lorry bike accident
-
‘నిండు జీవితాన్ని’ ఈడ్చుకుపోయాడు
కోస్గి: మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తాగిన మైకంలో లారీ ని వేగంగా నడుపుతూ ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టడమే గాక.. బైక్‌తో సహా యువకుడిని కిలోమీటర్‌కు పైగా ఈడ్చుకెళ్లడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో ని బిజ్జారం బావుల కాలనీకి చెందిన వెంకటయ్య(32) వంట మాస్టర్‌గా పని చేసుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి కొత్త సంవత్సరం వేడుకల కోసం కొం దరు యువకులు వంటలు చేసేందుకు పిలవడంతో పని పూర్తి చేసి దాదాపు అర్ధరాత్రి సమయంలో బైక్‌పై ఇంటికి బయలు దేరాడు. అదే సమయంలో మహబూబ్‌నగర్ నుంచి కొడంగల్‌కు వెళుతున్న లారీ వేగంగా వచ్చి కోస్గి పట్టణ శివారులో వెంకటయ్య బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌తో పాటు వెంకట య్య లారీ ముందుభాగంలో ఇరుక్కుపోగా.. డ్రైవర్ అబ్దుల్ రజాక్ లారీని అలాగే కిలోమీటర్ మేర ముందుకు తీసుకెళ్లాడు. స్థానిక శివాజీ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండటంతో భయపడిన రజాక్ లా రీని నారాయణపేట రోడ్డు వైపు మళ్లించా డు. లారీ వేగంగా మలుపు తిరగడంతో ముందు భాగంలో చిక్కుకున్న వెంకటయ్య రోడ్డుపై పడిపోయాడు. ఈ విషయాన్ని గు ర్తించిన పోలీసులు లారీని వెంబడించి పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్య ను జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు లారీని, డ్రైవర్ అబ్దుల్ రజాక్‌ను స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. వెంకటయ్య(ఫైల్) -
లారీ కింద ఇరుక్కున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
వర్ధన్నపేట: లారీ, బైక్ ఢీ కొన్న సంఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు లారీ కింద ఇరుక్కుని నరకయాతన అనుభవించి ఎట్టకేలకు పోలీసుల సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి బయట పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భారీ యంత్రాల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న లారీ డీసీతండాకు చెందిన ఆంగోతు వెంకన్న, ఆంగోతు సంతోష్‌లు తమ బైక్‌పై వరంగల్ వైపు వస్తున్న క్రమంలో అదుపు తప్పి ఢీ కొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న అంగోతు వెంకన్న తన బైక్‌తో పాటు లారీకిందకు దూసుకుపోయి ఇరుక్కున్నాడు. సంతోష్ పక్కన పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ అప్రమత్తమై వెంకన్నను కాపాడడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తున్న తరుణంలో రోడ్డు కిందకు వెళ్లింది. దీంతో అందులో ఇరుక్కుపోయి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అక్కడికి చేరుకున్న గిరిజనులు కూడా ప్రయత్నించినా బయటకు రావడం సాధ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. వర్ధన్నపేట సీఐ వేణుచందర్, ఎస్సైలు ఉపేందర్‌రావు, శ్రీధర్‌తో పాటు సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగ్రాతుడిని బయటకు తీసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. వెంకన్న పరిస్థితిని చూసి పోలీసులు ముందస్తుగా స్థానిక వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు ఘటన స్థలానికి చేరుకుని చికిత్సకు కావాల్సిన ఆక్సిజన్, ప్రథమ చికిత్స పరికరాలు, 108 వాహనం సిద్ధంగా ఉంచారు. లారీ కింద ఇరుక్కుపోయిన వెంకన్నను తీయడానికి రెండు జేసీబీలు, ఒక క్రైన్ను తీసుకువచ్చి వాటి సహా యంతో బయటకు తీశారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి వెంకన్నను ప్రాణాలతో బయటకు తీశారు. క్షతగాత్రుడిని సీఐ వేణుచందర్ తన భుజాలపై ఎత్తుకుని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లి పడుకోబెట్టగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఎంజీఎంకు తరలించారు. కాలుకు రెండు చోట్ల, చేయికి తీవ్ర గా యాలు కావడంతో పాటు కడుపులో సైతం ఇబ్బందులు ఏర్పడటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరో వ్యక్తి సంతోష్ వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఇద్దరిని బలిగొన్న ఇసుక లారీ
మంగపేట : మండలంలోని వాడగూడెం బస్‌స్టాప్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటనలో అకినేపల్లిమల్లారం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గారపాటి వీర్రాజు(వీరబాబు)(42) అదే గ్రామానికి చెందిన శెట్టిపెల్లి లవకుమార్(పండు) (27) అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం మృతి చెందారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ వీర్రాజు, తన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న లవకుమార్‌తో కలిసి తన ద్విచక్రవాహనంపై పనిమీద మంగపేటలోని జాన్‌డీయర్ ట్రాక్టర్ షోరూంకు వెలుతున్నారు. మార్గమధ్యలోని వాడగూడెం బస్టాప్ సమీపంలోని మూలమలుపు వద్ద మంగపేట వైపు నుంచి రాజుపేట వైపు వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి రోడ్డుకు ఎడమవైపునగల మూలమలుపు సూచిక బోర్డును ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అదేవేగంతో రోడ్డుకు పక్కనగల గొయ్యిలోకి వెళ్లి తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. అతివేగంగా లారీ ఢీకొనడంతో వీర్రాజు, లవకుమార్ 10 మీటర్లు పైకి ఎగిరి రోడ్డుపక్కన గల వరిచేసులో పడిపోయారు. వీర్రాజు అక్కడికక్కడే మృతి చెందగా లవకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించినా అది రావడం ఆలస్యం కావడంతో లవకుమార్ మృతి చెందినట్లు వారు తెలిపారు. విషయం తెలిసిన అకినేపల్లిమల్లారం, కత్తిగూడెం, దుగినేపల్లి, రాజుపేట, రమనక్కపేట తదితర గ్రామాల నుంచి సుమారు 6 వందల మంది తరలివచ్చి విగతజీవులుగా పడిఉన్న ఇద్దరిని చూసి కంటనీరు పెట్టుకున్నారు. ఇసుకల లారీల వేగానికి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఇసుకలారీల రాకపోకలను నిలిపివేయాలని డి మాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ వారిని కోల్పోయామనే ఆవేశంలో ఇద్దరిని బలి తీసుకున్న లారీపై పెట్రోలుపోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఏటూరునాగారం ఎస్సై కిరణ్‌కుమార్ వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు వీర్రాజుకు భార్య వనిత, ఇద్దరు కూతుళ్లు, లవకుమార్‌కు తల్లిదండ్రులు, అన్న ఉన్నారు. -
స్నేహితుడికి తోడుగా వెళ్తూ..
♦ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ♦ బైకును లారీ ఢీకొనడంతో ప్రమాదం ♦ తాండూరు మండలం ఓగిపూర్ శివారులో ఘటన తాండూరు రూరల్ : స్నేహితుడికి తోడుగా వెళు ్తన్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాల య్యా డు. వారు వెళ్తున్న బైకును లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి కానరాని లోకాలకు తరలివెళ్లాడు. ఈ సం ఘటన మండల పరిధిలోని ఓగిపూర్ శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన వసంత, శేఖర్‌గౌడ్ దంపతుల కుమారుడు హేమంత్‌గౌడ్(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదివి కొంతకాలంగా ఇంటివద్దనే ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువకుడు బాలాజీ మండల పరిధిలోని ఓగిపూర్ గ్రామ శివారులోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. బాలాజీ, హేమంత్‌గౌడ్ స్నేహితులు. బాలాజీకి గురువారం సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అతడు క ంపెనీకి వెళ్లేందుకు బైకుపై సిద్ధమయ్యాడు. అంతలో తన స్నేహితుడు హేమంత్గౌడ్ను తోడుగా తీసుకొని బాలాజీ ఫ్యాక్టరీకి బయలుదేరాడు. ఓగిపూర్ శివారులో కంపెనీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ(ఏపీ 28 3537) వీరి బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న బాలాజీ, హేమంత్గౌడ్కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే తాండూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన హేమంత్గౌడ్ను వైద్యులు హైదరాబాద్ రిఫర్ చేశారు. వాహనంలో నగరానికి తీసుకెళ్తుండగా అతడు మార్గమధ్యంలో వికారాబాద్ సమీపంలో మృ తి చెందాడు. దీంతో మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కర్ణాటక సరిహద్దులో ప్రమాదం జరగడంతో మృతుడి కుటుంబీ కులు కర్ణాటకలోని మిర్యాణ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లా రు. చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వసంత, శేఖర్‌గౌడ్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. -
బైకును ఢీకొన్న లారీ తల్లి మృతి, తనయుడికి తీవ్ర గాయాలు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీ గంగురాజుపురం ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తల్లి మృతి చెందగా తనయుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గంగురాజుపురంలో నివాసముంటున్న సుబ్బరత్న అక్కడి ఓ మిల్లులో కూలీగా పనిచేస్తోంది. బుధవారం ఆమెను మిల్లు వద్ద వదిలిపెట్టేందుకు ఆమె కుమారుడు వెంకటేష్ బైకులో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో వీరికి పరిచయమున్న అమిరుద్దీన్ అనే వ్యక్తి కనిపించాడు. దీంతో రోడ్డు పక్క బైకును నిలిపి అతనితో మాట్లాడుతుండగా వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బరత్న అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అమిరుద్దీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సుబ్బరత్న భర్త చిన్నయ్య ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని బతుకుదెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆమె మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కులేనిదిగా తయారైంది. ప్రమాదానికి కారణమైన లారీని మంగంపేట వద్ద స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నల్లగొండ: ఆత్మకూరు(ఎస్) మండలం ముక్కుదేవులపల్లి వద్ద లారీ-బైక్ డీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. -
లారీని ఢీ కొన్న బైక్: ముగ్గురు మృతి
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం దంగేరు రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.