loan wiver
-
కాసేపట్లో బ్యాంకర్లతో చంద్రబాబు భేటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం కానున్నారు. రైతులు తీసుకున్న రుణాల వివరాలు, రుణ మాఫీ గురించి చంద్రబాబు చర్చించనున్నారు. ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దీనిపై ఓ కమిటీ వేశారు. బుధవారం ఉదయం ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్తో ఫోన్లో మాట్లాడి రుణమాఫీ ఆవశ్యకత గురించి చర్చించారు. -
రుణమాఫీ హామీ అమలు చేస్తాం
హైదరాబాద్: రైతు రుణాలను మాఫీ చేయడానికి బ్యాంకర్లు అనుకూలంగా లేరని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రుణుమాఫీకి అనుమతి కోరితే రిజర్వ్ బ్యాంక్ ఇవ్దదని అన్నారు. అయినా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని యనమల చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, హర్యానాలో దేవీలాల్ సర్కార్ రుణమాఫీ చేశాయని, ఆ విధానాన్ని తాము పరిశీలిస్తున్నామని యనమల చెప్పారు. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్టుగా రైతుల రుణాలన్నింటీని మాఫీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.