loss of revenue
-
ఆదాయాలు క్షీణించినా.. లాభాలు స్థిరమే
ముంబై: ప్రపంచదేశాలు కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలో.. భారత కార్పొరేట్ కంపెనీలు ఆదాయాలను కోల్పోయినా.. తమ లాభాలను మాత్రం తెలివిగా కాపాడుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) తొలి త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు/క్యూ1)లో కంపెనీల ఆదాయాలు ఏకంగా 31 శాతం మేర పడిపోగా.. అదే సమయంలో లాభాల క్షీణత 3.6 శాతానికే పరిమితమైనట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఓ నివేదికలో తెలియజేసింది. 489 కంపెనీల క్యూ1 ఫలితాలను విశ్లేషించిన అనంతరం ఇక్రా ఈ వివరాలను విడుదల చేసింది. మొదటి త్రైమాసికంలో జీడీపీ ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. మొదటి రెండు నెలలు (ఏప్రిల్, మే) దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించడమే కారణంగా పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడం వల్ల జూన్ త్రైమాసికానికి ముందు వరుసగా మూడు త్రైమాసికాల్లోనూ కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. జూన్ త్రైమాసికంలో మాదిరి భారీ క్షీణతను ఎప్పుడూ చూడలేదని ఇక్రా స్పష్టం చేసింది. ‘‘తయారీ, పారిశ్రామిక, నిర్మాణ, వినియోగ కార్యకలాపాలపై క్యూ1లో ఎక్కువ భాగం నియంత్రణలు కొనసాగాయి. ఇదే ప్రధానంగా కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపించింది’’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. నివేదికలోని అంశాలు..: వినియోగ ఆధారిత రంగాలలో ఆదాయాల క్షీణత ఎక్కువగా ఉంది. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 2020 జూన్ క్వార్టర్లో ఆదాయాలు సగం మేర పడిపోయాయి. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో, కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల వినియోగదారులు ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. విచక్షణారహిత వినియోగం కిందకు వచ్చే ఎయిర్‌లైన్స్, హోటళ్లు, రిటైల్, ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడింది. అదే ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ గూడ్స్ విభాగాలపై తక్కువ ప్రభావం పడింది. పన్నుకు ముందస్తు మార్జిన్లు క్యూ1లో 3.6 శాతానికి పరిమితమయ్యాయి. అంతక్రితం మార్చి త్రైమాసికంలో మార్జిన్లు 4.3 శాతంగా ఉన్నాయి. మార్జిన్లు ఎక్కువగా ప్రభావితమైన వాటిల్లో ఎయిర్ లైన్స్, హోటళ్లు, రిటైల్, హెల్త్ కేర్, జెమ్స్ అండ్ జ్యుయలరీ రంగాలున్నాయి. చారిత్రక కనిష్టాలకు పడిపోయిన మార్జిన్లు ప్రస్తుత త్రైమమాసికం నుంచి క్రమంగా మెరుగుపడతాయి. -
ఎస్టీపీపీకి ఏమైంది.. రోజుకు రూ.కోటిన్నర నష్టం
సాక్షి, జైపూర్(కరీంనగర్) : జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. విద్యుత్ వెలుగులు విరజిమ్మాల్సిన థర్మల్ ప్రాజెక్టులో కాంతులు కరువయ్యాయి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుకు గడ్డుకాలం ఎదురవుతోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గిపోవడంతో థర్మల్ పవర్‌కు రోజురోజుకూ డిమాండ్ పడిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ తగ్గడంతో జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి ట్రాన్స్‌కో ఉత్పత్తి నిలిపివేసింది. 20 రోజులుగా యూనిట్–2 (600మెగావాట్ల ప్లాంటు) షట్‌డౌన్‌కే పరిమితమైంది. యూనిట్–1 (600మెగా వాట్లప్లాంటు) కేవలం 80శాతం పీఎల్ఎఫ్ (ప్లాంటు లోడ్ ఫ్యాక్టరీ)తో నడుస్తోంది. ఒక్కరోజులో రెండు యూనిట్ల ద్వారా 27 మిలియన్ యూనిట్ల నుంచి 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన ఎస్టీపీపీ.. ఇప్పుడు కేవలం 11 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడంతో రెండు యూనిట్ల ద్వారా ఒక్క రోజుకు కనీసం రూ.కోటిన్నరకుపైగా నష్టం వాటిల్లుతోంది. జైపూర్ మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మించిన 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజె క్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫ రా చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంటు కీలకంగా మారింది. సీఎం కేసీఆర్ సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడంతో రెండు యూని ట్లు (12మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంటు) ద్వారా మూడేళ్లల్లో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి సాధించారు. సింగరేణి సంస్థ జర్మనీకి చెందిన స్టీగ్‌ఎనర్జీ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వి ద్యుత్ ఉత్పత్తి నిర్వహణ బాధ్యతలు అప్పగించి న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవడం.. హైడల్ ప్రాజెక్టుల ద్వారా పవర్ ఉత్పత్తి కావడం.. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో సింగరేణి థర్మల్ పవర్‌కు డిమాండ్ తగ్గిపోతోంది. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అన్ని వనరులు ఉండి.. విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ డిమాండ్ లేనికారణంగా తెలంగాణ ట్రాన్స్‌కో ఎస్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కోరోజుకు 140 మిలియన్ యూనిట్ల నుంచి 160 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను ట్రాన్స్‌కో డిమాండ్ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా 45 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా జెన్కో హైడల్(వాటర్ పవర్) ద్వారా 50 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. సెంట్రల్ థర్మల్ ప్లాంటుల ద్వారా 20 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా విండ్, సోలార్ ద్వారా మరో 20 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ద్వారా కేవలం 11 మిలి యన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి మాత్రమే చే స్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను బట్టి తెలంగాణ ట్రాన్స్‌పవర్ గ్రిడ్ ఆయా విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాధిస్తోంది. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో గల రెండు యూనిట్లు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించడంతో రోజుకు 27 మిలియన్ యూ నిట్ల నుంచి 30మిలియన్ యూనిట్ల వరకు వి ద్యుత్ ఉత్పత్తి పవర్ గ్రిడ్‌కు సరఫరా చేయగా.. 20 రోజుల వ్యవధిలో యూనిట్–2 ప్లాంటు (అక్టోబర్ 23 నుంచి) పూర్తిగా షట్‌డౌన్ చేశారు. యూనిట్–1లో కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరపకుండా కేవలం 80శాతం పీఎల్‌ఎఫ్‌తో నడిపిస్తున్నారు. 27మిలియన్ యూని ట్లు సాధించిన ఎస్టీపీపీ ఇప్పుడు కేవలం 11మి లియన్ యూనిట్లకు విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా నీరు, బొగ్గు, ఆయిల్ కాగా అన్ని వనరులు కలిగి ఉన్నప్పటికీ విద్యుత్ డిమాండ్ లేనికారణంగా ఉత్పత్తి నిలిపివేయడంతో రెండు యూనిట్ల ద్వారా ఒక్కరోజుకు రూ.కోటిన్నరకుపైగా నష్టం వాటిల్లుతోంది. ఇలా 20రోజుల వ్యవ«ధిలో రూ.28 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గతేడాది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఉండ డం.. ఎస్టీపీపీ ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించడం ద్వారా సింగరేణిలో సాధిం చిన లాభాల్లో అత్య«ధికంగా రూ.510 కోట్లు ఎస్టీపీపీ నుంచే వచ్చాయి. ప్రస్తుతం పవర్ డిమాండ్ పడిపోవడం ఈ ఏడాది అంతగా లాభాలు వచ్చేలా కనిపించడం లేదు. -
గోల్మాల్
ఇది చంద్రన్న విలేజ్ మాల్స్‌లో లభిస్తున్న బెల్లం. కేవలం 450 గ్రాముల నల్లటి బెల్లం ఎంఆర్పీ ఏకంగా రూ.42 ఉంది. దీన్ని ఆఫర్ కింద రూ.37కు అమ్ముతున్నారు. అదే బహిరంగ మార్కెట్లో మొదటి రకం బెల్లం కిలో రూ.48కే లభిస్తోంది. ఒక్క బెల్లమే కాదు.. చింతపండు, ఇతర నిత్యావసర వస్తువులదీ ఇదే పరిస్థితి. కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 54 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. డీలర్లు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాల్ ఏర్పాటు చేయాలంటే డీలరుకు 200 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన షాపు ఉండాలి. అది కూడా రోడ్డుకు వంద మీటర్లలోపు ఉండాలి. ఇప్పటివరకు అతికష్టం మీద ఆరు మాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని కర్నూలు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆలూరు, పాణ్యం, కోడుమూరులో ప్రారంభించారు. ఇవి కూడా వినియోగదారులు రాక వెలవెలబోతున్నాయి. ఈ మాల్స్‌కు రిలయన్స్ సంస్థ సరుకులు సరఫరా చేస్తోంది. నాణ్యమైన నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువులనూ మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే..వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాల్స్‌కు సరఫరా అవుతున్న సరుకుల్లో కొన్ని నాణ్యతగా ఉండడం లేదు. ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మరీముఖ్యంగా బెల్లం, చింతపండు, శనగపప్పు, మినపపప్పు, చక్కెర, పామోలిన్ ప్యాకెట్లు తదితర వస్తువుల నాణ్యత, ధరల పట్ల వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. నాణ్యత బాగుంటే ఒకటి, రెండు రూపాయలు ఎక్కువ ఉన్నా తీసుకుంటారు. అయితే.. సరుకులు నాసిరకంగా ఉండడం, ధర కూడా ఎక్కువ కావడంతో వినియోగదారులు మాల్స్ వైపు వెళ్లడం లేదు. దీంతో డీలర్లు వాటిని మూసి ఉంచుతున్నారు. ఊరించి నష్టాల ఊబిలోకి.. చంద్రన్న విలేజ్ మాల్స్‌ను నిర్వహించే డీలర్లకు సరుకుల అమ్మకాలపై ఎనిమిది శాతం కమీషన్ ఇస్తామని మొదట్లో ఊరించారు. షాపును మాల్గా తీర్చిదిద్దేందుకు అయ్యే ఖర్చును వంద శాతం భరిస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేవలం మూడు శాతం కమీషన్‌తో సరిపుచ్చుతున్నారు. కర్నూలు ప్రకాశ్‌నగర్‌లోని రేషన్‌షాపు నంబరు 50లో చంద్రన్న విలేజ్ మాల్‌ను మూడు నెలల క్రితం ఏర్పాటు చేశారు. దీన్ని డిజైన్ చేసిన వ్యయంలో 50 శాతం మొత్తాన్ని ఎనిమిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని రిలయన్స్ సంస్థ ఒత్తిడి తెస్తోంది. డీలర్‌కు ఎనిమిది శాతం కమీషన్ ఇస్తామని మభ్యపెట్టి మూడు శాతంతో సరిపుచ్చుతోంది. పైగా బయటి మార్కెట్ కంటే తక్కువ ధర ఉండి.. డిమాండ్ ఉన్న వస్తువులను సరఫరా చేయడం లేదు. నాణ్యత లేని, అధిక ధరలు ఉన్న సరుకులను మాత్రమే సరఫరా చేస్తోందని డీలర్లు వాపోతున్నారు. ఇదెలా సాధ్యమో? చంద్రన్న విలేజ్‌మాల్‌కు సరఫరా చేసే 25 గ్రాముల సబ్బు ఎంఆర్పీ రూ.5గా నిర్ణయించారు. దీన్ని ఆఫర్ కింద రూ.4.70కి విక్రయించాల్సి ఉంది. డీలరుకు వేస్తున్న ధర రూ.5.40. పైగా నెలకు రూ.2 లక్షల విలువైన వస్తువులను సరఫరా చేస్తామని చెప్పిన రిలయన్స్ సంస్థ అడ్డగోలుగా ధరలు పెంచి తూతూ మంత్రంగా సరుకులు ఇస్తోంది. నిర్వహణ భారంగా మారింది షాపు డిజైన్ చేసిన ఖర్చు మొత్తం భరిస్తామని మొదట్లో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మొత్తం ఖర్చులో 50శాతం 8శాతం వడ్డీతో చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. 8శాతం కమీషన్ ఇస్తామని చెప్పి 3శాతం మాత్రమే ఇస్తున్నారు. మార్చిలో రూ.1,193, ఏప్రిల్‌లో రూ.3,002 మాత్రమే కమీషన్ వచ్చింది. కరెంటు బిల్లు రూ.800 దాకా వస్తోంది. షాపును శుభ్రం చేయడానికి రూ.1,200 ఇవ్వాల్సి వస్తోంది. కమీషన్ ఏ మూలకూ చాలడం లేదు. పైగా డిమాండ్ ఉన్న వస్తువులు సరఫరా చేయరు. డిమాండ్ లేని సరుకులు మాత్రం అడగకపోయినా ఇస్తున్నారు. ఇలాగైతే ఈ మాల్‌ను నిర్వహించడం కష్టం. – కరుణాకర్గుప్త, 50వ షాపు డీలర్, కర్నూలు -
జాక్‌పాట్ లారీలకు రెడ్‌కార్పెట్
చోటా ట్రాన్స్పోర్టర్లపైనే కేసులు బడాబాబులతో చెక్‌పోస్టు సిబ్బంది కుమ్మక్కు బీవీపాళెం(తడ): బీవీపాళెం మీదుగా తమిళనాడు నుంచి ఆంధ్రాలోకి అక్రమంగా సరుకులు తరలిస్తున్న జాక్‌పాట్ వ్యాపారులకు చెక్‌పోస్టు సిబ్బంది సహకారం సంపూర్ణంగా లభిస్తోంది. గతంలో యథేచ్ఛగా అక్రమ రవాణా సాగినప్పటికీ కొంత కాలంగా ఆగకుండా వెళ్లిన వాహనాల వివరాలను పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వడంతో అక్రమార్కులు కొంత ఆందోళనకు గురయ్యారు. అదే విదంగా సూళ్లూరుపేట, తమిళనాడులోని కార్నోడై ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరాల సాయంతో చెక్‌పోస్టులో ఆగకుండా వెళ్లిన వాహనాల వివరాలను తీసుకోవడంతో మరో మార్గాల్లో తప్పించుకునే విధానంపై దారులు వెతకడం చేశారు. కానీ ప్రస్తుతం కొంత కాలంగా బడా వ్యాపారులు చెక్‌పోస్టు సిబ్బంది సంపూర్ణ సహకారంతో చెక్‌పోస్టు మీదుగా అక్రమ రవాణా సాఫీగా చేసుకుపోతున్నారు. ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టేసేందుకు, బయటి నుంచి విమర్శలు రాకుండా చూసేందుకు ఒకటీ అరా చిన్నచిన్న ట్రాన్స్‌పోర్టర్లకు చెందిన లారీలను ఆపి తనిఖీలు చేస్తూ పన్ను, జరిమానాలు కట్టిస్తున్నారు. అనుమానం రాకుండా నామమాత్రంగా అప్పుడప్పుడు బడా బాబులకు చెందిన ట్రాన్స్‌పోర్టు లారీలను తక్కువ తప్పులున్న వాహనాలను పట్టుకుని తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళలో ఓ పద్ధతి ప్రకారం కొంత సమయం రోడ్డుపై తనిఖీ చేసే అధికారులు ఎవరూ లేకుండా బడాబాబు పార్సిల్ లారీలను రాజమార్గంలో పంపేలా సహకరిస్తున్నారు. ఇక్కడి నుంచి తప్పించుకుంటే ఈ లారీలను ఇక విజయవాడ, హైదరాబాదు వరకు ఎవరూ ఆపే సాహసం చెయ్యరు. జూలై 14న ఆరంబాకం వద్ద నాలుగు లారీలు ఆగి చెక్‌పోస్టులో వాతావరణం అనుకూలం అయ్యాక పైలెట్ సూచనతో తరలివెళ్లాయి. అనంతరం 15వ తేదీన కూడా అదే పద్దతిలో మరిన్ని వాహనాలు వెళ్లాయి. దీనిపై అప్పట్లో ఏఓ రవికుమార్ స్పందిస్తూ 16వ తేదీ నుంచి వాహనాలపై నిఘా ముమ్మరం చేసి వెళ్లిపోయిన వాహనాల వివరాలను కూడా తెలుసుకుంటానని తెలిపారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. గతంలో ఇలా వెళ్లిన నాలుగు వందల వాహనాల వివరాలు పదిరోజుల వ్యవధిలో సేకరించిన అధికారులు ప్రస్తుతం ఆగకుండా వెళ్లిన వాహనాలకు సంబందించి తేదీలు, వాహనాల నంబర్లు అన్నీతెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేకున్నారో అంతుబట్టడం లేదు.