నిరు పేదల ఆశలపై నీళ్లు చల్లిన ఏపీ సర్కార్
విజయవాడ : నిరు పేదల ఆశలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ నీళ్లు చల్లింది. నూతన సంవత్సర కానుక అంటూ... తెల్లకార్డు లేకున్నా అత్యవసర చికిత్స పొందే రోగులకు సీఎంసీఓ రెఫరల్ కార్డులు అని ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం కొద్ది గంట్లలోనే వెనక్కి తగ్గింది. ఉచిత వైద్యం అంటూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంది.
ఈ అంశంపై మరింత వివరణతో శుక్రవారం మరో ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. కాగా అంతకు ముందు ' తెల్లకార్డు లేకున్నా రోగులకు ప్రభుత్వం సూచించిన స్పెషాలిటీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ‘డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ’ కింద ఉచితంగా చికిత్స అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని గంటల తర్వాత ప్రకటనను సవరించాల్సి ఉందంటూ ప్రభుత్వం మరో ప్రకటన చేయటం విశేషం.