Long Term Equity
-
దీర్ఘకాలిక పెట్టుబడులకు చాన్స్!
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తున్న భారత్ మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్– భారత్ బాండ్ ఈటీఎఫ్ నాల్గవ విడతను ప్రభుత్వం శుక్రవారం నుండి ప్రారంభించనుంది. ఈటీఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని, డిసెంబర్ 8న సబ్‌స్క్రిప్షన్‌కు గడువు ముగుస్తుందని ఫండ్‌ను నిర్వహించే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సేకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) మూలధన వ్యయాల కోసం వినియోగిస్తారు. రూ.4,000 కోట్ల వరకూ సమీకణ.. ఈ కొత్త భారత్ బాండ్ ఈటీఎఫ్ ఏప్రిల్ 2033లో మెచ్యూర్ అవుతుంది. నాల్గవ విడతలో ఈ కొత్త సిరీస్ ద్వారా, రూ. 4,000 కోట్ల గ్రీన్ షూ ఎంపికతో (ఓవర్ అలాట్ మెంట్ ఆఫర్) రూ. 1,000 కోట్ల ప్రారంభ మొత్తాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం మూడో విడతను రూ. 1,000 కోట్ల బేస్ ఇష్యూ పరిమాణంతో ప్రారంభించింది. 6,200 కోట్ల విలువైన బిడ్లు రావడంతో ఇది 6.2 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ 2019లో ప్రారంభమైంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 12,400 కోట్లను సమీకరించడంలో సహాయపడింది. రెండు, మూడో విడతల్లో వరుసగా రూ.11,000 కోట్లు, రూ.6,200 కోట్ల సమీకరణలు జరిగాయి. ఈటీఎఫ్ తన మూడు ఆఫర్లలో ఇప్పటివరకు రూ.29,600 కోట్లు సమీకరించింది. మరిన్ని విశేషాలు ఇవీ.. ► భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రభుత్వ రంగ కంపెనీల ‘ఎఎఎ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. ► 2019లో ప్రారంభించినప్పటి నుండి, ఈటీఎఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) విలువ రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. ► ఇప్పటివరకు, భారత్ బాండ్ ఈటీఎఫ్ ఐదు మెచ్యూరిటీలతో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరాలు వరుసగా 2023, 2025, 2030, 2031, 2032గా ఉన్నాయి. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇష్యూకు మెచ్యూరిటీ సమయం 2033 ఏప్రిల్. భారీ స్పందన.. భారత్ బాండ్ ఈటీఎఫ్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుండి మంచి ప్రతిస్పందనను సంపాదించింది. భారత్ బాండ్ ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి, భారతదేశ వృద్ధి బాటకు పటిష్టత ఇవ్వడానికి పెట్టుబడిదారులందరికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని సృష్టించింది – తుహిన్ కాంత పాండే, దీపం కార్యదర్శి లక్ష్యాల ప్రకారం.. మెచ్యూరిటీ ఎంపిక ఎడెల్వీస్ మూచువల్ ఫండ్ భారత్ బాండ్ ఈటీఎఫ్‌ను ప్రారంభించిన తర్వాత టార్గెట్ (లక్ష్యాలకు అనుగుణంగా) మెచ్యూరిటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే వర్గం ఉత్సాహభరిత రీతిలో వేగంతో పెరుగుతోంది. దీర్ఘకాలిక రుణంలో పెట్టుబడులకు ఈ ఫండ్ సౌలభ్యంగా ఉంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఇప్పుడు ఆరు మెచ్యూరిటీలను కలిగి ఉంది. 2023 నుండి 2033 వరకు పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యాల ప్రకారం సరైన మెచ్యూరిటీని ఎంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. – రాధికా గుప్తా, ఎడెల్వీస్ ఫండ్ ఎండీ, సీఈఓ -
ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే డెట్ ఫండ్స్ మెరుగైనవా?
ఇండెక్స్ ఫండ్స్‌లో రాబడులు ఎంత? బ్యాంకు ఎఫ్‌డీల కంటే మీడియం లాంగ్, మీడియం డ్యురేషన్ ఫండ్స్ మెరుగైనవా? – కీర్తి నందన Fixed Deposits and Debt funds : భద్రత పాళ్లు అధికంగా ఉండే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను (ఎఫ్డీలు) డెట్ ఫండ్‌తో పోల్చి చూడడం సరికాదు. ఎఫ్డీలపై రాబడులు దాదాపుగా గ్యారంటీడ్ (హామీతో కూడిన)గా ఉంటాయి. బ్యాంకులు సంక్షోభంలో పడితే డిపాజిటర్ల డబ్బులు (గరిష్టంగా రూ.5లక్షల వరకు) 90 రోజుల్లోపు చెల్లించేలా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డెట్ ఫండ్స్‌పై రాబడుల విషయంలో ఎటువంటి హామీ లభించదు. రాబడుల విషయంలో ఏ మ్యూచువల్ ఫండ్‌కూడా హామీ ఇవ్వదు. కాకపోతే పెట్టుబడులను నష్టపోకుండా స్థిరమైన రాబడులకు అయితే అవకాశం ఉంటుంది. కానీ మీడియం లేదా లాంగ్ డ్యురేషన్ (కాల వ్యవధి) ఫండ్స్‌కు ఇది వర్తించదు. కొన్ని ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ పడిపోదు. ఉదాహరణకు ఓవర్‌నైట్ ఫండ్స్‌లో రాబడులు సేవింగ్ ఖాతా కంటే ఎక్కువ ఉండవు. అల్ట్రా షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్ ఫండ్స్ అన్నవి ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరే, కొన్ని సందర్భాల్లో కొంచెం అధిక రాబడులను ఇచ్చే విధంగా పనిచేస్తాయి. స్వల్ప కాలానికి ఎఫ్డీలతో ఈ ఫండ్స్‌ను పోల్చి చూడొద్దు. ఎందుకంటే కొన్ని డెట్ ఫండ్స్ స్వల్పకాలంలో విలువను కోల్పోవచ్చు. 2–4 ఏళ్ల కాలానికి అయితే ఎఫ్‌డీల కంటే అధిక రాబడులు అందుకోవచ్చు. ఇక పన్ను చెల్లింపు రెండో అంశం అవుతుంది. ఎఫ్డీలు, డెట్ ఫండ్స్ రాబడులపై పన్ను వేర్వేరుగా ఉంటుంది. డిపాజిట్లపై వచ్చే ఆదాయానికి ఏటా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అది వెనక్కి తీసుకున్నా లేదా క్యుములేటివ్ అయినా ఇదే వర్తిస్తుంది. డెట్ ఫండ్స్‌లో రాబడులపై పన్ను అన్నది విక్రయించిన తర్వాతే అమల్లోకి వస్తుంది. మూడేళ్లకు పైగా డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను కొనసాగించినట్టయితే.. రాబడుల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాత పన్ను చెల్లిస్తే చాలు. ఈ ప్రయోజనాల వల్ల దీర్ఘకాలంలో ఎఫ్‌డీల కంటే డెట్ ఫండ్స్‌లో కాస్త మెరుగైన రాబడులు అందుకోగలరు. పదిహేనేళ్ల కాలానికి పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా సెన్సెక్స్ లేదా నిఫ్టీ ఫండ్ ఏదైనా ఉందా? 16 నుంచి 17 శాతం వార్షిక రాబడులు రావాలి. అది కూడా రోజువారీగా ఆ పథకాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉండకూడదు? – ఆర్ఎస్ దహియా వచ్చే 15 ఏళ్ల కాలానికి నిఫ్టీ లేదా సెన్సెక్స్ 16–17 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇస్తాయే, లేదో నాకు తెలియదు. ఒకవేళ వడ్డీ రేట్లు 5–7 శాతం స్థాయికి పరిమితమైతే అప్పుడు వార్షిక రాబడులు 12 శాతం ఉన్నా కానీ మెరుగైనవే. సుదీర్ఘకాల చరిత్ర ఉన్న ఇండెక్స్ ఫండ్ పనితీరును గమనిస్తే.. చాలా ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. కానీ, గత పనితీరు అన్నది భవిష్యత్తుకు సంకేతం కాదు. రానున్న కాలంలో భిన్నమైన పనితీరును చూపించే అవకాశం కూడా లేకపోలేదు. నిఫ్టీ, సెన్సెక్స్ గురించి మాట్లాడుతుంటే అది లార్జ్‌క్యాప్ కంపెనీల గురించే. సాధారణ మార్కెట్‌కు అనుగుణంగానే లార్జ్‌క్యాప్ కంపెనీల పనితీరు ఉంటుంది. సెన్సెక్స్‌లోని కొన్ని కంపెనీలు అసాధారణ పనితీరు చూపించొచ్చు. కొన్ని నిరుత్సాహపరచొచ్చు. ఇండెక్స్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే రాబడులు దీర్ఘకాలంలో సహేతుకంగా ఉంటాయి. అంతేకాదు స్థిరాదాయ పథకాల కంటే అధికంగా, ద్రవ్యోల్బణం కంటే ఎక్కువే ఉంటాయి. కనుక ఆ రాబడులు మంచివే. - ధీరేంద్రకుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి: Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం -
బ్యాంక్ ఎఫ్‌డీయా? డెట్ ఫండా?
నేను ప్రస్తుతం క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇటీవలే నిఫ్టీ బిఈఈఎస్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తున్నాను. ఇది మంచి రాబడినే ఇస్తోంది. ఈ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటా రా? సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్, బీఎన్పీ పారిబస్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌ల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ రెండు ఒకే ఫండ్ హౌస్‌కు చెందినవా? - జానకి, అమలాపురం ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంత రాబడి పొందవచ్చో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. నిఫ్టీ ఇండెక్స్‌ను పూర్తిగా ప్రతిబింబించే నిఫ్టీ బీఈఈఎస్ ఈటీఎఫ్ -నిఫ్టీ లాగానే రాబడులందిస్తోంది. అంతేకాకుండా భారత్‌లో అత్యంత తక్కువ వ్యయాలున్న ఫండ్ కూడా ఇదే. దీని ఎక్స్పెన్స్ రేషియో 0.5 శాతంగా ఉంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇండెక్స్ ఫండ్ సరైనది కాదని చెప్పవచ్చు. పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నిఫ్టీ కంటే డైవర్సిఫైడ్ ఫండ్లు ఉత్తమమని చెప్పవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మూడు ఫండ్స్- క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ డైనమిక్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీలు దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి ఫండ్స్ అని పేర్కొనవచ్చు. ఇక బీఎన్పీ పారిబస్, సుందరం సెలెక్ట్ మిడ్‌క్యాప్‌లు ఒకే కంపెనీకి చెందిన ఫండ్స్ కావు. బీఎన్పీ పారిబస్, సుందరం సంస్థలు గతంలో జాయింట్ వెంచర్‌ను నిర్వహించాయి. కొన్నేళ్ల కితం ఈ జాయింట్ వెంచర్‌ను ఈ రెండు సంస్థలు రద్దు చేసుకున్నాయి. ఇవి రెండు విభిన్నమైన ఫండ్లు. మంచి రాబడులనే ఇస్తున్నాయి. డెట్ ఫండ్స్ గురించి వివరించండి. వీటికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకు తేడా ఏమిటి? - రమేశ్, జగిత్యాల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో గ్యారంటీ రాబడులు వస్తాయి. ఎంత రాబడులు వస్తాయో ముందే తెలుస్తుంది. మరోవైపు డెట్ ఫండ్స్‌ల్లో రాబడులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే ఎక్కువ రావచ్చు. లేదా తక్కువ రావచ్చు. అయితే ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా తేడా బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా స్వల్పంగానే ఉంటుంది. డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్. అంటే మీరు ఈ ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే రావు. వివిధ రకాల డెట్‌ఫండ్స్ విషయానికొస్తే, లిక్విడ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నష్టాలు రావడమనేది చాలా అరుదు. అయితే బాండ్ ఫండ్స్‌ల్లో మాత్రం వడ్డీరేట్లు పెరిగితే బాండ్ ఫండ్స్ విలువ తగ్గుతుంది. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్ విషయానికొస్తే, ఈ ఫండ్ వల్ల మీకు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ విషయానికొస్తే, దీనిపై వచ్చే వడ్డీ మీ ఆదాయానికి కలిపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలానికి మించి కొనసాగిస్తే, వాటిపై వచ్చే రాబడులను క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. నేను నెలకు రూ.10,000 మొత్తాన్ని 10-15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఏడాదికి ఎల్ఐసీ జీవన్ ఆనంద్ కింద రూ.42,000, పీపీఎఫ్ కింద రూ.10,000 చొప్పున చెల్లిస్తున్నాను. రెలిగేర్ నుంచి రూ.50 లక్షల టెర్మ్ప్లాన్ను తీసుకున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి తగిన ఫండ్స్ సూచించండి? - జాన్ పాషా, నిజామాబాద్ మీ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏమంటే, ఒక అత్యవసర ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడం. ఏ సమయంలోనైనా వెంటనే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకునేలా ఈ ఫండ్ ఉండాలి. ఇది కాకుండా, ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇక టెర్మ్ ప్లాన్‌ను కొనసాగించండి. ఎల్ఐసీ జీవన్ ఆనంద్, పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, 10-15 కాలానికి ఏదైనా ఒకటే. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ అనేది యులిప్(యూ నిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్). బీమా లేదా ఇన్వెస్ట్మెంట్ పూర్తి ప్రయోజనాలను ఇది ఇవ్వలేదని చెప్పవచ్చు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు పీపీఎఫ్ కూడా సరైనది కాదని నేను భావిస్తున్నాను. మరోవైపు ఏవైనా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. మ్యూచువల్ ఫండ్స్‌పై మీకు సరైన అవగాహన వచ్చాకే పూర్తి స్థాయి ఈక్విటీ ఫండ్స్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లించండి. మీరు ఎంచుకోవడానికి ఉన్న కొన్ని ఆప్షన్లలో టాటా బ్యాలెన్స్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాండేజ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించండి.