రోగులకు విషమ ‘పరీక్షలు’
-
ఒక రక్తం శాంపిల్ 71 చోట్ల పరీక్షిస్తే 70 చోట్ల వేర్వేరుగా ఫలితాలు
-
హైదరాబాద్‌లో సీఎంసీ వెల్లూరు రక్త నమూనా పరీక్షల్లో వెల్లడి
-
రాష్ట్రవ్యాప్తంగా ఇతరత్రా వ్యాధుల నిర్ధారణ పరీక్షల్లోనూ ఇదే తీరు
-
చాలా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో డాక్టర్‌ను బట్టి ఫలితాలు తారుమారు
-
డయాగ్నస్టిక్ కేంద్రాలు - డాక్టర్ల మధ్య పరస్పరం కమీషన్ల దందా
-
రాష్ట్రంలో 7 వేల కేంద్రాలుంటే 30 కేంద్రాలకే ఎన్‌ఏబీఎల్ గుర్తింపు
-
చాలా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో నైపుణ్యం లేని పారామెడికల్ సిబ్బంది
-
ఇష్టారీతిలో డీఎంఎల్‌టీ ఇన్‌స్టిట్యూషన్ల మంజూరూ కారణమే!
-
డయాగ్నస్టిక్ కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు లోపభూయిష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక డయూగ్నస్టిక్ (వైద్య పరీక్షల) కేంద్రాలు రోగ నిర్ధారణ కోసం రక్తపరీక్షలకు వచ్చే వారితో చెలగాటమాడుతున్నారుు. రక్తపరీక్షల్లో నాణ్యత కొరవడటమే కాకుండా.. ఒక్కో కేంద్రంలో ఒక్కో రకమైన ఫలితం రావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు నిమ్స్‌లో వైద్యం కోసం వచ్చి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ డయాగ్నస్టిక్ కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకున్నారు. థైరాయిడ్, కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు అన్నీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులొచ్చాయి. ఆందోళనకు గురైన ఆయన మరో కేంద్రానికి వెళ్లారు. అక్కడి పరీక్షల్లో కొంచెం తక్కువ లెవెల్స్‌తో ఫలితాలు వచ్చారుు. దీంతో ఆయన మరో కేంద్రానికి వెళ్లారు. విచిత్రంగా అన్నీ నార్మల్ అన్నట్టుగా నివేదికలొచ్చారుు. ఈ మూడు నివేదికల్లో వేటిని నమ్మాలో అర్థంకాక శ్రీనివాసరావులో ఆందోళన మరింత పెరిగిపోరుుంది. హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో చేస్తున్న రక్తపరీక్షల్లో వెలువడుతున్న ఫలితాల్లో నిజమెంతో వైద్యులకు, డయాగ్నస్టిక్ కేంద్రాలకు తప్ప ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఈ ఫలితాలపైనే 70 శాతం వరకు వైద్యం ఆధారపడి ఉండటం ఆందోళనకరం.
సీఎంసీ వెల్లూరు శాంపిల్ వెల్లడించిన నిజం
ఇటీవల తమిళనాడులోని సీఎంసీ వెల్లూరు వైద్య కళాశాల నుంచి ఓ రక్త నమూనా తీసుకొచ్చి (శాంపిల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా) హైదరాబాద్‌లోని వివిధ డయాగ్నస్టిక్ కేంద్రాలకు ఇచ్చారు. ఇందులో 71 కేంద్రాలకు ఈ శాంపిల్‌ను ఇస్తే 70 కేంద్రాల్లో 70 రకాల ఫలితాలు రావటంతో సీఎంసీ వైద్యులు విస్తుపోయూరు. డాక్టర్‌ను బట్టి ఈ కేంద్రాలు వైద్య పరీక్షలు చేస్తున్నాయనే విమర్శలున్నారుు. జనరల్ ఫిజీషియన్ వైద్య పరీక్షలకు రాస్తే షుగర్ అధికంగా ఉన్నట్టు చూపిస్తున్నారు. మం దుల వాడకం, తిరిగి వైద్య పరీక్షలకు రావడం తప్పదు కాబట్టి. అదే సర్జన్ రాస్తే కాస్త నార్మల్‌గా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఎందుక ంటే వెంటనే ఆపరేషన్ చేసేలా వెసులుబాటు కల్పించేందుకు. దీనివల్ల వైద్యుడికి ఆదాయం. డయాగ్నస్టిక్ కేంద్రానికీ వైద్యుడి నుంచి కమీషన్లు ఉంటాయి. ఇక వైద్యులు నానా రకాల వైద్య పరీక్షలు రాసి డయూగ్నస్టిక్ కేంద్రాలకు పంపిస్తే ఆయూ కేంద్రాల నుంచి వైద్యులకు కమీషన్లు ముడతాయనేది జగమెరిగిన సత్యం.
ఇష్టారాజ్యంగా లెసైన్సులు
రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పారామెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌లు వెలుస్తున్నాయి. నాలుగు గోడలు ఉంటే చాలన్నట్టుగా పారామెడికల్ బోర్డు అనుమతిస్తోంది. దీంతో డీఎంఎల్‌టీ (డిప్లమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెస్ట్) చేసిన, చేస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. సౌకర్యాలు లేని ఆయూ కేంద్రాల్లో సరైన శిక్షణ కొరవడుతున్న కారణంగా.. అలాంటిచోట్ల శిక్షణ పొందినవారు చేస్తున్న రక్తపరీక్షల్లో నాణ్యత పూర్తిగా లోపిస్తోందనే విమర్శలున్నారుు. పారామెడికల్ బోర్డులో ఉన్న ఉన్నతాధికారి ఏళ్ల తరబడి ఆధిపత్యం చెలారుుస్తూ లెసైన్సుల మంజూరులో తీవ్ర అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి.
30 కేంద్రాలకు మాత్రమే ఎన్‌ఏబీఎల్ గుర్తింపు
రాష్ట్రంలో ఏడు వేలకు పైగా డయాగ్నస్టిక్ కేంద్రాలున్నాయి. వీటిలో ఎన్‌ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబొరేటరీస్) గుర్తింపు ఉన్నది కేవలం 30 కేంద్రాలకు మాత్రమే. దేశంలో లక్ష కేంద్రాలుంటే 457 కేంద్రాలకు మాత్రమే ఎన్‌ఏబీఎల్ గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని గుర్తింపులేని కేంద్రాలపై ప్రభుత్వ అజమాయిషీ లేనే లేదు. పైగా ఇష్టారాజ్యంగా లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. ఇటీవలి ఎన్‌ఏబీఎల్ సర్వే ప్రకారం..
ఏటా 2 కోట్ల మంది పైనే వైద్య పరీక్షలు చేయించుకుంటూంటే 68 శాతం మందికి కచ్చితమైన నిర్ధారణ జరగడం లేదు.
రక్త సేకరణలో విధిగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని రక్తం తీయాల్సి ఉండగా 90 శాతం మంది అలా చేయడం లేదని తేలింది.
సరైన సాంకేతిక పరిజ్ఞానం లేని టెక్నీషియన్ల కారణంగా 54 శాతం పరీక్షలు కచ్చితంగా ఉండటం లేదు.
ప్రతి 18 మంది రక్త నమూనాల్లో ఒక నివేదిక తారుమారు అవుతోంది.