
రుణమాఫీ హామీ అమలు చేస్తాం
హైదరాబాద్: రైతు రుణాలను మాఫీ చేయడానికి బ్యాంకర్లు అనుకూలంగా లేరని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రుణుమాఫీకి అనుమతి కోరితే రిజర్వ్ బ్యాంక్ ఇవ్దదని అన్నారు. అయినా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని యనమల చెప్పారు.
గతంలో యూపీఏ ప్రభుత్వం, హర్యానాలో దేవీలాల్ సర్కార్ రుణమాఫీ చేశాయని, ఆ విధానాన్ని తాము పరిశీలిస్తున్నామని యనమల చెప్పారు. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్టుగా రైతుల రుణాలన్నింటీని మాఫీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.