Losses on diesel sales
-
ఆగని అమ్మకాలు : నష్టాల్లో మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. ఎఫ్ అండ్ వో సిరీస్ మొదటి రోజు కావడంతో వెంటనే అమ్మకాలు వెల్లువెత్తాయి, దీంతో సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 37724 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లుకోల్పోయి 11220 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రభుత్వ బ్యాంకులుతప్ప మిగతా అన్ని రంగాల్లోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. వేదాంత, ఎస్‌బ్యాంకు, బీవోబీ లాభపడుతుండగా, ఎంఫసీస్, టాటామోటార్స్, డీహెచ్ఎఫ్ఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ నష్టపోతున్నాయి. జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ చివరి రోజు ట్రేడర్లు పొజిషన్లు రోలోవర్ చేసుకోవడం,షార్ట్ కవరింగ్ కారణాలతో గురువారం మార్కెట్ భారీ ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఆరంభంలో 100 పాయింట్లకుపైగా ఎగిసినా చివరికి నష్టాల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. అటు డాలర్ మారకంలో రుపీ బలహీనంగా ఉంది. -
పుల్వామా ప్రకంపనలు
పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి ప్రకంపనలు స్టాక్ మార్కెట్లో ప్రతిధ్వనించాయి. ఫలితంగా స్టాక్ సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ నష్టపోవడం ఇది వరుసగా ఎనిమిదో రోజు. పుల్వామా దాడి నేపథ్యంలో భారత, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావారణం నెలకొనడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, ముడి చమురు ధరలు భగ్గుమం టుండటంతో స్టాక్ మార్కెట్లో నష్టాలు కూడా కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. 83 పాయింట్లు క్షీణించి 10,641 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 311 పాయింట్లు పతనమై 35,498 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎమ్సీజీ, బ్యాంక్, ఐటీ, వాహన, ఫార్మా షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 2013, ఆగస్టు తర్వాత స్టాక్ సూచీలు వరుసగా ఇన్ని రోజులు నష్టపోవడం ఇదే మొదటిసారి. బ్యాంక్ షేర్లకు రేట్ల దెబ్బ ఆర్బీఐ రెపోరేటును పావు శాతం తగ్గించినప్పటికీ, కొన్ని బ్యాంక్‌లు మాత్రమే వడ్డీరేట్లను తగ్గించాయి. వడ్డీరేట్లను వినియోగదారులకు బదలాయించే విషయమై ఈ వారంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ అధినేతలతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశం కానున్నారు. దీంతో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అక్కడ పండగ... ఇక్కడ దండగ ప్రపంచ మార్కెట్లలో పండగ వాతావరణం ఉన్నా మన మార్కెట్లో మాత్రం దండగ వాతావరణం కొనసాగుతోంది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా– చైనా మధ్య తాజాగా వాషింగ్టన్లో చర్చలు ప్రారంభం కావడంతో ఆసియా మార్కెట్లు సోమవారం మంచి లాభాలు సాధించాయి. హాంగ్‌కాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ 1.6 శాతం, జపాన్ నికాయ్ 1.8 శాతం, చైనా షాంగై సూచీ 2.6 శాతం, కొరియా కోస్పి 0.7 శాతం మేర పెరిగాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమైనా, ఆ తర్వాత లాభాల్లోకి ఎగసి, స్వల్ప లాభాలతో ముగిశాయి. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి వరుస ఎనిమిది రోజుల నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. ఈ నెల 7న రూ.142.74 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్... సోమవారం నాటికి రూ. రూ.136.33 లక్షల కోట్లకు పడిపోవడం గమనార్హం. -
ఆల్‌టైం కనిష్టానికి డీజిల్ నష్టాలు
లీటరుపై రూ. 1.33కి తగ్గుదల ఇలాగే ఉంటే మరో 3 నెలల్లో డీకంట్రోల్! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు డీజిల్ విక్రయాలపై వస్తున్న నష్టాలు ఆల్‌టైం కనిష్ట స్థాయికి తగ్గాయి. లీటరుకు రూ. 1.33 స్థాయికి దిగి వచ్చాయి. దీంతో, ఇదే పరిస్థితి కొనసాగితే డీజిల్ రేట్లపై నియంత్రణను మరో మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు బలపడ్డాయి. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం గత నెలలో డీజిల్ రిటైల్ విక్రయాలపై లీటరుకు రూ. 2.49 మేర ఉన్న నష్టాలు ప్రస్తుతం రూ. 1.33కి తగ్గాయి. అటు అంతర్జాతీయంగా చమురు రేట్లు క్షీణించడం, ఇటు కొత్త ప్రభుత్వం కూడా ప్రతి నెలా రేట్లను పెంచడం కొనసాగించడం ఇందుకు తోడ్పడ్డాయి. తాజాగా గురువారం కూడా డీజిల్ రేటు అర్ధరూపాయి మేర పెరిగిన సంగతి తెలిసిందే. డీజిల్ డీకంట్రోల్పై గత యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 2013 జనవరి నుంచి రేట్లు 18 సార్లు పెరిగాయి. మొత్తం మీద రేటు లీటరుకు రూ. 11.24 మేర పెరిగింది. నెలవారీ పెరుగుదల కారణంగా గతేడాది మేలో లీటరు డీజిల్‌పై నష్టాలు రూ.3 స్థాయికి తగ్గినప్పటికీ.. రూపాయి క్షీణత కారణంగా సెప్టెంబరు నాటికల్లా ఇవి రూ. 14.50 స్థాయికి పెరిగిపోయాయని అధికారులు వివరించారు. అప్పట్నుంచి రూపాయి బలపడుతుండటంతో పాటు రేట్ల పెంపూ కొనసాగింది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలతో రూపాయి బలపడుతూ పోవడం వల్ల మార్చి నుంచి డీజిల్ విక్రయాలపై నష్టాలు వేగంగా తగ్గసాగాయి. మార్చ్‌లో రూ. 8.37గా ఉన్న నష్టాలు మేలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ. 4.41కి తగ్గాయి. జూన్ ద్వితీయార్థంలో రూ. 1.62కి క్షీణించినా.. జూలై ప్రథమార్ధంలో మళ్లీ రూ. 3.40కి పెరిగాయి. మళ్లీ గత నెల ద్వితీయార్థంలో రూ. 2.49 స్థాయికి తగ్గాయి.