loopholes
-
లోపాల్ని సరిదిద్దుకోవాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష విధానానికి సంబంధించిన లోపాలను (సరిదిద్దాలని) నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. మున్ముందు ఇలాంటి లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అటు కేంద్రంతోపాటు ఎన్టీఏను మందలించింది. ఈ మేరకు నీట్ యూజీ పేపర్‌లీక్‌పై దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. శుక్రవారం తుది తీర్పు వెలువరించింది.పేపర్‌లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని, కేవలం పాట్నా, హజారీబాగ్‌కే పరిమితమని సుప్రీం వ్యాఖ్యానించింది. అందుకే నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసంన సమగ్ర తీర్పు వెల్లడించింది.నీట్ వంటి జాతీయ పరీక్షలో ఇలాంటి 'ఫ్లిప్ ఫ్లాప్స్'ను నివారించాలని, ఇవి విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఆరోపణలు, ఇతర అవకతవకలపై వివాదం చెలరేగినప్పటికీ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను వెలువరిస్తూ, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిందిపరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని పేర్కొంది. ఎన్టీఏ స్ట్రక్చరల్ ప్రాసెస్‌లోని లోపాలన్నింటినీ తమ తీర్పులో ఎత్తిచూపినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం లోపాలను భరించలేమని స్పష్టం పేర్కొంది. తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈసందర్భంగా ఎన్టీఏ పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం కేంద్రం నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను సెప్టెంబర్ 30 లోపు కోర్టుకు సమర్పించాలి. ఈ కమిటీ మొత్తం పరీక్ష ప్రక్రియను విశ్లేషించి, పరీక్ష విధానంలో లోపాలను సరిచేసి, ఎన్టీఏ మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమయ్యే మార్పులను సూచించాలి. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే విషయంపై కేంద్రం, విద్యాశాఖ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి.అర్హత పరీక్షల నిర్వహణకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం లేదా ప్రోటోకాల్‌ను రూపొందించడం,పరీక్షా కేంద్రాల కేటాయింపు, మార్పు ప్రక్రియను సమీక్షించాలి.అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి కఠినమైన విధానాలను సిఫార్సు చేయాలి.అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలి.ట్యాంపరింగ్ ప్రూఫ్ ప్రశ్నపత్రాల కోసం యంత్రాంగాలను సమీక్షించాలి. సూచనలు ఇవ్వాలి.పరీక్షా కేంద్రాల్లో క్రమం తప్పకుండా ఆడిట్లు, తనిఖీలు నిర్వహించాలి. -
అక్రమాలకు చెక్ ....గోధుమల ఎగుమతికి ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ ఎగుమతులు పడిపోయిన సంగతి తెలిసింది. అదీగాక ఇతర దేశాలలో పంటలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంతో యావత్ ప్రపంచం గోధుమల కోసం భారత్‌వైపే చూసింది. అందుకు అనుగుణంగా భారత్ కూడా సుమారు 10 మిలయన్ల వరకు గోధులమలను ఎగుమతి చేయాలని అనుకుంది గానీ జాతీయ ఆహార భద్రతా దృష్ట్యా నిలిపేసింది. ఈ మేరకు భారత్ మే 13న గోధుమల ఎగుమతిని నిషేధించిన సంగతి తెలసిందే. అంతేకాదు కేంద్రం గోదుముల నిషేధం అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను మాత్రమే అనుమతించాలని నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ప్రైవేట్ ఎగుతిదారులు ఈ నిబంధను క్యాష్ చేసుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా కఠినతరమైన నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గోధుమలు ఎగుమతి చేసే ముందు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని తెలిపింది. అంతేకాదు అర్హత ఉన్న ఎగుమతిదారుల విషయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల (ఆర్సీలు) జారీకి ప్రాంతీయ అధికారులు డ్యూ డిలిజెన్స్' పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలామటుకు నిషేధాన్ని తప్పించుకునే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సి)ని మే 13కి ముందు తేదిని ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేలా తనిఖీలు తప్పనసరి అని స్పష్టం చేసింది. ప్రాంతీయ అధికారులు ఆమెదించిన లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తేదికి సంబంధిత బ్యాంకులకు సంబంధించిన స్విఫ్ట్ లావాదేవీల తేదితో సరిపోల్చాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ ఎగుమతిదారులు సీబీఐ విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాంకర్లకు ఏ దశలోనైనా ఏదైన సమస్య తలెత్తినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేసే ప్రయత్నాలలో భాగంగా ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఆమోదం కోసం ఇద్దరు సభ్యుల ఉన్న కమిటీకి పంపబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఐతే ఈ కమిటీ క్లియరన్స్ ఇచ్చిన తర్వాతే ప్రాంతీయ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేస్తారని వెల్లడించింది. (చదవండి: గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం) -
లొసుగుల్ని వాడుకుంటున్నాయి
సాక్షి, హైదరాబాద్ : చట్టంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకుని నిధుల సమీకరణ చేస్తున్న రాజకీయపార్టీలపై చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ నిధుల కోసం టీఆర్ఎస్ చేసిన నిధుల సేకరణ ఎన్నికల సంఘం మార్గదర్శకాల పరిధిలోకి వస్తుందో లేదో కూడా తేల్చాలని ఆయన పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, న్యాయమూర్తి జస్టిస్ సి.హరిశంకర్ల ధర్మాసనం పిటిషన్లో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ అభిప్రాయానికి రావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పార్టీ ప్లీనరీ నిమిత్తం ‘బంగారు కూలీ’పేరుతో టీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి రూ.లక్షలు వసూలు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. -
బ్యాంక్‌కు బురిడీ.. దర్యాప్తు కొరవడి
ఆకివీడు కార్పొరేషన్ బ్యాంక్‌లో బంగారం చోరీ వెనుక అనుమానాలెన్నో దొంగ చేతికి తాళాలు ఇచ్చిందెవరు తెరవెనుక ఉన్నదెవరు పోలీస్ దర్యాప్తు ముగించేశారెందుకో ఏలూరు : ఆకివీడు కార్పొరేషన్ బ్యాంక్‌లో 3 కేజీలకు పైగా బంగారు ఆభరణాలను మాయం చేసిన కేసులో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆ బ్యాంక్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న అప్రైజర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు విషయంలో చేతులు దులిపేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంక్ లాకర్ తాళాలు కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన అప్రైజర్‌కు ఎలా ఇస్తారు, అతడు పెద్దఎత్తున బంగారు ఆభరణాలను తీసుకుపోతుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు, వేరొకరి సాయం లేకుండానే అప్రైజర్ ఇలా చేయగలడా, ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. బ్యాంక్ అధికారుల ‘ఒత్తిళ్లు‘ పోలీసులపై బాగా పని చేశాయని, వారు తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి అప్రైజర్‌ను బలి పశువును చేశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. బ్యాంక్‌లో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పరిశీలన జరుపుతామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రకటించారు. అయితే, పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా అప్రైజర్ అరెస్ట్‌ను అంత హడావుడిగా చూపాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 6న కార్పొరేషన్ బ్యాంక్ ఆకివీడు బ్రాంచి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. దీంతో క్షేత్రస్థాయి అధికారి కల్యాణ్ ఆనంద్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇతను కొత్తగా చేరాడని పోలీసులు చెబుతున్నారు. కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగే బ్యాంక్‌లో బ్రాంచి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఒకేరోజు సెలవు పెట్టడం, అదే రోజున బంగారం పోవడం అనుమానాలకు తావిస్తోంది. పమిడి లక్ష్మీనారాయణ అనే ఖాతాదారుడు తాను తనఖా పెట్టిన నగలు విడిపించుకునేందుకు వచ్చిన సమయంలో లాకర్ తాళాలను బ్యాంక్ ఇన్చార్జి అప్రైజర్‌కు ఎలా ఇచ్చాడనే దానికి సమాధానం లేదు. అప్రైజర్ బ్యాంక్ మేనేజర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నందునే అతనిపై నమ్మకంతో బ్యాంక్ తాళాలు ఇచ్చినట్టు సిబ్బంది చెబుతున్నారు. దీనిని అలుసుగా తీసుకుని నగలు చోరీ చేశాడనేది పోలీసుల కథనం. బ్యాంక్ ఉద్యోగికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన తర్వాత.. తిరిగి బాధ్యతలు తీసుకునే సమయంలో అన్ని వస్తువులు, నగదు సక్రమంగా ఉన్నాయా అన్నది పరిశీలించాల్సిన బాధ్యత బ్యాంక్ మేనేజర్ లేదా అసిస్టెంట్ మేనేజర్‌పై ఉంటుంది. అయితే 14 రోజుల తర్వాత మరో బ్యాంక్ ఖాతాదారుడు వచ్చి తనఖా పెట్టిన బంగారం తీసుకునే వరకూ బ్యాంక్‌లోని నగలు మాయమయ్యాయనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంక్‌లో పైస్థాయి ఉగ్యోగులు ఇటీవల ఏలూరుతోపాటు పలు నగరాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ బ్యాంక్‌లో వ్యవహారాలన్నీ అప్రైజరే చక్కదిద్దేవారని, ఈ కారణంగానే కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగులు అతడు చెప్పినట్టు చేయాల్సి వచ్చిందనేది మరో వాదన. ఈ వ్యవహారం బయటకి పొక్కడంతో ఆకివీడు బ్రాంచి మేనేజర్ ఫిర్యాదు చేయడానికి సిద్ధపడినా వద్దని, అతనిపై అనుమానంతో విజయవాడ జోనల్ కార్యాలయం నుంచి వచ్చిన చీఫ్ మేనేజర్ బాలాజీరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, అప్రైజర్పైనే నెపం మోపి మిగిలిన వారిని కాపాడారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంక్ అధికారుల సహకారం లేకుండా స్ట్రాంగ్ రూమ్ తాళాలు అప్రైజర్‌కు ఎలా అందుతాయని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్‌లో అప్రైజర్ తల్లి పేరున లాకర్ ఉందని, ఆ లాకర్ తెరవడానికి వచ్చినపుడు అప్రైజర్ కూడా లోపలకు వె ళ్లి బంగారు ఆభరణాలను తన లాకర్లోకి మార్చుకుని, తర్వాత బయటకు తీసుకువెళ్లాడనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. బ్యాంక్‌లో విలువైన దస్తావేజులు కూడా కనిపించడం లేదన్న ప్రచారం సాగుతోంది. దీనిపై బ్యాంక్ అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి ఇంటి దొంగల పనిపట్టాలని బ్యాంక్ ఖాతాదారులు కోరుతున్నారు. -
పనిసరే.. పైసలేవీ!
► బకాయిల కోసం 12 లక్షల మంది ఉపాధి కూలీల ఎదురుచూపులు ► రెండు నెలలుగా రూ. 310 కోట్ల బకాయిలు ► కరువు కాలంలో పనుల్లేక తల్లడిల్లుతున్న పేదలు ► ఉపాధి కూడా ఆదుకోకపోవడంతో అరిగోస ► గ్రామాల్లో పథకంపై సన్నగిల్లుతున్న నమ్మకం ► డబ్బులివ్వకపోవడంతో పట్టణాలకు వలసబాట ► చట్టం ప్రకారం పనిచేసిన 15 రోజుల్లో డబ్బులివ్వాలి ► సర్కారు నిర్లక్ష్యంతో ఎక్కడా అమలుకాని నిబంధన ఈమె పేరు ఒర్సు సక్కుబాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం. రెండు నెలల క్రితం చేసిన పనికి ఇప్పటివరకు డబ్బులు రాలేదు. ఈమెకు రూ.2,260, భర్తకు రూ.2 వేల బకాయిలు రావాలి. రెక్కాడితేగానీ డొక్కాడని ఈ కుటుంబం డబ్బులందక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ‘‘డబ్బులిస్తే బియ్యం కొనుక్కునేటోళ్లం. అప్పు చేసి ఇంటి సామాన్లు తెచ్చుకుంటున్నాం. పైసలడిగితే రేపుమాపు అంటున్నారు’’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తోంది! ఈమె పేరు పెంటగాని పద్మ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్. ఉపాధి పనులు చేసినా డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళా సంఘం నుంచి అప్పు తీసుకుంది. ఇప్పుడు వాళ్లు డబ్బులు కట్టాలని అడుగుతుండడంతో తలపట్టుకుంది. ‘బయట కూడా అప్పు పుట్టడం లేదు. ఇంట్ల ఎల్లుడు కష్టమైతంది. రెండ్రోజులుగా ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుంటున్నం’ అంటూ గోడు వెల్లబోసుకుంది. ...ఇది ఒకరిద్దరి గోస కాదు.. చేసిన పనికి డబ్బులందక రాష్ట్రవ్యాప్తంగా 12.72 లక్షలమంది ఉపాధి కూలీలు ఇలాగే నానా అవస్థలు పడుతున్నారు! ఎనిమిది వారాల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో పేద కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఉపాధి కూలీలకు రాష్ట్ర సర్కారు గత రెండు నెలలుగా దాదాపు రూ. 310 కోట్లబకాయిలు చెల్లించాల్సి ఉంది! కరువు రక్కసి కబంధ హస్తాల్లో రాష్ట్రం బందీ అయింది. ఎటు చూసినా నెర్రెలిచ్చిన పొలాలు, అడుగంటిన చెరువులు, కుంటలు, చుక్కనీరు రాని బోర్లే దర్శనమిస్తున్నాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న చిన్న, సన్నకారు రైతులంతా రోజువారీ కూలీలుగా మారిపోయారు. ఈ కరువు కాలంలోనైనా ఆధరువుగా నిలుస్తుందనుకున్న ఉపాధి హామీ పథకం ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోతోంది. పని చూపడంలో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, మండుటెండల్లో పని చేసినా నెలల తరబడి అందని కూలీ, క్షేత్రస్థాయిలో అంతులేని అవినీతి.. వెరసి ఈ పథకంపై కూలీలకు నమ్మకం సడలేలా చేస్తున్నాయి. ఏ జిల్లాలోనూ ఉపాధి పనులు సవ్యంగా సాగడం లేదు. ఉన్న ఊర్లో పని కరువవడంతో తల్లీపిల్లలను వదిలి ఆలితోపాటు పట్నం పోతున్నారు రైతు కూలీలు! జిల్లా స్థాయిలో కలెక్టర్లు పూర్తిస్థాయిలో ఉపాధి పనులను పట్టించుకోవడం లేదు. బాధ్యతలన్నీ పీడీల చేతుల్లో పెట్టడంతో పనులు సమగ్రంగా అమలు కావడం లేదు. గ్రామీణ స్థాయిలో పనులు కల్పించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణీత సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల అవినీతికి పాల్పడిన వారిని తొలగించడం, వారి స్థానాల్లో మరొకరిని నియమించకపోవడంతోనూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సుప్రీం ఆగ్రహం వ్యక్తంచేసినా.. ఉపాధి హామీ నిధులు విడుదల చేయకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కరువు బారిన పడిన ప్రాంతాలకు తక్షణమే సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. కరువు రోజుల్లో చేసిన పనికి ఏడాది తర్వాత డబ్బులు చెల్లిస్తే ఏం లాభం? మీరు నిధులివ్వకపోతే పనిచేయడానికి ఎవరూ రారు. తమ దగ్గర డబ్బుల్లేవని రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి.. జనానికి సాయం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేదు’’ అంటూ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాతే కేంద్రం ఇటీవల తన వంతుగా బకాయిలను విడుదల చేసింది. రాష్ట్ర సర్కారు మాత్రం ఇప్పటికీ బకాయిలను విడుదల చేయలేదు. కూలీ పెంచినా ఏం ప్రయోజనం..? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలిని రూ.180 నుంచి రూ.194కు పెంచింది. అయినా ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. ప్రస్తుతం సగటున రోజుకూ రూ.వంద కూడా పడడం లేదని, చేసిన పనికి నెలలుగా ఎదురుచూస్తున్నామని కూలీలు గోడు వెల్లబోసుకుంటున్నారు. కూలి పెంచినా డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. కరువు మండలాల్లో ప్రభుత్వం ఇటీవల పని దినాలను 100 రోజుల నుంచి 150కి పెంచింది. అయితే అది పూర్తిస్థాయిలో అమలైతేనే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం కరువుతో పల్లెల్లో ఏ పని దొరకడం లేదు. దీంతో జనం కూలి తక్కువైనా ఉపాధి పనికే వెళ్తున్నారు. కానీ పని చేసినా డబ్బులు ఎప్పుడు చేతికందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కరువు కాలంలో పట్టెడన్నం కోసం మండుటెండలో పనిచేస్తే.. ఎప్పుడో డబ్బులిస్తే ఏం ప్రయోజనమని కూలీలు వాపోతున్నారు. ఏ వారం డబ్బులు ఆ వారమే ఇవ్వాలని కోరుతున్నారు. 15 రోజుల్లో డబ్బులు ఇవ్వాల్సిందే.. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి కూలీకి పనిచేసిన15 రోజుల్లోనే కూలి డబ్బులు చెల్లించాలి. లేకుంటే అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. కానీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేయకపోవడంతో అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. కూలీల డబ్బులు దారిమళ్లాయా? ఉపాధి హామీ పథకంలో పని చేసిన వారికి పంపిణీ చేయాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినట్టు తెలుస్తోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు ఈ నిధులను ఉపయోగిస్తున్నట్టు అనుమానాలున్నాయి. కేంద్రం తన వాటాగా విడుదల చేస్తున్న ఉపాధి నిధులను రాష్ట్రం ఇలా ఇతర పథకాలకు మళ్లించడంపై విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బతో మరణిస్తున్న కూలీలు గత పక్షం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. సగటున 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూలీలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 40 మంది కూలీలు చనిపోయారు. గ్రామాల్లో ఏ పని దొరక్క వృద్ధులు సైతం ఉపాధి పనులకు వెళ్తున్నారు. అలాంటివారు ఎండలకు తాళలేకపోతున్నారు. వేసవి వెళ్లాక టెంట్లు వేస్తారా? పనిచేసే చోట కూలీల కోసం టెంట్లు వేయాలి. మెడికల్ కిట్లు అందుబాటు ఉంచాలి. చిన్నపిల్లల ఆలనకు ప్రత్యేక సౌకర్యం కల్పించాలి. కానీ ఇవేవీ ఎక్కడా కనిపించడం లేదు. సగం వేసవి గడిచిన తర్వాత ప్రభుత్వం నీడ కోసం టెంట్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఆదేశాలు కలెక్టర్లకు అందాయి. పనిచేసే చోట ఈ టెంట్లు వేయాలంటే కనీసం నెలన్నర సమయమైనా కావాల్సిందే! టెంట్ల కొనుగోళ్లకు కమిటీలు నియమించడం, టెండర్లు, సరఫరా ప్రక్రియ పూర్తయ్యే సరికి వేసవి వెళ్లిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. అంతులేని అవినీతి.. అరకొర రికవరీ ఉపాధి హామీ పనుల్లో కూలీలకు ఎంత దక్కుతుందో తెలియదు గానీ.. ఫీల్ట్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు చాలాచోట్ల అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేస్తున్న వారి సంఖ్య కన్నా ఎక్కువ మంది పేర్లు రాయడం, వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాక పంచుకోవడం వంటివి చేస్తున్నారని కూలీలు చెబుతున్నారు. ఇటీవల నిర్వహిస్తున్న గ్రామసభల్లో ఈ తరహా అవినీతి వెలుగు చూస్తోంది. అయితే రికవరీ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. పనుల్లోంచి తీసేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి పై అధికారులను ప్రసన్నం చేసుకుని విధుల్లో కొనసాగుతున్నారు. జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. ► నల్లగొండ జిల్లాలో రెండు నెలల బకాయిలు రూ.50 కోట్లకు చేరాయి. గతంలో రోజువారీ కూలీల సంఖ్య 1.70 లక్షలు ఉండేది. ఎండల నేపథ్యంలో అది 1.24 లక్షలకు చేరింది. రెండు నెలల్లోనే ఉపాధి కూలీలు 50 వేల వరకు తగ్గిపోయారు. ► ఖమ్మం జిల్లాలో 2.50 లక్షల మందికి జాబ్ కార్డులున్నాయి. కానీ క్రియాశీలక కూలీలు 90 వేల నుంచి 96 వేల మందే. ఈ జిల్లాలో కూలీలకు రూ.35 కోట్ల వేతనం చెల్లించాల్సి ఉంది. ► మహబూబ్‌నగర్ జిల్లాలో ఎనిమిది వారాలపాటు పనిచేసిన కూలీలకు రూ.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలుగా డబ్బులందక పోవడంతో కూలీలు వలస బాట పడుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,14,958 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. మార్చిలో కూలీల నమోదు 1.5 లక్షలకు చేరుకోగా ప్రస్తుతం 1.14 లక్షలకు పడిపోయింది. ► నిజామాబాద్ జిల్లాలో లక్షా 80 వేల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. వీరందరికీ రూ.15.95 కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలు వెంటనే చెల్లించాలని రోజుకో చోట కూలీలు ఆందోళనలకు దిగుతున్నారు. ► రంగారెడ్డి జిల్లాలో 33 గ్రామీణ మండలాలుండగా.. ఇందులో 24 మండలాల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం అమలవుతోంది. 1,39,851 మంది కూలీలు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.42 కోట్లు బకాయిలున్నాయి. ► కరీంనగర్ జిల్లాలో రోజుకు సగటున లక్ష మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. వీరికి మూడు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వేతనాలు కూలీలకు చెల్లించాల్సి ఉంది. ► ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1.55 లక్షల మంది కూలీలకు ఈ ఏడాది జనవరి నుంచి డబ్బులు చెల్లించడం లేదు. ఈ బకాయిలు సుమారు రూ.64 కోట్లు ఉన్నాయి. ► మెదక్ జిల్లాలో లక్షకుపైగా కూలీలు ఉండగా వారికి ప్రభుత్వం రూ.11 కోట్ల మేర బకాయి పడింది. ► వరంగల్‌లో 1..04 లక్షల మంది కూలీలున్నారు. వీరికి రూ.32 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలు, పేరుకుపోయిన బకాయిల వివరాలివీ.. (కూలీల సంఖ్య లక్షల్లో.. బకాయిలో రూ.కోట్లలో..) జిల్లా కూలీలు బకాయిలు నల్లగొండ 1.24 50 ఖమ్మం 2.50 35 మహబూబ్‌నగర్ 1.14 29 నిజామాబాద్ 1.80 15.95 రంగారెడ్డి 1.39 42 కరీంనగర్ 1 30 ఆదిలాబాద్ 1.55 64 మెదక్ 1.06 11.40 వరంగల్ 1.04 32.6 మొత్తం 12.72 310 -
రోగులకు విషమ ‘పరీక్షలు’
ఒక రక్తం శాంపిల్ 71 చోట్ల పరీక్షిస్తే 70 చోట్ల వేర్వేరుగా ఫలితాలు హైదరాబాద్‌లో సీఎంసీ వెల్లూరు రక్త నమూనా పరీక్షల్లో వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా ఇతరత్రా వ్యాధుల నిర్ధారణ పరీక్షల్లోనూ ఇదే తీరు చాలా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో డాక్టర్‌ను బట్టి ఫలితాలు తారుమారు డయాగ్నస్టిక్ కేంద్రాలు - డాక్టర్ల మధ్య పరస్పరం కమీషన్ల దందా రాష్ట్రంలో 7 వేల కేంద్రాలుంటే 30 కేంద్రాలకే ఎన్ఏబీఎల్ గుర్తింపు చాలా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో నైపుణ్యం లేని పారామెడికల్ సిబ్బంది ఇష్టారీతిలో డీఎంఎల్టీ ఇన్స్టిట్యూషన్ల మంజూరూ కారణమే! డయాగ్నస్టిక్ కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు లోపభూయిష్టం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక డయూగ్నస్టిక్ (వైద్య పరీక్షల) కేంద్రాలు రోగ నిర్ధారణ కోసం రక్తపరీక్షలకు వచ్చే వారితో చెలగాటమాడుతున్నారుు. రక్తపరీక్షల్లో నాణ్యత కొరవడటమే కాకుండా.. ఒక్కో కేంద్రంలో ఒక్కో రకమైన ఫలితం రావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు నిమ్స్‌లో వైద్యం కోసం వచ్చి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ డయాగ్నస్టిక్ కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకున్నారు. థైరాయిడ్, కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు అన్నీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులొచ్చాయి. ఆందోళనకు గురైన ఆయన మరో కేంద్రానికి వెళ్లారు. అక్కడి పరీక్షల్లో కొంచెం తక్కువ లెవెల్స్‌తో ఫలితాలు వచ్చారుు. దీంతో ఆయన మరో కేంద్రానికి వెళ్లారు. విచిత్రంగా అన్నీ నార్మల్ అన్నట్టుగా నివేదికలొచ్చారుు. ఈ మూడు నివేదికల్లో వేటిని నమ్మాలో అర్థంకాక శ్రీనివాసరావులో ఆందోళన మరింత పెరిగిపోరుుంది. హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో చేస్తున్న రక్తపరీక్షల్లో వెలువడుతున్న ఫలితాల్లో నిజమెంతో వైద్యులకు, డయాగ్నస్టిక్ కేంద్రాలకు తప్ప ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఈ ఫలితాలపైనే 70 శాతం వరకు వైద్యం ఆధారపడి ఉండటం ఆందోళనకరం. సీఎంసీ వెల్లూరు శాంపిల్ వెల్లడించిన నిజం ఇటీవల తమిళనాడులోని సీఎంసీ వెల్లూరు వైద్య కళాశాల నుంచి ఓ రక్త నమూనా తీసుకొచ్చి (శాంపిల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా) హైదరాబాద్‌లోని వివిధ డయాగ్నస్టిక్ కేంద్రాలకు ఇచ్చారు. ఇందులో 71 కేంద్రాలకు ఈ శాంపిల్‌ను ఇస్తే 70 కేంద్రాల్లో 70 రకాల ఫలితాలు రావటంతో సీఎంసీ వైద్యులు విస్తుపోయూరు. డాక్టర్‌ను బట్టి ఈ కేంద్రాలు వైద్య పరీక్షలు చేస్తున్నాయనే విమర్శలున్నారుు. జనరల్ ఫిజీషియన్ వైద్య పరీక్షలకు రాస్తే షుగర్ అధికంగా ఉన్నట్టు చూపిస్తున్నారు. మం దుల వాడకం, తిరిగి వైద్య పరీక్షలకు రావడం తప్పదు కాబట్టి. అదే సర్జన్ రాస్తే కాస్త నార్మల్‌గా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఎందుక ంటే వెంటనే ఆపరేషన్ చేసేలా వెసులుబాటు కల్పించేందుకు. దీనివల్ల వైద్యుడికి ఆదాయం. డయాగ్నస్టిక్ కేంద్రానికీ వైద్యుడి నుంచి కమీషన్లు ఉంటాయి. ఇక వైద్యులు నానా రకాల వైద్య పరీక్షలు రాసి డయూగ్నస్టిక్ కేంద్రాలకు పంపిస్తే ఆయూ కేంద్రాల నుంచి వైద్యులకు కమీషన్లు ముడతాయనేది జగమెరిగిన సత్యం. ఇష్టారాజ్యంగా లెసైన్సులు రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పారామెడికల్ ఇన్స్టిట్యూషన్లు వెలుస్తున్నాయి. నాలుగు గోడలు ఉంటే చాలన్నట్టుగా పారామెడికల్ బోర్డు అనుమతిస్తోంది. దీంతో డీఎంఎల్టీ (డిప్లమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెస్ట్) చేసిన, చేస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. సౌకర్యాలు లేని ఆయూ కేంద్రాల్లో సరైన శిక్షణ కొరవడుతున్న కారణంగా.. అలాంటిచోట్ల శిక్షణ పొందినవారు చేస్తున్న రక్తపరీక్షల్లో నాణ్యత పూర్తిగా లోపిస్తోందనే విమర్శలున్నారుు. పారామెడికల్ బోర్డులో ఉన్న ఉన్నతాధికారి ఏళ్ల తరబడి ఆధిపత్యం చెలారుుస్తూ లెసైన్సుల మంజూరులో తీవ్ర అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. 30 కేంద్రాలకు మాత్రమే ఎన్ఏబీఎల్ గుర్తింపు రాష్ట్రంలో ఏడు వేలకు పైగా డయాగ్నస్టిక్ కేంద్రాలున్నాయి. వీటిలో ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబొరేటరీస్) గుర్తింపు ఉన్నది కేవలం 30 కేంద్రాలకు మాత్రమే. దేశంలో లక్ష కేంద్రాలుంటే 457 కేంద్రాలకు మాత్రమే ఎన్ఏబీఎల్ గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని గుర్తింపులేని కేంద్రాలపై ప్రభుత్వ అజమాయిషీ లేనే లేదు. పైగా ఇష్టారాజ్యంగా లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. ఇటీవలి ఎన్ఏబీఎల్ సర్వే ప్రకారం.. ఏటా 2 కోట్ల మంది పైనే వైద్య పరీక్షలు చేయించుకుంటూంటే 68 శాతం మందికి కచ్చితమైన నిర్ధారణ జరగడం లేదు. రక్త సేకరణలో విధిగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని రక్తం తీయాల్సి ఉండగా 90 శాతం మంది అలా చేయడం లేదని తేలింది. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేని టెక్నీషియన్ల కారణంగా 54 శాతం పరీక్షలు కచ్చితంగా ఉండటం లేదు. ప్రతి 18 మంది రక్త నమూనాల్లో ఒక నివేదిక తారుమారు అవుతోంది.