
సాక్షి, హైదరాబాద్ : చట్టంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకుని నిధుల సమీకరణ చేస్తున్న రాజకీయపార్టీలపై చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ నిధుల కోసం టీఆర్‌ఎస్ చేసిన నిధుల సేకరణ ఎన్నికల సంఘం మార్గదర్శకాల పరిధిలోకి వస్తుందో లేదో కూడా తేల్చాలని ఆయన పిటిషన్‌లో కోరారు.
ఈ వ్యాజ్యాన్ని బుధవారం విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, న్యాయమూర్తి జస్టిస్ సి.హరిశంకర్‌ల ధర్మాసనం పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ అభిప్రాయానికి రావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పార్టీ ప్లీనరీ నిమిత్తం ‘బంగారు కూలీ’పేరుతో టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల నుంచి రూ.లక్షలు వసూలు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment