medical diagnosis
-
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్‌కు శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించామని, మరోసారి వైద్యుల అభిప్రాయం తీసుకోవాలన్న ఆయన కోరిక మేరకు సోమవారం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లామని జైలు అధికారులు తెలిపారు. ఆయన వెంట పోలీసులున్నారని చెప్పారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు పరీక్షించాక ఆయన్ను తిరిగి జైలుకు తీసుకొచ్చారన్నారు. జైన్‌ను 2022 మే 31వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. జైన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆకాంక్షించారు. ‘జైన్‌ను బీజేపీ చంపాలనుకుంటోంది. ఇంతటి క్రూరత్వం పనికిరాదు, మోదీజీ’ అంటూ ట్వీట్ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో జైన్ 35 కిలోలు తగ్గారని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. -
నిరు పేదల ఆశలపై నీళ్లు చల్లిన ఏపీ సర్కార్
విజయవాడ : నిరు పేదల ఆశలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ నీళ్లు చల్లింది. నూతన సంవత్సర కానుక అంటూ... తెల్లకార్డు లేకున్నా అత్యవసర చికిత్స పొందే రోగులకు సీఎంసీఓ రెఫరల్ కార్డులు అని ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం కొద్ది గంట్లలోనే వెనక్కి తగ్గింది. ఉచిత వైద్యం అంటూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంది. ఈ అంశంపై మరింత వివరణతో శుక్రవారం మరో ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. కాగా అంతకు ముందు ' తెల్లకార్డు లేకున్నా రోగులకు ప్రభుత్వం సూచించిన స్పెషాలిటీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ‘డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ’ కింద ఉచితంగా చికిత్స అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని గంటల తర్వాత ప్రకటనను సవరించాల్సి ఉందంటూ ప్రభుత్వం మరో ప్రకటన చేయటం విశేషం. -
ఇక ఒక రోగానికి ఒకే రకమైన చికిత్స
డాక్టర్‌ను బట్టి రోగానికి చికిత్స మారకూడదు మార్గదర్శకాలపై 32 మంది వైద్యులతో కమిటీ సాక్షి, హైదరాబాద్: చిన్న రోగమైనా సరే.. ఇద్దరు వైద్యులు చేసే చికిత్స మధ్య చాలా తేడా ఉంటోంది. చిన్నదైనా, పెద్దదైనా ఒకే రకమైన జబ్బుకు ఒక వైద్యుడు అందించే చికిత్సకు, మరొకరు చేసే చికిత్సకు మధ్య పొంతన ఉండదు. పైగా.. మారుతున్న పరిస్థితులతో కొత్త రకాల జబ్బులు అనేకం పుట్టుకొస్తున్నాయి. వైద్యులు అందిస్తున్న వైద్యానికి ఎలాంటి ప్రామాణికతా ఉండటం లేదు. రకరకాల చికిత్సల కారణంగా రోగికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండకూడదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఒకే రకమైన జబ్బుకు ఏ ఆస్పత్రిలోనైనా, డాక్టరెవరైనా ఒకే రకమైన వైద్యం అందించడం, ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఏకరీతి వైద్యం లక్ష్యంగా మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది. దీనిపై అధ్యయనానికి వివిధ ప్రభుత్వ ఆస్పత్రులు, నిమ్స్‌కు చెందిన 32 మంది వైద్య నిపుణులతో ఇటీవల ఓ కమిటీని నియమించింది. అధ్యయనాన్ని పర్యవేక్షించడానికి డీఎంఈ (అకడెమిక్) డాక్టర్ వెంకటేష్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్రీనివాస్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌లు సభ్యులుగా కమిటీని కూడా నియమించారు. నిపుణుల కమిటీ రెండు నెలల్లో అధ్యయనం చేసి, మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి, బోధనాసుపత్రి వరకూ మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర దోమకాటు వల్ల వచ్చే జబ్బులతో పాటు జీవనశైలి కారణంగా వచ్చే గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి పలు రకాల జబ్బులకు అందించే వైద్య పద్ధతులపై అధ్యయనం చేసి ఒకే రకమైన చికిత్సలను ప్రవేశపెట్టనున్నారు. 2008లో ఒకసారి కేవలం బోధనాసుపత్రుల్లో ఏకతరహా వైద్య చికిత్సలపై మార్గదర్శకాలు ఇచ్చారు. ఇప్పుడు పీహెచ్సీ నుంచి బోధనాసుపత్రుల వరకూ అధ్యయనం చేస్తున్నారు. సుమారు 200 జబ్బులపై అధ్యయనం చేసి, వాటికి ఎలాంటి చికిత్స అందించాలో విధివిధానాలను రూపొందించనున్నారు. దీనికోసం ఇప్పటికే రాజస్థాన్, తమిళనాడుల్లో అనుసరిస్తున్న పద్ధతులనూ పరిశీలించారు. అన్నీ అధ్యయనం చేశాక 400 పేజీల బుక్‌లెట్‌ను తయారు చేసి అన్ని ప్రభుత్వాస్పత్రులకు అందజేస్తారు. ఇందులో ఉన్న మార్గదర్శకాలను అనుసరించే చికిత్స చేయాల్సి ఉంటుంది. -
రోగులకు విషమ ‘పరీక్షలు’
ఒక రక్తం శాంపిల్ 71 చోట్ల పరీక్షిస్తే 70 చోట్ల వేర్వేరుగా ఫలితాలు హైదరాబాద్‌లో సీఎంసీ వెల్లూరు రక్త నమూనా పరీక్షల్లో వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా ఇతరత్రా వ్యాధుల నిర్ధారణ పరీక్షల్లోనూ ఇదే తీరు చాలా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో డాక్టర్‌ను బట్టి ఫలితాలు తారుమారు డయాగ్నస్టిక్ కేంద్రాలు - డాక్టర్ల మధ్య పరస్పరం కమీషన్ల దందా రాష్ట్రంలో 7 వేల కేంద్రాలుంటే 30 కేంద్రాలకే ఎన్ఏబీఎల్ గుర్తింపు చాలా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో నైపుణ్యం లేని పారామెడికల్ సిబ్బంది ఇష్టారీతిలో డీఎంఎల్టీ ఇన్స్టిట్యూషన్ల మంజూరూ కారణమే! డయాగ్నస్టిక్ కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు లోపభూయిష్టం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక డయూగ్నస్టిక్ (వైద్య పరీక్షల) కేంద్రాలు రోగ నిర్ధారణ కోసం రక్తపరీక్షలకు వచ్చే వారితో చెలగాటమాడుతున్నారుు. రక్తపరీక్షల్లో నాణ్యత కొరవడటమే కాకుండా.. ఒక్కో కేంద్రంలో ఒక్కో రకమైన ఫలితం రావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు నిమ్స్‌లో వైద్యం కోసం వచ్చి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ డయాగ్నస్టిక్ కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకున్నారు. థైరాయిడ్, కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు అన్నీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులొచ్చాయి. ఆందోళనకు గురైన ఆయన మరో కేంద్రానికి వెళ్లారు. అక్కడి పరీక్షల్లో కొంచెం తక్కువ లెవెల్స్‌తో ఫలితాలు వచ్చారుు. దీంతో ఆయన మరో కేంద్రానికి వెళ్లారు. విచిత్రంగా అన్నీ నార్మల్ అన్నట్టుగా నివేదికలొచ్చారుు. ఈ మూడు నివేదికల్లో వేటిని నమ్మాలో అర్థంకాక శ్రీనివాసరావులో ఆందోళన మరింత పెరిగిపోరుుంది. హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో చేస్తున్న రక్తపరీక్షల్లో వెలువడుతున్న ఫలితాల్లో నిజమెంతో వైద్యులకు, డయాగ్నస్టిక్ కేంద్రాలకు తప్ప ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఈ ఫలితాలపైనే 70 శాతం వరకు వైద్యం ఆధారపడి ఉండటం ఆందోళనకరం. సీఎంసీ వెల్లూరు శాంపిల్ వెల్లడించిన నిజం ఇటీవల తమిళనాడులోని సీఎంసీ వెల్లూరు వైద్య కళాశాల నుంచి ఓ రక్త నమూనా తీసుకొచ్చి (శాంపిల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా) హైదరాబాద్‌లోని వివిధ డయాగ్నస్టిక్ కేంద్రాలకు ఇచ్చారు. ఇందులో 71 కేంద్రాలకు ఈ శాంపిల్‌ను ఇస్తే 70 కేంద్రాల్లో 70 రకాల ఫలితాలు రావటంతో సీఎంసీ వైద్యులు విస్తుపోయూరు. డాక్టర్‌ను బట్టి ఈ కేంద్రాలు వైద్య పరీక్షలు చేస్తున్నాయనే విమర్శలున్నారుు. జనరల్ ఫిజీషియన్ వైద్య పరీక్షలకు రాస్తే షుగర్ అధికంగా ఉన్నట్టు చూపిస్తున్నారు. మం దుల వాడకం, తిరిగి వైద్య పరీక్షలకు రావడం తప్పదు కాబట్టి. అదే సర్జన్ రాస్తే కాస్త నార్మల్‌గా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఎందుక ంటే వెంటనే ఆపరేషన్ చేసేలా వెసులుబాటు కల్పించేందుకు. దీనివల్ల వైద్యుడికి ఆదాయం. డయాగ్నస్టిక్ కేంద్రానికీ వైద్యుడి నుంచి కమీషన్లు ఉంటాయి. ఇక వైద్యులు నానా రకాల వైద్య పరీక్షలు రాసి డయూగ్నస్టిక్ కేంద్రాలకు పంపిస్తే ఆయూ కేంద్రాల నుంచి వైద్యులకు కమీషన్లు ముడతాయనేది జగమెరిగిన సత్యం. ఇష్టారాజ్యంగా లెసైన్సులు రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పారామెడికల్ ఇన్స్టిట్యూషన్లు వెలుస్తున్నాయి. నాలుగు గోడలు ఉంటే చాలన్నట్టుగా పారామెడికల్ బోర్డు అనుమతిస్తోంది. దీంతో డీఎంఎల్టీ (డిప్లమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెస్ట్) చేసిన, చేస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. సౌకర్యాలు లేని ఆయూ కేంద్రాల్లో సరైన శిక్షణ కొరవడుతున్న కారణంగా.. అలాంటిచోట్ల శిక్షణ పొందినవారు చేస్తున్న రక్తపరీక్షల్లో నాణ్యత పూర్తిగా లోపిస్తోందనే విమర్శలున్నారుు. పారామెడికల్ బోర్డులో ఉన్న ఉన్నతాధికారి ఏళ్ల తరబడి ఆధిపత్యం చెలారుుస్తూ లెసైన్సుల మంజూరులో తీవ్ర అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. 30 కేంద్రాలకు మాత్రమే ఎన్ఏబీఎల్ గుర్తింపు రాష్ట్రంలో ఏడు వేలకు పైగా డయాగ్నస్టిక్ కేంద్రాలున్నాయి. వీటిలో ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబొరేటరీస్) గుర్తింపు ఉన్నది కేవలం 30 కేంద్రాలకు మాత్రమే. దేశంలో లక్ష కేంద్రాలుంటే 457 కేంద్రాలకు మాత్రమే ఎన్ఏబీఎల్ గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని గుర్తింపులేని కేంద్రాలపై ప్రభుత్వ అజమాయిషీ లేనే లేదు. పైగా ఇష్టారాజ్యంగా లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. ఇటీవలి ఎన్ఏబీఎల్ సర్వే ప్రకారం.. ఏటా 2 కోట్ల మంది పైనే వైద్య పరీక్షలు చేయించుకుంటూంటే 68 శాతం మందికి కచ్చితమైన నిర్ధారణ జరగడం లేదు. రక్త సేకరణలో విధిగా చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని రక్తం తీయాల్సి ఉండగా 90 శాతం మంది అలా చేయడం లేదని తేలింది. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేని టెక్నీషియన్ల కారణంగా 54 శాతం పరీక్షలు కచ్చితంగా ఉండటం లేదు. ప్రతి 18 మంది రక్త నమూనాల్లో ఒక నివేదిక తారుమారు అవుతోంది. -
వైద్యపరీక్షలు లేకుండానే రోగ నిర్ధారణ