Lokesh birthday celebrations
-
విశ్వవిద్యాలయమా? టీడీపీ కార్యాలయమా?
► ఎస్వీయూలో నారా లోకేష్ జన్మదిన వేడుకలపై విద్యార్థుల నిరసన ► వీసీ టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపణ చిత్తూరు: ఎస్వీయూ వీసీ దామోదరం టీడీపీ ఏజెంట్లా వ్యవహరిస్తూ యూనివర్సిటీని పార్టీ కార్యాలయంగా మార్చారని విద్యార్థులు నిరసన వ్యక్తంచేశారు. శనివారం ఎస్వీయూలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వీసీ దామోదరం హాజరై కేక్ కట్ చేయడం, రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ ఎం.భాస్కర్ పాల్గొనడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ విద్యార్థి సంఘం ఆదివారం ఎస్వీయూ పరిపాలన భవనం ఎదుట ఆందోళన నిర్వహించింది. వీసీ, రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదంటూ గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అలాంటప్పుడు ఎలాంటి ప్రభుత్వ పదవి లేని నారా లోకేష్ జన్మదిన వేడుకలకు అ నుమతి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో రాజకీయ జోక్యం ఉండదని వీసీ దామోదరం బాధ్యతలు స్వీకరించిన రోజు ప్రకటించారని, అయితే ఆయనే స్వయంగా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ కార్యక్రమాలను ఆయనే దగ్గర ఉండి చేయిస్తున్నారని ఆరోపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయం తి శనివారమే అయినప్పటికీ ఆయనకు నివాళి అర్పించకపోవడం దారుణమన్నారు. వీసీ, రిజిస్ట్రా ర్ వ్యవహార తీరుపై గవర్నర్, లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాయకులు హేమంత్‌యాదవ్, మురళీధర్, కిషోర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, తేజేష్‌రెడ్డి,ప్రదీప్, హేమంత్‌రెడ్డి, మదన్, సంతోష్‌రెడ్డి, మౌలాలీ, సంతోష్ పాల్గొన్నారు. -
‘దేశం’లో వర్గ పోరు
పీలేరు నియోజక వర్గంలో పోటాపోటీగా లోకేష్ జన్మదిన వేడుకలు సుగుణమ్మ నామినేషన్‌కు సీనియర్ నేతలు డుమ్మా పలు నియోజక వర్గాల్లో ముదిరి పాకానపడుతున్న వర్గ విభేదాలు ఆందోళన చెందుతున్న అధిష్టానం తిరుపతి: జిల్లాలో తెలుగుదేశం పార్టీ వర్గ రాజకీయాలు రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో బహిరంగానే నేతలు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా చేపడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ఇటీవల పీలేరు నియోజకవర్గంలో చోటుచేసుకొన్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. శక్రవారం జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పార్టీలో విభేదాలు బట్టబయలయ్యాయి.. పీలేరు, కలికిరి, కలకడ మండలాల్లో లోకేష్ జన్మదిన వేడుకలను డాక్టర్ ఇక్బాల్, మల్లారపు రవికుమార్ నాయుడు పోటాపోటీగా నిర్వహించారు. ఇంతకు మునుపు నెలరోజుల క్రితం సైతం నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని పీలేరులో నిర్వహించకండా మదనపల్లెలో నిర్వహించారు. అక్కడ సమావేశం నిర్వహిస్తే పార్టీలోని రెండువర్గాల మధ్య గొడవలు జరుగుతాయని ముందు జాగ్రత్తగా సమావేశాన్ని మదనపల్లెకు మార్చినా పార్టీలో నేతల మధ్య తన్నులాట మాత్రం ఆగలేదు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు సమక్షంలోనే అక్కడ ముష్టియుద్ధాలు కూడా జరిగాయి. అయినప్పటికీ అధిష్టానం దిద్దుబాటు చర్యలను చేపట్టకపోవడం వల్లే మళ్లీ లోకేష్ జన్మదిన వేడుకలను సైతం నియోజకవర్గంలోని రెండు వర్గాలు పోటాపోటీగా జరిపాయని ఆ పార్టీలోని కొంతమంది నేతలు పెదవి విరుస్తున్నారు. సుగుణమ్మ నామినేషన్‌కు సీనియర్ నేతల డుమ్మా తిరుపతి నియోజకవర్గ ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మ శుక్రవారం నామినేషన్‌ను వేశారు. ఈ కార్యక్రమానికి గల్లా అరుణకుమారి తదితర పార్టీ సీనియర్ నేతలు హాజరు కాకపోవడం దేశం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ముఖ్య నేతల మధ్య సమన్వయం కొరవడిందని అందువల్లే నామినేషన్‌కు రాలేదని పార్టీ జోరుగా చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ పదవికి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి పోటీపడుతూ ఇప్పటికే వర్గాలు విడిపోయినట్లు పార్టీలో నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.. మొత్తం మీద జిల్లాలో తెలుగు దేశం నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయి. పార్టీ అధినేత రంగంలోకి దిగి పార్టీకి కాయకల్ప చికిత్స చేయకపోతే పార్టీ పరుపు మంట కలవడం ఖాయమని నాయకులు ఆందోళన చెందుతున్నాయి.