Lohit
-
అప్పూ గురి తప్పదు!
చదువులోనైనా... చురుగ్గా వ్యవరించడం లోనైనా అప్పూ గురి తప్పదు! అంత తెలివై నోడు కాబట్టే 8 ఏళ్ల వయసులో ఏనుగును చూడాలని ఇంటి నుంచి ఒంటరిగా బయట అడుగు పెట్టినోడు క్షేమంగా ఇంటికొస్తాడు. ఈ మధ్యలో అప్పూ ఏం చేశాడనేది తెరపై చూపిస్తామంటున్నారు దర్శక–నిర్మాత కె. మోహన్. మాస్టర్ సాయి శ్రీవంత్ టైటిల్ రోల్లో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల సినిమా c జాకీ, లోహిత్, కావ్య, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది. చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె. మోహన్ మాట్లాడుతూ– ‘‘చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది?’’ అనే çకథతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు. బాలతారలుగా సుమిత్ జాషు, సాయి అభిషేక్, లాస్య, మేఘన, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాం తదితరులు నటించారు. -
ఒకరి కోసం ఒకరు..
నాయనా భోజనం తిందువు లేరా... ‘‘నాయనా లోహిత్ నేను ఉదయం పనికి వెళ్లినప్పుడు భోజనం పెట్టాను. మరి నేను ఇంటికి వచ్చాను భోజనం పెడతాను లేరా నా కొడుకూ..’’ అంటూ బిడ్డ మృతదేహం వద్ద తల్లి కుసుమ రోదించడం అందరి హృదయాలను కలచి వేసింది. విషాదానికే కన్నీళ్లు తెప్పించే ఘోరం.. కఠిన పాషాణమైనా విని కరిగి పోయేంత బాధ.. అయ్యో... ఎంతహృదయవిదార కం. తవణంపల్లె మండలం పోన్నేడు పల్లెలో శనివారం ఏనోట విన్నా.. ఏమనుసును కదిలించినా.. ఇదే వేదన. పుట్టినప్పటి నుంచి ఒక్కటిగా పెరిగిన ఆవూరి చిన్నారులు.. లోహిత్కుమార్, రాజ్‌కుమార్ మరణంలోనూ స్నేహబంధాన్ని విడువలేదు. తనకు ప్రమాదం తెలిసినా లోహిత్‌ను కాపాడేందుకు రాజ్‌కుమార్ నీటిలో దిగిపోరాడాడు. కానీ కనికరం లేని కసాయి నీటికుంట ఆ స్నేహితులిద్దరినీ పొట్టనపెట్టుకుంది. పైగా ఇద్దరు విద్యార్థులూ.. వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క మగ సంతానం కావడంతో పొన్నేడుపల్లె విషాదసంద్రంగా మారింది. తవణంపల్లె: తవణంపల్లె మండలం పొన్నేడుపల్లెలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోనూ, స్కూల్లోనూ కలసిమెలసి ఉల్లాసంగా గడిపే ఇద్దరు మిత్రులు(విద్యార్థులు) నీటిగుంటలో పడి మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. కళ్లముందర తిరుతున్న పిల్లలు గంట గడిచే లోపే మృతి చెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. పొన్నేడుపల్లెకు చెందిన ఎ.రవి,కుసుమలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే విధంగా అదే గ్రామానిక చెందిన యూగమూర్తి,రాజేశ్వరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రవి కుమారుడు లోహిత్కుమార్(12), యాగమూర్తి కుమారుడు రాజ్‌కుమార్(12) ఇద్దరు చిన్నప్పటి నుంచి మిత్రులు. ఇద్దరు చిత్తూరులో 7వ తరగతి చదువుతున్నారు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో సాయంత్రం సరదాగా సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్నారు. అనపగుట్ట వద్ద ఇద్దరు మిత్రులు బహిర్భూమికి వెళ్లారు. తర్వాత కాళ్లను శుభ్రం చేసుకోవడానికి లోహిత్కుమార్ ముందుగా హంద్రీనీవా కాలువలోకి వె ళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిగుంతలో పడ్డారు. లోహిత్కుమార్ను రక్షించడానికి రాజ్‌కుమార్ యత్నించాడు. ఈ క్రమంలో నీటిలో మునిగి ఇద్దరు మృత్యవాత పడ్డారు. నాన్నా నాకు ఇక దిక్కు ఎవరూ... కుటుంబానికి దిక్కు నీవే అనుకుంటే నాకంటే ముందుగా వెళ్లిపోయావా నాన్నా.. ఇక నాకు దిక్కు ఎవరంటూ మృతుడు రాజేష్‌కుమార్ తండ్రి యూ గమూర్తి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబానికి వారసుడని అంటే మా కు అందని దూరానికి వెళ్లిపోయావానాన్నా.. అంటూ దుక్కించడం చూపరులకు కంటతడి పెట్టించింది. తల్లి రాజేశ్వరి బిడ్డ మృతి సమాచారంతో అపస్మారక స్థితికి చేరుకుంది. తర్వాత ఆమెను అరగొండ అపోలో హాస్పిటల్ చేర్పించి వైద్యం అందించారు. -
కల గన్నావా.. బుజ్జి నాయనా..!
తొమ్మిదేళ్ల బాలుడు అప్పూకి ఏనుగంటే చాలా ఇష్టం. నగర జీవితంలో ఉరుకుల, పరుగుల ఉద్యోగాలు చేస్తూ క్షణం తీరిక లేని అప్పూ తల్లిదండ్రులకు కొడుక్కి ఏనుగుని చూపించే తీరిక ఉండదు. చివరికి, తానే ఏనుగును చూడడానికి స్నేహితులతో కలిసి ఓ అడవిలోకి వెళతాడు అప్పూ. అక్కడ అప్పూ బృందం ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఏనుగుని చూడగలిగారా? అనే అంశాలతో సాగే చిత్రం ‘అప్పూ’. ఉపశీర్షిక ‘ది క్రేజీ బాయ్’. టైటిల్ రోల్‌ను మాస్టర్ సాయి శ్రీవంత్, ముఖ్య పాత్రలను లోహిత్, ఆదిలాబాద్ గిరిజన నాయకుడు జాదవ్ కృష్ణ నాయక్, ఆయన తనయుడు మహేశ్ నాయక్ తదితరులు చేస్తున్నారు. మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై కె. మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను మోహన్ తెలియజేస్తూ -‘‘ఇటీవల ఆదిలాబాద్‌లోని కుంతాల జలపాతం సమీపంలో ‘కలగన్నావా.. బుజ్జి నాయనా..’, ‘ఏంటో కొత్తగా ఉందా ఈ లోకం..’ పాటల్లో కొంత భాగం చిత్రీకరించాం. మిగతా భాగం చిత్రీకరణ 26న మొదలుపెట్టబోతున్నాం. హైదరాబాద్, నర్సాపూర్‌లో జరిపే షెడ్యూల్స్‌తో చిత్రం పూర్తవుతుంది’’ అన్నారు. బండ జ్యోతి, కావ్య, బాల తారలు సాయి అభిషేక్, లాస్య, మేఘన, జాషువా, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాం కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం శ్రీ అందిస్తున్నారు. -
పెళ్లాడండి ప్రేమించాక మాత్రమే మూవీ ఆడియో లాంచ్