విశ్వవిద్యాలయమా? టీడీపీ కార్యాలయమా?
► ఎస్వీయూలో నారా లోకేష్ జన్మదిన వేడుకలపై విద్యార్థుల నిరసన
► వీసీ టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
చిత్తూరు: ఎస్వీయూ వీసీ దామోదరం టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తూ యూనివర్సిటీని పార్టీ కార్యాలయంగా మార్చారని విద్యార్థులు నిరసన వ్యక్తంచేశారు. శనివారం ఎస్వీయూలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వీసీ దామోదరం హాజరై కేక్ కట్ చేయడం, రిజిస్ట్రార్ దేవరాజులు, రెక్టార్ ఎం.భాస్కర్ పాల్గొనడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ విద్యార్థి సంఘం ఆదివారం ఎస్వీయూ పరిపాలన భవనం ఎదుట ఆందోళన నిర్వహించింది.
వీసీ, రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదంటూ గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అలాంటప్పుడు ఎలాంటి ప్రభుత్వ పదవి లేని నారా లోకేష్ జన్మదిన వేడుకలకు అ నుమతి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో రాజకీయ జోక్యం ఉండదని వీసీ దామోదరం బాధ్యతలు స్వీకరించిన రోజు ప్రకటించారని, అయితే ఆయనే స్వయంగా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
అధికార పార్టీ కార్యక్రమాలను ఆయనే దగ్గర ఉండి చేయిస్తున్నారని ఆరోపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయం తి శనివారమే అయినప్పటికీ ఆయనకు నివాళి అర్పించకపోవడం దారుణమన్నారు. వీసీ, రిజిస్ట్రా ర్ వ్యవహార తీరుపై గవర్నర్, లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాయకులు హేమంత్‌యాదవ్, మురళీధర్, కిషోర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, తేజేష్‌రెడ్డి,ప్రదీప్, హేమంత్‌రెడ్డి, మదన్, సంతోష్‌రెడ్డి, మౌలాలీ, సంతోష్ పాల్గొన్నారు.