local jobs
-
స్థానికులకు ఉద్యోగాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల్లో స్థానికులకు నిర్ధారిత మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తేవాలని దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా పరిశ్రమలున్నప్పటికీ స్థానిక నిరుద్యోగులకు ఉపయోగం లేకుండా వేరే ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని, ఈ తీరు మారాలని గురువారం ఆయన శాసనసభలో పేర్కొన్నారు. పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఇదే డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చేగుంట ప్రాంతంలో 62 పరిశ్రమలున్నాయని, కానీ వాటిల్లో ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయో కూడా తెలియనీయకుండా వ్యవహరిస్తున్నారని, కనీసం ఆ పరిశ్రమలకు బోర్డులు కూడా లేవని రఘునందన్‌రావు తెలిపారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని, ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే స్థానికులు కానందున వారి తరఫున మాట్లాడే వారూ లేకుండా పోతున్నారన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉంటున్నందున స్థానికంగా ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, కార్మిక సంక్షేమ నిధి నుంచి ఓ విద్యాలయం, కార్మికుల కోసం ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు. నా ఇలాఖాలో సింగిల్ రోడ్డు..కేటీఆర్ ఇలాఖాలో డబుల్ రోడ్డా.. ముస్తాబాద్ నుంచి దుబ్బాక మండల కేంద్రానికి ఉన్న రోడ్డు విషయంలో వివక్ష ఉందన్న భావన కలుగుతోందని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఈ రోడ్డు తన ఇలాఖాలో సింగిల్ రోడ్డుగా ఉండగా పొరుగునే ఉండే కేటీఆర్ నియోజకవర్గం పరిధిలో డబుల్ రోడ్డుగా ఉందని సభ దృష్టికి తెచ్చారు. వెంటనే తన పరిధిలోనూ డబుల్ రోడ్డు చేయాలని కోరారు. దౌల్తాబాద్–చేగుంట రోడ్డును కూడా రెండు వరుసలకు విస్తరించాలన్నారు. చేగుంట మండలంలోని 8 పంచాయతీల పరిధిలో రిజర్వ్ ఫారెస్టు భూమిని సాగుచేస్తున్నారంటూ రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదని రఘునందన్‌రావు సభలో ఫిర్యాదు చేశారు. -
పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే కొత్త విధానాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుండటంతో స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలశాఖ రూపొందించిన ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. ఈ నూతన విధానంలో భాగంగా స్థానిక మానవ వనరులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు జీఎస్టీలో రాయితీ, విద్యుత్ చార్జీల్లో ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా టీ ప్రైడ్, టీ ఐడియాలో భాగంగా పరిశ్రమలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తోంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలివే.. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన స్థానిక మానవ వనరులను ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా సంస్థల సహకారంతో అందించాలనేది ఈ పాలసీ ఉద్దేశం. అయితే మహారాష్ట్రలో 80 శాతం, ఏపీ, కర్ణాటకలో 75 శాతం, మధ్యప్రదేశ్‌లో 70 శాతం మేర స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ విధానంపై విమర్శ లు వస్తున్న నేపథ్యంలో రెండు కేటగిరీల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెమీ స్కిల్డ్ కేటగిరీలో 70 శాతం, స్కిల్డ్ కేటగిరీలో 60 శాతం స్థానికుల కు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తారు. టీ ప్రైడ్, టీ ఐడియాలలో ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలకు ఇవి అదనం. స్కిల్డ్ కేటగిరీలో మధ్య తరహా, భారీ పరిశ్రమలకు వ్యాట్/సీఎస్టీ/జీఎస్టీలో 10 శా తం రాయితీ ఇస్తారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి రాయితీలుండవు. విద్యుత్ ఖర్చు పరిహారానికి సంబంధించి సెమీ స్కిల్డ్ కేటగిరీలో ఐదేళ్ల వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు యూనిట్‌కు 50 పైసలు, స్కిల్డ్ కేటగిరీలో రూపాయి వంతున ప్రోత్సాహకం ఇస్తారు. మధ్య తరహా, భారీ పరిశ్రమలకు సెమీ స్కిల్డ్ కేటగిరీలో యూనిట్‌కు 75 పైసలు, స్కిల్డ్ కేటగిరీలో రూపాయి చొప్పున ఇస్తారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలో 5 శాతం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఒక్కో వ్యక్తికి చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రూ. 3 వేలు, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు రూ.5 వేలకు మించకుండా చెల్లిస్తారు. ఎలక్ట్రిక్ వాహన పాలసీకి ఆమోదం వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం, తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీ’ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. -
స్థానికులకు ఉద్యోగాలంటే ఐటీ కంపెనీలే రావు
-
1.7 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించాయ్
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వీసా ప్రొగ్రామ్స్ లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ దేశాలను ఆకట్టుకోవడానికి భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆసియా-పసిఫిక్ రీజన్ లో భారత కంపెనీలు భారీగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. తక్కువ మంది భారతీయులకు వర్క్ పర్మిట్స్ తో ఈ తొమ్మిది దేశాల్లో కనీసం 1.7 లక్షల మందికి భారతీయ కంపెనీలు ఉద్యోగాలు సృష్టించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP) ఒప్పందం కింద ఇటీవలే ఈ అంశం తెరపైకి వచ్చింది. చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియన్ దేశాలు ఈ ఒప్పందంలో భాగమై ఉన్నాయి. కేవలం భారతీయ నిపుణులు తమ ఆర్థికవ్యవస్థలకు సహకరించడమే కాక, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ వంటి టెక్ కంపెనీలు కూడా వేలకొలదీ ఉద్యోగాలను కల్పిస్తున్నాయని పేర్కొంది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ భారతీయ ఉద్యోగులకు షాకిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ నిపుణులను అనుమతించే విషయంలో సింగపూర్ తన కమిట్ మెంట్ ను మరిచిపోయిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆస్ట్రేలియా కూడా విదేశీయుల వీసాల్లో కఠినతరమైన రూల్స్ తీసుకొస్తోంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధానితో డైరెక్ట్ గా మన ప్రధాని నరేంద్రమోదీనే చర్చించారు. సంబంధిత వర్గాల సమాచారం మేరకు ఫిలిఫిన్స్ లో కార్యకలాపాలు నిర్వహించే దేశీయ ఐటీ సంస్థలు స్థానికంగా 60వేల ఉద్యోగాలు కల్పించినట్టు తెలిసింది. కానీ కేవలం 1500-2000 మందికే వర్క్ ఫర్మిట్స్ అవసరం పడినట్టు వెల్లడైంది.