరలించారు. పలాస, సీతంపేట వంటి ప్రాంతాల్లో మినహా అన్నిచోట్లా వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మరో 15బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. వీటి రెన్యువల్ ప్రక్రియ ముగియడం, కొత్త లెసైన్సీ విధానాన్ని అందుబాట్లోకి తీసుకువచ్చామని ప్రభుత్వం ప్రకటించడంతో వాటిపైనా నేతల కన్ను పడింది. మొత్తానికి జిల్లాలోని మద్యం దుకాణాలన్నీ తమ గుప్పిట్లో ఉండాలన్న మంత్రి ఆదేశాల మేరకు విశాఖ, విజయనగరం నుంచి వ్యాపారస్తుల్ని ఇక్కడకు రప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త వ్యాపారులే టార్గెట్ మద్యం దుకాణాల ద్వారా భారీగా సొమ్ము సంపాదించొచ్చనే ఆశతో కొంతమంది కొత్త వ్యక్తులు ఈ వ్యాపారంలోకి అడుగెట్టారు. అనుభవం లేక, పోటీదారుల ఒత్తిళ్లు తట్టుకోలేక, సీనియర్ వ్యాపారుల ఆగడాలు భరించకలేక వారంతా సతమతమవుతున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ టీడీపీ నేతలకు కలిసొచ్చింది. జిల్లాలోని పలు మార్లు దరఖాస్తు చేసేందుకు వచ్చినవారిని ఒత్తిడి తెచ్చి అసలు పోటీలో పాల్గొనకుండానే వెనక్కు పంపిచేశారు. ఇటీవల ప్రభుత్వ మద్యం దుకాణాలకు జరిగిన లాటరీ ప్రక్రియలో కోటబొమ్మాళి పరిధిలో కొత్త వ్యక్తులెవరూ లాటరీకి రాకపోవడమే ఇందుకు ఉదాహరణగా తోటి వ్యాపారులు చెబుతున్నారు. అదే విధంగా నరసన్నపేట పరిధిలోనూ వ్యాపారులు దరఖాస్తులేయకుండా టీడీపీ నేతలు జాగ్రత్త పడ్డారు. మంత్రి అనుచరుడిగా చె ప్పుకుంటున్న ఓ వ్యక్తి ఏకంగా 200దరఖాస్తులేయించగా (సుమారు రూ. 70లక్షలు ఖర్చుచేసి) వాటిలో ఐదు దుకాణాల్ని దక్కించుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. టెక్కలి నియోజకవర్గ పరిధిలో దాదాపు అన్ని దుకాణాలూ తమవే కావాలని డిమాండ్ చేయడంతో అధికార పార్టీ నేతలతో మనకెందుకంటూ చాలామంది తప్పుకున్నట్టు తెలిసింది. చిన్నచిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తుల్నీ బెదిరించి తమ వ్యాపారానికి అడ్డుతగలకుండా చేసుకున్నారని అధికారులూ పరోక్షంగా చెబుతున్నారు. గుడ్‌విల్‌పై దుకాణాలు నష్టాల్లో ఉన్న దుకాణాలతో పాటు వ్యాపారం బాగా జరుగుతున్న దుకాణ దారుల్ని బెదిరించి గుడ్‌విల్ చెల్లించి ఇప్పటికే సుమారు 20షాపుల్ని టీడీపీ నేతలు, అనుయాయులు దక్కించుకున్నట్టు సమాచారం. లాటరీలో మిగిలిపోయిన దుకాణాల్ని కూడా త్వరలో బినామీల ద్వారా దరఖాస్తులేయించి జిల్లాలో మద్యం వ్యాపారం తమ గుప్పిట్లో ఉంచుకోవాలని నేతలు భావిస్తున్నారు. ఇదే గానీ జరిగితే టోకున మద్యం సరఫరా, నిషేధిత బ్రాండ్ల విక్రయం, భారీగా బె ల్ట్ దుకాణాల కొనసాగింపు, ఎమ్మార్పీ ఉల్లంఘన తప్పదని అబ్కారీశాఖ అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.