Lok Adalats
-
రేపు కోర్టుల్లో లోక్ అదాలత్
మచిలీపట్నం : జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 10వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు చెప్పారు. జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సివిల్, ప్రీలిటిగేషన్, బ్యాంకు వ్యాజ్యాలు, రోడ్డు ప్రమాదం కేసులు 2939 పరిష్కరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి రెండో శనివారం లోక్‌అదాలత్‌ను అన్ని కోర్టులలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం రామకృష్ణ లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కారం చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. సమావేశంలో లోక్‌అదాలత్ కార్యదర్శి రజని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్ పాల్గొన్నారు. -
అందరికీ న్యాయం అందాలి: మోదీ
న్యూఢిల్లీ: పేదలకు న్యాయం అందించడంలో లోక్ అదాలత్‌లు కీలక పాత్ర పోషించాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. 'పేదలకు న్యాయం ఎలా అందించాలనే దానిపై చర్చ జరుగడం నాకు ఆనందం కలిగించింది. ఇక్కడికి రావడం ద్వారా చాలా విషయాలు తెలుసుకోగలిగాను. పేదల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ, వారిలో సరైన అవగాహన కల్పించడం లేదు' అని ఆయన పేర్కొన్నారు. న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అందరికీ న్యాయం, అందరికీ అభివృద్ధి అందాలన్నదే తన అభిమతమని చెప్పారు. అందరికి చేయూత (సబ్ కా సాథ్), అందరి వికాసం (సబ్ కా వికాస్)తోపాటు అందరికీ న్యాయం (సబ్కా న్యాయ్) అందాలని చెప్పారు. అందరికీ న్యాయం అందించడంలో దేశంలోని న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని కోరారు. -
సత్వర న్యాయం కోసమే లోక్‌అదాలత్‌లు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్‌అదాలత్‌ల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. హైదరాబాద్ నగర సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ,ప్రగతి సేవాట్రస్టుల ఆధ్వర్యంలో ఆదివారం గౌలిపురా పటేల్‌నగర్ ప్లే గ్రౌండ్ లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ న్యాయస్థానానికి వచ్చేవారిని నిరుత్సాహపరిచేలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కక్షిదారులను ఒప్పించి తక్షణమే కేసులు పరిష్కరించడానికి లోక్‌అదాలత్‌లు ఉపకరిస్తాయన్నారు. విద్యాహక్కుపై అవగాహన పెంచుకోవాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు బస్తీల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. సదస్సులో రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రి బ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ, సిటీ సివిల్ కోర్టు తాత్కాలిక చీఫ్ జడ్జి ఆరవిందరెడ్డి, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జి. రాజగోపాల్, ప్రగతి సేవా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ బి. ప్రతిభ పాల్గొన్నారు. అలరించిన ‘సప్తస్వర సంగమం’: వనస్థలిపురం రాజీవ్‌గాంధీ పార్కులో ఆదివారం రాత్రి సప్తస్వర సంగమం వీనుల విందు చేసింది.సినీ,వర్ధమాన గాయనీగాయకులు సుమధుర గానంతో ఆహూతులను అలరించారు. యువ గాయకులు శ్రీనివాస్, కళ్యాణి, సాయికృష్ణ, శ్రీవిద్య, దివాకర్, పావని, సంపత్ పాల్గొన్నారు. సినీ నేపథ్య గాయకులు రావు బాలసరస్వతీదేవి, వి.రామకృష్ణ, వడ్డేపల్లి శ్రీనివాస్, డి.వి.మోహనకృష్ణ, మృదంగ విద్వాంసులు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావులను ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.చంద్రకుమార్ మాట్లాడుతూ మంచిపని ఏదైనా హృదయపూర్వకంగా, నిస్వార్థంగా చేయాలన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నవీన విద్యాసంస్థల చైర్మన్ సుభాన్‌రెడ్డి, సమాచార హక్కు కమిషనర్ విజయ్‌బాబు, కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, యువ నటులు కౌశిక్‌బాబు, ఆకృతి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నంత కాలం శాంతిభద్రతలు, భూములు, ఆదాయం వంటివాటిలో తమకూ వాటా ఉండాల్సిందేనని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేశారు. రాజధానిగా 5 లేదా 10 ఏళ్లున్నా అధికారాల విభజనకు అంగీకరించేది లేదని తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. ‘రెండు రాష్ట్రాలు-సామాజిక దృక్పథం’ పేరిట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్(టీఆర్ఎల్డీ), తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) సంయుక్తంగా ఆదివారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, టఫ్ కన్వీనర్ విమలక్క సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సదస్సులో లోక్‌సత్తా అధ్యక్షులు కఠారి శ్రీనివాసరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సీమాంధ్ర బీసీ జేఏసీ వేల్పూరి శ్రీనివాసరావు, బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, పూల రవీందర్, ప్రొఫెసర్లు కేశవరావు జాదవ్, పి.ఎల్.విశ్వేశ్వర్రావు, లక్ష్మణ్, టీఆర్ఎల్డీ అధ్యక్షులు కె.ఇందిర, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు చింత స్వామిమాదిగ, టీఆర్ఎల్డీ నేతలు సి.హెచ్.శేషగిరిరావు, రియాజ్, ప్రముఖ కవి గూడ అంజన్న, శ్రీధర్ ధర్మాసనం తదితరులు ప్రసంగించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ రాజ్యాధికారంలో వాటా లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. బీసీలకూ సబ్‌ప్లాన్‌ను, చట్టసభల్లో రిజర్వేషన్లను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక నుండి అమలుదాకా అగ్రవర్ణాలే అధిపత్యం వహిస్తున్నాయని, రాజకీయ చైతన్యంతోనే రాజ్యాధికారం వస్తుందన్నారు. తెలంగాణ ఆగదని, సమగ్ర అభివృద్ధి పైనే దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని సూచించారు. లోక్‌సత్తా అధ్యక్షులు కఠారి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యావకాశాలు పెరిగితేనే చైతన్యం, తద్వారా రాజకీయాధికారం, సామాజికన్యాయం సాధ్యమన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ విద్యావకాశాలను పెంచి, మానవ వనరుల్లో నాణ్యతను పెంచాలని సూచించారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం శాంతి భద్రతలు, భూములు, ఆదాయం వంటివాటిలో సీమాంధ్రకూ హక్కుంటే తప్ప సీమాంధ్రలో ఉద్యమాలు ఆగవన్నారు. సీమాంధ్ర రాజధానిలో మౌలిక సదుపాయాలకోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వమే అదనపు నిధులను కేటాయించాలని కోరారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని, అభద్రతా భావాన్ని పోగొట్టే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. సీమాంధ్ర బీసీ జేఏసీ అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దోపిడీకి అలవాటు పడిన సీమాంధ్ర సంపన్నులు, పెట్టుబడిదారులు తప్ప తెలంగాణ ఏర్పాటుకు సామాజిక వర్గాలు వ్యతిరేకంగా లేవన్నారు. ఎమ్మెల్సీ, టఫ్ సెక్రటరీ జనరల్ కె.దిలీప్‌కుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్ శాంతిభద్రతలు, భూములు, ఆదాయాల్లో హక్కులు పంచుతామంటే తెలంగాణ ప్రజలు అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. విభజనకు ముందుగానే నదీజలాల పంపకంపై స్పష్టమైన, నిర్దిష్టమైన ఒప్పందాలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు అన్యాయం జరుగకుండా చూడాల్సిన బాధ్యత అటు ఆంధ్రాపై, ఇటు తెలంగాణపై ఉమ్మడిగా ఉందన్నారు. అదనపు ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వమే సూపర్ న్యూమరరీ పోస్టులుగా గుర్తించాలని దిలీప్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా రాష్ట్ర విభజనకు ముందే సామాజిక వాటాను కూడా ప్రకటించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు ఆగదని, అప్పటిదాకా ఉద్యమకారులు కొంత సంయమనంతో ఉండాలని కోరారు. కేంద్ర మంత్రివర్గ బృందాన్ని కలసి ఇరుప్రాంతాల మధ్య ఉన్న భయాందోళనలను తొలగించాలని కోరినట్టుగా దిలీప్‌కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, కవి గూడ అంజన్న, ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్‌ను దిలీప్‌కుమార్, విమలక్క సన్మానించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో భారీ బంకర్ : చింతా స్వామిమాదిగ మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో బంకర్‌ను నిర్మించుకుంటున్నారని టీఆర్ఎస్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు చింతా స్వామిమాదిగ వెల్లడించారు. ఫాంహౌస్‌లో ఎకరం విస్తీర్ణానికి పైగా భారీగా బావిని తవ్వినట్టుగా ఒక పత్రికలోనూ వచ్చిందని గుర్తుచేశారు. వ్యవసాయ బావి అయితే ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌కు ఆనుకుని 40 ఎకరాలతో ప్రారంభమైన ఈ ఫాంహౌస్ చుట్టుపక్కల పేదలను బెదిరిస్తూ ఆక్రమించి, బలవంతంగా అమ్మించి ఇప్పుడు వందల ఎకరాలకు చేరుకున్నదని స్వామి ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో తెలంగాణకు కేంద్రంగా చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో పద్మనాభస్వామి ఆలయపు అనుభవాలను గుర్తుచేసుకోవాల్సి ఉంటుందని స్వామి అన్నారు. -
లోక్‌అదాలత్‌లతో సత్వర న్యాయం
నాందేవ్‌వాడ, న్యూస్‌లైన్ : రాజీమార్గాన్ని అనుసరించి లోక్‌అదాలత్‌ల ద్వారా సత్వర పరిష్కారం పొందవచ్చని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవ సంస్థ కార్యదర్శి మహ్మద్ బందేఅలీ అన్నారు. జిల్లా న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం బ్యాంకు లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ కోర్టుల్లో కేసు తీర్పులు వచ్చినప్పుడు గెలిచినవారు, ఓడిన వారు ఉంటారని, కానీ లోక్‌అదాలత్ తీర్పుల ద్వారా ఇరుపక్షాల వారు గెలుస్తారన్నారు. లోక్‌అదాలత్ తీర్పులు అంతిమమైనవని, అప్పీలుకు వీలు లేనివన్నారు. బ్యాంకుల రుణ రికవరీ కేసులలో లోక్‌అదాలత్‌లు నిర్వహించడం వల్ల అందరికీ లాభం చేకూరుతుందన్నారు. ఇలాంటి లోక్‌అదాలత్‌లలో బ్యాంకుల వారు వడ్డీమాఫీ, సులభ వాయిదాలు ఇచ్చే అవకాశాలుంటాయని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 38 కేసులు పరిష్కారం బ్యాంకు లోక్‌అదాలత్‌లో మొత్తం 38 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తులు మహ్మద్ బందేఅలీ, అమరావతిలు లోక్‌అదాలత్ బెంచీలకు అధ్యక్షత వహించి కేసులను పరిష్కరించారు. భారతీయ స్టేట్ బ్యాంకు వారు దాఖలు చేసిన కేసులలో 16 కేసులు పరిష్కారమయ్యాయి. దేనా బ్యాంకు వారు దాఖలు చేసిన కేసులలో 22 కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యాయి. మొత్తం 38 కేసులలో లోక్‌అదాలత్ శనివారం రాజీ అవార్డులను జారీ చేసింది. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌సుబేదార్, న్యాయవాది అంకిత లోక్‌అదాలత్ సభ్యులుగా వ్యవహరించారు. బ్యాంకు అధికారులు రాజేంద్రబాబు, వెంకటేశ్వరరావు, గిరిధర్‌గౌడ్, విజయచౌహన్, దేనాబ్యాంకు లీగల్ అడ్వయిజర్ సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.