ఎస్సార్ ఆయిల్ లాభం జూమ్
క్యూ4లో రూ. 1,008 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఎస్సార్ ఆయిల్ జనవరి-మార్చి కాలం(క్యూ4)లో రూ. 1,008 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 200 కోట్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం. అధిక మార్జిన్లు, విదేశీ మారక లాభాలు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ ఎండీ ఎల్కే గుప్తా చెప్పారు. ఇక కంపెనీ ఆదాయం కూడా 7.5% పెరిగి రూ. 27,691 కోట్లకు చేరింది.
పూర్తి ఏడాదికి కూడా
పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ రూ. 126 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాదిలో రూ. 1,180 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇక టర్నోవర్ రూ. 1,07,190 కోట్లను తాకినట్లు కంపెనీ సీఎఫ్వో సురేష్ జైన్ చెప్పారు. రుణ భారం రూ. 21,751 కోట్ల నుంచి రూ. 19,109 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1% లాభపడి రూ.78 వద్ద ముగిసింది.