రేపు కోర్టుల్లో లోక్ అదాలత్
రేపు కోర్టుల్లో లోక్ అదాలత్
Published Thu, Sep 8 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
మచిలీపట్నం : జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 10వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు చెప్పారు. జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సివిల్, ప్రీలిటిగేషన్, బ్యాంకు వ్యాజ్యాలు, రోడ్డు ప్రమాదం కేసులు 2939 పరిష్కరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి రెండో శనివారం లోక్‌అదాలత్‌ను అన్ని కోర్టులలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం రామకృష్ణ లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కారం చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. సమావేశంలో లోక్‌అదాలత్ కార్యదర్శి రజని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement