local body elections results
-
తెలంగాణ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
-
ఎమ్మెల్సీ ఫలితాల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్
అప్డేట్స్: 10: 05 AM ► స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు స్థానాలనూ గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. నల్లగొండలో కోటిరెడ్డి, ఖమ్మంలో తాతా మధు, కరీంనగర్-1లో భాను ప్రసాద్, కరీంనగర్-2లో ఎల్. రమణ, ఆదిలాబాద్‌లో దంతె విఠల్, మెదక్‌లో యాదవరెడ్డి విజయం సాధించారు. ► మెదక్‌లో జగ్గారెడ్డి సతీమణి నిర్మల ఓటమి పాలయ్యారు. 09: 30 AM ► ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం సాధించారు. 09: 25 AM ► మెదక్‌లోను కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ► ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 09: 10 AM ► వీరి గెలుపును మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ► నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా.. ఆయనకు అధిక ఓట్లు పోలయ్యాయి. కోటిరెడ్డికి 917, స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు పోలయ్యాయి. కోటిరెడ్డి 691 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ► ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధు గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో 738 ఓట్లు పోలయ్యాయి. దీనిలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 480 ఓట్లను సాధించారు. 08: 10 AM ► నల్లగొండ జిల్లాలో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్లను సిబ్బంది బండిల్స్ కడుతున్నారు. ► ఆదిలాబాద్ జిల్లాలో టీడీసీ కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. ► కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ ప్రకటించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్ననికల్లా ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్ కోసం ఆదిలాబాద్‌లో 6, నల్లగొండలో 5, మెదక్‌లో 5, ఖమ్మంలో 5, కరీంనగర్లో 9 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలుత బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత లెక్కించనున్నారు. ముందు తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. నల్లగొండ, మెదక్‌లో రౌండ్లు ఎక్కువ ఉంటాయని సీఈఓ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతించనున్నారు. టేబుల్‌కు ముగ్గురు సిబ్బంది ఉంటారు. అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంట్ చొప్పున నియమించుకోవచ్చునని గోయల్ వివరించారు. లెక్కింపు అనంతరం ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు. అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యత ఓటు వేయకుండా 2, 3 ప్రయారిటీ ఓట్లు వేసినా, అక్షరాలలో రాసినా లేదా క్రాస్ మార్కు, రైట్ టిక్కు మార్కు పెట్టినా ఓటు చెల్లుబాటు కాదు. మూడు చోట్ల ఫలితాలపై ఆసక్తి మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరింటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఈ నెల 10న పోలింగ్ నిర్వహించారు. మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక స్థానానికి ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌లో ముగ్గురు బరిలో నిలిచారు. కాగా మూడు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో క్రాస్‌ఓటింగ్ VS జరిగినట్టు చర్చ జరుగుతోంది. -
పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్
చండీగఢ్: పంజాబ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఇప్పటివరకు 6 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. మరో కార్పొరేషన్‌లోనూ పాగా వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చేదు అనుభవమే ఎదురయ్యింది. అధికార పక్షానికి గట్టి పోటీ కూడా ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కొన్నిచోట్ల తమ ఉనికిని చాటుకున్నాయి. 2020లో జరగాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న నిర్వహించారు. బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. భటిండా, హోషియార్పూర్, కపుర్తలా, అబోహర్, బటాలా, పటాన్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ వశమయ్యాయి. ఇక మరో ఆరు వార్డులు గెలుచుకుంటే చాలు మోగా కార్పొరేషన్‌లోనూ కాంగ్రెస్ విజయం ఖాయం కానుంది. మొహాలీ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు గురువారం జరుగనుంది. ఇక్కడ రెండు బూత్‌ల్లో రీపోలింగ్ నిర్వహించారు. 109 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీల్లోనూ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ విజయం ప్రతి పంజాబీ విజయం: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద ఉత్తున పోరాటం సాగిస్తున్నారు. వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తోంది. తాజా ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యింది. ఈ విజయం ప్రతి పంజాబీ విజయమని అభివర్ణిస్తూ సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలు కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నారని.. విద్వేష, విభజన, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలను కాదని తేల్చిచెప్పారు. బీజేపీ, ఆప్, శిరోమణి అకాలీ దళ్ పార్టీల ప్రజా వ్యతిరేక చర్యలను జనం ఛీకొట్టారని అన్నారు. ఆయా పార్టీలు పంజాబ్‌ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాయని ధ్వజమెత్తారు. ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌పై వివక్ష చూపుతోందని ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ నాయకత్వానికి ఆయన మద్దతు పలికారు. మొత్తం 1,817 వార్డులకు గాను ఇప్పటివరకు కాంగ్రెస్ 1,102, ఎస్ఏడీ 252, ఆప్ 51, బీజేపీ 29, బీఎస్పీ 5 వార్డులు గెలుచుకున్నాయి. 374 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. -
కౌన్ బనేగా ‘జెడ్పీ’
‘స్థానిక’ సమరం ఫలితాలు వెలువడి పక్షం రోజులు దాటినా జిల్లాపరిషత్ పీఠం ఏ పార్టీపరమవుతుందన్న విషయంలో స్పష్టత రావడం లేదు.సంఖ్యా పరంగా ‘హస్తవాసి’ ఉన్నా..సమీకరణాలు వేరేలా కుదిరితే కుర్చీ కష్టమే అవుతుంది. ఇక కారు పక్షానికీ కుర్చీని తమవైపు లాక్కోవాలని చూస్తున్నా..లెక్కలు తేలడం లేదు. టీడీపీని ఎలాగైనా వశపరచుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నా ‘రేవంత్’ చిక్కడు దొరకడు తీరున వ్యవహరిస్తున్నారు. దీనితో దీనిపై ఉత్కంఠ రగులుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు దాటినా ‘చైర్మన్’ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం కొలిక్కి రావడం లేదు. ఏ రాజకీయ పక్షానికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నా సంఖ్యాబలం లేకపోవడంతో పీట ముడి వీడటం లేదు. తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన తొమ్మిది మంది జెడ్పీటీసీ సభ్యుల మద్దతు కీలకం కావడంతో సంఖ్యాబలం సాధన కాంగ్రెస్, టీఆర్ఎస్కు క్లిష్టంగా తయారైంది. 64 మంది జెడ్పీటీసీ సభ్యులున్న జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ 28, టీఆర్ఎస్ 25, టీడీపీ 9, బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ అంటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్తో సమాన స్థాయిలో రాజకీయ వైరాన్ని కలిగి ఉండటంతో జడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం సాధన రెండు పార్టీలకు సాధ్యం కావడం లేదు. చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ అనూరాధ పేరును కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపాదించి, టీడీపీ నుంచి మద్దతు కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు టీఆర్ఎస్లో మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి పేరుపై స్పష్టత రావడం లేదు. పెబ్బేరు జెడ్పీటీసీ స్థానం నుంచి గెలుపొందిన రిటైర్డు ఇంజనీర్ ప్రకాశ్ పేరును పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. అయితే గద్వాల నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడంలో టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. గద్వాల నియోజకవర్గం పరిధిలోని జెడ్పీటీసీ అభ్యర్థికే జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలంటూ ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే జెడ్పీ చైర్మన్ అభ్యర్థి పేరు ఖరారవుతుందని పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందున జెడ్పీ పీఠం తమకే దక్కుతుందనే ధీమా టీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది. ‘దేశం’ సభ్యుల మల్లగుల్లాలు తెలుగుదేశం పార్టీ తరపున జిల్లాలో మొత్తం తొమ్మిది మంది జెడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందారు. టీడీపీ ముఖ్య నేత రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే నలుగురు టీడీపీ జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. టీడీ పీ మద్దతు కోరుతున్న నేతలు రేవంత్‌రెడ్డిని సంప్రదిస్తున్నా, ఆయన మాత్రం దాటవేత వైఖరి అవలంబిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు తో మాట్లాడాల్సిందిగా తనను సంప్రదిస్తున్న నేతలకు చెప్తున్నారు. జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక సందర్భంగా గైర్హాజరు అయ్యేలా టీడీపీ సభ్యులను ఒప్పించాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. టీడీపీ సభ్యులు ఎన్నిక ప్రక్రియలో పాల్గొని తమకు మద్దతు ఇచ్చేలా టీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు టీడీపీ శిబిరానికి గండికొట్టి కొందరు సభ్యులనైనా తమ వైపునకు తిప్పుకునేందుకు రెండు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరపున ఎన్నికైన సభ్యులను కాపాడుకోవడం తెలుగుదేశం పార్టీకి తలకు మించిన భారంగా తయారైంది. కొత్త రాష్ట్రంలో చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే జెడ్పీ రాజకీయం రంజుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.