♦ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
♦ బైకును లారీ ఢీకొనడంతో ప్రమాదం
♦ తాండూరు మండలం ఓగిపూర్ శివారులో ఘటన
తాండూరు రూరల్ : స్నేహితుడికి తోడుగా వెళు ్తన్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాల య్యా డు. వారు వెళ్తున్న బైకును లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి కానరాని లోకాలకు తరలివెళ్లాడు. ఈ సం ఘటన మండల పరిధిలోని ఓగిపూర్ శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన వసంత, శేఖర్‌గౌడ్ దంపతుల కుమారుడు హేమంత్‌గౌడ్(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదివి కొంతకాలంగా ఇంటివద్దనే ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువకుడు బాలాజీ మండల పరిధిలోని ఓగిపూర్ గ్రామ శివారులోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.
బాలాజీ, హేమంత్‌గౌడ్ స్నేహితులు. బాలాజీకి గురువారం సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అతడు క ంపెనీకి వెళ్లేందుకు బైకుపై సిద్ధమయ్యాడు. అంతలో తన స్నేహితుడు హేమంత్‌గౌడ్‌ను తోడుగా తీసుకొని బాలాజీ ఫ్యాక్టరీకి బయలుదేరాడు. ఓగిపూర్ శివారులో కంపెనీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ(ఏపీ 28 3537) వీరి బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న బాలాజీ, హేమంత్‌గౌడ్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే తాండూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన హేమంత్‌గౌడ్‌ను వైద్యులు హైదరాబాద్ రిఫర్ చేశారు.
వాహనంలో నగరానికి తీసుకెళ్తుండగా అతడు మార్గమధ్యంలో వికారాబాద్ సమీపంలో మృ తి చెందాడు. దీంతో మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కర్ణాటక సరిహద్దులో ప్రమాదం జరగడంతో మృతుడి కుటుంబీ కులు కర్ణాటకలోని మిర్యాణ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లా రు. చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వసంత, శేఖర్‌గౌడ్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.
స్నేహితుడికి తోడుగా వెళ్తూ..
Published Thu, Jul 9 2015 11:39 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement