‘నిండు జీవితాన్ని’ ఈడ్చుకుపోయాడు | Young Man Died Due To Lorry Hits Bike Road Accident In Narayanpet District | Sakshi
Sakshi News home page

‘నిండు జీవితాన్ని’ ఈడ్చుకుపోయాడు

Jan 2 2022 3:33 AM | Updated on Jan 2 2022 3:33 AM

Young Man Died Due To Lorry Hits Bike Road Accident In Narayanpet District - Sakshi

లారీ కింద ఇరుక్కుపోయిన బైక్‌

కోస్గి: మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తాగిన మైకంలో లారీ ని వేగంగా నడుపుతూ ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టడమే గాక.. బైక్‌తో సహా యువకుడిని కిలోమీటర్‌కు పైగా ఈడ్చుకెళ్లడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో ని బిజ్జారం బావుల కాలనీకి చెందిన వెంకటయ్య(32) వంట మాస్టర్‌గా పని చేసుకుం టూ జీవనం సాగిస్తున్నాడు.

శుక్రవారం రాత్రి కొత్త సంవత్సరం వేడుకల కోసం కొం దరు యువకులు వంటలు చేసేందుకు పిలవడంతో పని పూర్తి చేసి దాదాపు అర్ధరాత్రి సమయంలో బైక్‌పై ఇంటికి బయలు దేరాడు. అదే సమయంలో మహబూబ్‌నగర్‌ నుంచి కొడంగల్‌కు వెళుతున్న లారీ వేగంగా వచ్చి కోస్గి పట్టణ శివారులో వెంకటయ్య బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌తో పాటు వెంకట య్య లారీ ముందుభాగంలో ఇరుక్కుపోగా.. డ్రైవర్‌ అబ్దుల్‌ రజాక్‌ లారీని అలాగే కిలోమీటర్‌ మేర ముందుకు తీసుకెళ్లాడు.

స్థానిక శివాజీ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండటంతో భయపడిన రజాక్‌ లా రీని నారాయణపేట రోడ్డు వైపు మళ్లించా డు. లారీ వేగంగా మలుపు తిరగడంతో ముందు భాగంలో చిక్కుకున్న వెంకటయ్య రోడ్డుపై పడిపోయాడు. ఈ విషయాన్ని గు ర్తించిన పోలీసులు లారీని వెంబడించి పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్య ను జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు లారీని, డ్రైవర్‌ అబ్దుల్‌ రజాక్‌ను స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు. 


వెంకటయ్య(ఫైల్‌) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement